Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మీ పార్ట్ నర్ మీ నుండి సీక్రెట్ గా కోరుకునేదేంటో తెలుసా...
మీ భాగస్వామి మిమ్మల్ని ఇష్టపడాలంటే ఈ పనులు చేయండి...
మనలో చాలా మంది తమ మనసుకు నచ్చిన అమ్మాయి మనసు గెలవాలంటే విలువైన బహుమతులు, ఖరీదైన ఆభరణాలు, నగలు బహుమతులుగా ఇవ్వాలనుకుంటారు.

అయితే ఇదంతా వాస్తవం కాదు.. అయితే రోజ్ ఫ్లవర్స్, చాక్లెట్లు వంటి వాటిని ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. మీకు పడిపోతారనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే..

మీ కిష్టమైన వారు మిమ్మల్ని ఇష్టపడాలంటే అలాంటివి కాకుండా అంతకుమించిన ఎన్నో అత్యద్భుతమైన మార్గాలున్నాయి. అందులోనూ వారు వాటిని చాలా రహస్యంగా కావాలని కోరుకుంటారని తెలుసా.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రేమగా అడగండి..
మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నా లేదా ప్రేమలో ఉన్నప్పటికీ.. మీ భాగస్వామితో ప్రతిరోజూ ప్రేమగా మాట్లాడండి. ప్రతిరోజూ ఈరోజు ఎలా ఉందని అడగండి.. ఇలాంటివి అమ్మాయిలు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారు. ఇలా అడిగినప్పుడల్లా మీ భాగస్వామిపై మీరు నిజంగా శ్రద్ధ చూపుతున్నారని వారు విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎల్లప్పుడూ ఉంటాను..
మీరు చెప్పినా.. చెప్పకపోయినా మీ భాగస్వామి కోసం మీరు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారని తెలుసు. అయితే అలాంటి వాటిని మీ పార్ట్ నర్ కి తెలియజేయడం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మాటలను మీ భాగస్వామితో మీరు ప్రేమగా మాట్లాడటం ద్వారా వారు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. అంతేకాదు వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు, వారి చేయిని పట్టుకుని.. మీరు వారితో ఉన్నారని ధైర్యం చెప్పండి చాలు. వారు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.

ఇలా వ్యవహరించండి..
మీరు మీ పార్ట్ నర్ తో పాటు ఇతరులతో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడండి. మీరు ఇతరుల పట్ల కూడా ప్రవర్తించే విధానాన్ని బట్టి మీ భాగస్వామికి మీపై ఓ సదాభిప్రాయం ఏర్పడుతుంది. అంతేకానీ.. మీరు ఎట్టి పరిస్థితుల్లో కోపంగా, దురుసుతనంగా మాట్లాడకండి.

నవ్వించండి..
చాలా మంది అమ్మాయిలకు నవ్వించే వారంటే బాగా ఇష్టం. అందుకే కామెడీ చేసే వారిని స్త్రీలు బాగా ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా కొన్ని జోకులు వేయడం మీ రిలేషన్ కు మంచిదే. కాకపోతే అవి లిమిట్స్ లో ఉండేలా చూసుకోండి. డబుల్ మీనింగ్ లేదా చిరాకు కలిగించే జోకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఇందుకోసం మీరు జోక్స్ పుస్తకాలు కొనాల్సిన పని లేదు. మీ కాలేజీ రోజుల్లో లేదా మీ ఆఫీసులో, ఇంకా ఏదైనా చోట జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను చెబితే చాలు.. వారు కచ్చితంగా నవ్వుతారు.

పొగడ్తలు..
ఈ లోకంలో పొగడ్తలకు పడిపోని వారు ఎవరుంటారు చెప్పండి. కాబట్టి, మీరు ఇష్టపడే భాగస్వాములను పొగిడే అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు. ఇందుకోసం మీరు పెద్ద కవితలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పొగడ్తల్లో నిజాయితీ ఉంటే చాలు.. ఆమె పర్సనాలిటీ, బ్యూటీని మరియు మంచి లక్షణాలను పొగిడితే చాలు.. తనకు మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది.

ఇవి తెలుసుకోండి..
ముందుగా మీ భాగస్వామికి ఎలాంటి రంగులు ఇష్టమో తెలుసుకోండి.. అలాగే తను ఇష్టపడే ఫుడ్, మ్యూజిక్ తో పాటు తన అలవాట్లు, అభిరుచులు తెలుసుకోండి. అందులో కొన్ని మీకు ఇష్టం లేనివి ఉన్నా కూడా.. తనకు ఇష్టం కాబట్టి.. దానికి సంబంధించిన ఫన్ గేమ్స్ ప్లాన్ చేయండి. ఇందులో మీ ఫ్రెండ్స్ ను యాడ్ చేయండి. దీని వల్ల మీరంటే కచ్చితంగా తనకు సదాభిప్రాయం ఏర్పడుతుంది.

యాక్టింగ్ చేయొద్దు..
కొందరు అబ్బాయిలు తమకు నచ్చిన వారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో తెగ యాక్టింగ్ చేస్తుంటారు. తన గురించి పూర్తిగా తెలియకుండానే తనకు షాకులివ్వాలనుకుంటారు. ఇలా చేస్తే తను సర్ ప్రైజ్ అవుతుందని భావిస్తారు. కానీ అలా చేయడం వల్ల మీపై నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

నలుగురిలో ఉన్నప్పుడు..
మీ భాగస్వామి నలుగురిలో ఉన్నప్పుడు తనను ఎగతాళి చేసి మాట్లాడటం వంటివి ఎప్పటికీ చేయకండి. నలుగురిలో తనను అందరూ మెచ్చుకునేలా వ్యవహరిస్తే.. తను మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.

క్షమాపణలు..
మనం రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటాం. అయితే అలాంటి సమయంలో కోప్పడకుండా.. మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించమని అడగండి.. అదే సందర్భంలో తన వైపు నుండి ఏదైనా తప్పు జరిగితే. క్షమిస్తున్నానని చెప్పండి.

అద్భుతమైన వ్యక్తి..
మీ భాగస్వామి మీ నుండి వినడానికి మరో మాట ఇది. మీ భాగస్వామిలో ఎన్ని లోపాలున్నప్పటికీ.. తను ఒక అద్భుతమైన వ్యక్తి అని చెబితే చాలు.. వారు చాలా ఆనందంగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications