For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉమ్మడి కుటుంబంలో వాళ్లతో సమస్యలు రాకూడదంటే...

ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు భార్య మరియు తల్లి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి.

|

ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న కుటుంబాల వ్యవస్థకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Tips For Men Who Are Stuck Between Wife And Mother In A Joint Family

అయితే కొన్ని చోట్ల ఉమ్మడి కుటుంబాలు సైతం చాలా ఆనందంగా జీవిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలను చాలా తక్కువగా చూస్తున్నాం. చిన్న కుటుంబాల వల్ల కష్ట సుఖాలు ఎలా ఉన్నాయో.. ఉమ్మడి కుటుంబంలో కూడా ప్రత్యేకమైన కష్ట సుఖాలు ఉన్నాయి. ఇక కొత్తగా పెళ్లయి అత్తమామలతో కలిసి జీవిస్తున్న వారైతే తమకంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.

Tips For Men Who Are Stuck Between Wife And Mother In A Joint Family

ఎందుకంటే రాత్రి వేళలో తప్ప.. పగటిపూట ఏకాంతంగా గడిపేందుకు అస్సలు సమయం దొరకదు. ఏ సమయంలో ఎవరొచ్చి తలుపు కొడతారో అస్సలు తెలీదు. మరీ ముఖ్యంగా కాస్త గట్టిగా మూలిగితే ఇతరులు ఏమనుకుంటారో అని భావిస్తూ.. ఆనందాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంది చేస్తారు. ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత పురుషుల జీవితం చాలా కష్టంగా ఉంటుంది.

Tips For Men Who Are Stuck Between Wife And Mother In A Joint Family

ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన సమయంలో అటు అమ్మకు మద్దతు చేయాలన్నా.. ఇటు భార్యకు మద్దతు చేయాలన్నా.. చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు పురుషులు ఉద్యోగ రీత్యా నగరంలో ఉంటూ తమ తల్లి మరో ప్రాంతంలో ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. అయితే భార్య మరియు తల్లి ఎప్పుడైతే ఒకే చోట ఉంటారో అప్పుడే కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓ వైపు తన భార్యకు సపోర్ట్ చేస్తే.. అమ్మకు కోపం వస్తుంది.. అమ్మకు సపోర్ట్ చేస్తే.. భార్యకి కోపం వస్తుంది.. ఇలాంటి పరిస్థితులకు మగాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సందర్భంగా తల్లి మరియు భార్య విషయంలో ఎలాంటి కారణాల వల్ల సమస్యలు వస్తాయి.. అలాంటి సమస్యలను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో మీ మూడ్ పెంచే స్టెప్స్ ఏంటో చూసెయ్యండి...పడకగదిలో మీ మూడ్ పెంచే స్టెప్స్ ఏంటో చూసెయ్యండి...

జనరేషన్ గ్యాప్..

జనరేషన్ గ్యాప్..

భార్య మరియు తల్లి మధ్య జనరేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు రావొచ్చు. ఎందుకంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్క సమస్యకు వారి దగ్గర పరిష్కారం ఉంటుంది. మగవారు పెళ్లి కంటే ముందు తల్లికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పెళ్లి తర్వాత చాలా మందికి ఆటోమేటిక్ గా ఆ ప్రాధాన్యత అనేది మారిపోతూ ఉంటుంది.

మీరే ప్రపంచం..

మీరే ప్రపంచం..

ఒకరేమో చిన్నప్పటి నుండి మిమ్మల్ని అల్లారుముద్దుగా పెంచి.. ప్రేమతో పెద్ద చేసి మంచి పొజిషన్ కు తీసుకొచ్చిన అమ్మ ఒకవైపు.. మీకోసం కన్న వారిని వదులుకుని.. తన అలవాట్లు, అభిరుచులు, పద్ధతులు వదులుకుని మీరే ప్రపంచం అనుకుంటూ.. మీరే తన భవిష్యత్తు అనుకుంటూ వచ్చిన భార్యను హ్యాండిల్ చేయడం కొంత కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి తర్వాత ఒకరిని డీల్ చేయడం బెటర్.

కిచెన్లో స్టార్ట్..

కిచెన్లో స్టార్ట్..

సాధారణంగా ఇద్దరు ఆడవారు కిచెన్లో చేరి వంటలు చేయడం మొదలుపెడితే.. గొడవలు అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయని నిపుణులు చెబుతుంటారు. అందులోనూ అత్తా కోడళ్లు అయితే మరీ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుదట. చాలా ఉమ్మడి కుటుంబాల్లో పెద్ద పెద్ద గొడవలన్నీ అక్కడ నుండే ప్రారంభమవుతాయట. అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయట. కాబట్టి వారిద్దరూ వంటగదిలోకి ఒకేసారి వెళ్లకుండా చూడాలి. ఒకరు వంట వండితే.. మరొకరు పాత్రలు క్లీన్ చేయడం వంటి పనులుగా డివైడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.

మగాళ్ల బాడీలోనూ సెన్సిటివ్ ప్లేసులుంటాయని తెలుసా.. వారిని అక్కడ తాకితే...!మగాళ్ల బాడీలోనూ సెన్సిటివ్ ప్లేసులుంటాయని తెలుసా.. వారిని అక్కడ తాకితే...!

మనస్పర్దలు రాకుండా..

మనస్పర్దలు రాకుండా..

ఏ సంబంధంలో అయినా గొడవలు రావడానికి ప్రధాన కారణం అపార్థం చేసుకోవడం. సరైన మాటలు లేని కారణంగా ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో అపార్థం చేసుకోకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. అయితే మీరు చాలా ఓపెన్ గా మాట్లాడాలి. ఇద్దరితోనూ మంచిగా మాట్లాడితే ఎలాంటి సమస్యా ఉండదు.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి..

కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి..

సాధారణంగా మగవారికి ఏదో ఒక విషయంలో.. లేదా ఏదో ఒక సందర్భంలో కోపం అనేది సహజంగా వస్తుంటుంది. అయితే అలాంటి సమయంలో మీరు కంట్రోల్ లో ఉండాలి. ఆ కోపాన్ని మీరు తల్లి లేదా భార్యపై చూపితే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. మీరు కోపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడాలి. ముఖ్యంగా మీ అమ్మగారితో గౌరవంగా మాట్లాడాలి.

వేర్వేరుగా టైం కేటాయించండి..

వేర్వేరుగా టైం కేటాయించండి..

మీరు తల్లి మరియు భార్య ఉండే ఇంట్లో ఉన్నప్పుడ వారిద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండాలంటే.. మీరు వారిద్దరికీ ప్రత్యేక సమయం అంటూ కేటాయించాలి. మీ తల్లికి కాస్త సమయం ఇవ్వడం అస్సలు మరువొద్దు. ఒకరిని షాపింగుకు తీసుకెళ్తే.. మరొకరితో కలిసి ఇంట్లో టివి చూస్తూ ప్రేమగా గడపడం వంటివి చేయాలి. మగాళ్లు ఇలాంటి చిట్కాలు ఫాలో అయితే ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు.

English summary

Tips For Men Who Are Stuck Between Wife And Mother In A Joint Family

Here are these tips for men who are stuck between wife and mother in a joint family. Have a look
Story first published:Tuesday, October 26, 2021, 18:30 [IST]
Desktop Bottom Promotion