For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేడీస్ చేసే ఈ పనులతో మగాళ్లకు ఉత్సాహం ఉరకలేస్తుందట...!

|

ఒకప్పుడు రొమాన్స్ అంటే.. కేవలం పడకగదికి పరిమితమైన అంశం. అయితే ఇప్పుడు రొమాన్స్ పడకగదిని దాటి బయటకొచ్చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రొమాన్స్, సెక్స్ అనే పదాలు విన్నప్పుడు వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. కపుల్స్ లో ఎప్పుడు.. ఎవరికి మూడ్ వస్తుందో అస్సలు తెలియదు. ఇద్దరిలో ఎవరికి ఏది సెక్సీ కనిపిస్తుందో అర్థం కాదు.

అయితే మీరు మీ భాగస్వామికి సెక్సీగా కనిపించాలంటే.. వారిలో మూడ్ తీసుకురావాలన్నా.. రోజంతా వారు మీ గురించే ఆలోచించేలన్నా కొన్ని చిట్కాలను పాటించాలి... అందుకోసం మీ కట్టు, బొట్టు.. నడకతో పాటు వీటిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతే మీరు చాలా సెక్సీగా మారిపోతారు.. అదెలాగో మీరే చూడండి...

పెద్దలు కుదర్చిన పెళ్లి సక్సెస్ అయ్యేందుకు గల కారణాలేంటో తెలుసా...

వ్యాయామం చేయండి..

వ్యాయామం చేయండి..

మీరు రెగ్యులర్ వ్యాయామం చేయడం లేదా వర్కౌట్స్ చేయడం ద్వారా మంచి శరీర ఆక్రుతిని పొందుతారు. ఇందుకోసం మీరు చాలా ఓపిక, పట్టుదలతో ఉండాలి. మీరు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉంటే.. మగవారికి చాలా ఇష్టమట. ఇలాంటి వర్కౌట్స్ లో ఒకటి కెటిల్ బెల్ స్వింగ్. కాబట్టి ఇకపై జిమ్ కు వెళితే దీన్ని ట్రై చేయండి.

ఉదయాన్నే ఫొటో..

ఉదయాన్నే ఫొటో..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. దీని ద్వారా కూడా మీరు మీ పార్ట్నర్ ను సంతోషపెట్టొచ్చు. అదెలాగంటే.. మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖం తాజాగా కనిపిస్తుంది. రోజంతా ఏదో ఒక పనిలో పడి మనం అలాంటి తాజాదనాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీ కళ్లు మాత్రం కవరయ్యేలా ఓ సెల్ఫీ తీసుకోండి. మీ కళ్లలోని తాజాదనం మీ పార్ట్నర్ ని మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది.

స్నానం చేయగానే..

స్నానం చేయగానే..

అందమైన అమ్మాయిలంతా స్నానం చేయగానే చాలా రొమాంటిక్ గా కనిపిస్తారు. కాబట్టి స్నానం చేసిన వెంటనే మీ జుట్టు ఆరడానికి ముందే.. తడి జట్టుతో టవల్ లో ఉన్న మీ సెల్ఫీ తీసి మీ శ్రీవారికి లేదా ప్రియుడికి పంపించండి. మీ ఎద భాగాన్ని కవర్ చేస్తూ మరో సగం మాత్రమే కనిపించేలా చేస్తున్న ఆ టవల్ మీ భాగస్వామికి మతి పోయేలా చేయడం ఖాయం.

ఆన్ లైనులో ఆ పనులు చేసేటప్పుడు.. ఇవి మరిస్తే అంతే సంగతులు..!

అందమైన చీరతో..

అందమైన చీరతో..

చీరలంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి. అయితే అందమైన చీరలో తమ భాగస్వామి అద్భుతమైన అందాలను చూడాలని ప్రతి ఒక్క మగాడు కోరుకుంటారు. అయితే సాంప్రదాయబద్ధంగా, రెగ్యులర్ గా కాకుండా రొమాంటిక్ గా ఉండేందుకు బ్లౌజ్ లేకుండా చీరను ధరించండి. ఆ ఫొటోలను మీ పార్ట్నర్ కు పంపండి.

ఉత్సాహంగా ఉంటారట..

ఉత్సాహంగా ఉంటారట..

మీరు మీ బాడీపై ఏదైనా టాటూ వేయించుకుని దానికి సంబంధించిన స్టోరీని చెబితే పురుషులు మైమరచిపోతారట. మీ బాడీని కాన్వాస్ లాగా మార్చుకున్నారంటే.. అది మీకు ఎంత ముఖ్యమో అని భావిస్తారట. అలాగే ట్రెక్కింగ్, ట్రిప్, హైకింగ్.. ఎక్కడికి పోయినా సరే.. మీరు దారి చూపుతూ ఉంటే.. వారు మిమ్మల్ని ఫాలో అవ్వడం వల్ల వారిలో ఉత్సాహం ఉరకలెత్తుతుందట.

క్రీడల గురించి తెలిస్తే..

క్రీడల గురించి తెలిస్తే..

చాలా మంది మహిళలు ఎక్కువగా వంటలు, మేకప్, అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు ఉద్యోగం, చదువుపై ఎక్కువ ఫోకస్ పెడతారు. అయితే కొందరు అమ్మాయిలు ఆటలపైనా ఆసక్తి పెంచుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి ఉండే అమ్మాయిలను అబ్బాయిలు చాలా ఇష్టపడతారట. మీకు క్రీడల పట్ల పరిజ్ణానం ఉంటే.. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారట.

English summary

Tips for Women to Look Sexier in Telugu

Here are these tips for women to look sexier in Telugu. Take a look
Story first published: Wednesday, October 13, 2021, 12:59 [IST]