Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పెళ్లైనా ఆ ముచ్చట తీరలేదా... అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి.. రొమాన్స్ లో రెచ్చిపోండి...!
మీ రాశిని బట్టి మీ వైవాహిక జీవితం రొమాంటిక్ మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..
మన దేశంలో వివాహ జీవితం అనేది ఎంతో కీలకమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అద్భుతమైన ఘట్టం. అప్పటిదాకా ఒంటరిగా బెడ్ పై నిద్రించిన తాము.. పెళ్లి అనే తంతు తర్వాత తమ పడకగదిని మరో వ్యక్తితో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది.

అలా బెడ్ రూమ్ లో తమ భాగస్వామితో బంధం బలపడాలంటే ఏకైక మార్గం శృంగారమే. ఇది ఇద్దరు మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు కూడా చెప్పారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వైవాహిక బంధం బలంగా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. వధూవరులిద్దరి జాతకాలను బట్టి శుక్రుడు, గురుడు యొక్క స్థానాలను బట్టి వారి వైవాహిక బంధంలో సంతోషం ఉంటుందా.. ఉండదా అనే విషయాలను లెక్కిస్తారు పండితులు. అయితే మీ భాగస్వామితో మీరు అనునిత్యం శృంగార భరితంగా గడపాలనుకుంటే.. అది శుక్రుడి యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది.

ఈ సందర్భంగా మీ రాశి చక్రాన్ని బట్టి మీ వైవాహిక జీవితంలో మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో.. మీ మ్యారేజ్ లైఫ్ ను ఎంతలా ఎంజాయ్ చేస్తారో చెప్పొచ్చు.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

మేషరాశి..
ఈ రాశి వారికి కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి వివాహ జీవితం మాత్రం బాగుంటుంది. వీరి జీవిత భాగస్వామిని చాలా నిజాయితీగా ఉంటారు. అయితే వీరు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారు. వీరు మిధునం లేదా కన్యరాశి వారిని పెళ్లి చేసుకోకూడదు. మీ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలంటే మీరు పూలదండను ధరించాలి.

వృషభరాశి..
ఈ రాశి వారికి వివాహ జీవితం చాలా సాఫీగా సాగుతుంది. వీరు భాగస్వామితో చాలా తక్కువ సందర్భాల్లో గొడవ పడుతుంటారు. అయితే వీరు ధనస్సు, మీన రాశి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషం కావాలంటే లేదా రొమాంటిక్ గా గడపాలంటే ఆంజనేయ స్వామిని అనునిత్యం కొలవాల్సి ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారి వివాహ జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. వీరు మేషం, వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. మీరు పెళ్లి తర్వాత లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే.. నీటిలో పసుపును కలిపి సూర్యుడికి సమర్పించాలి..

కర్కాటక రాశి..
ఈ రాశి వారు పెళ్లి తర్వాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరి అభిప్రాయాలతో తమ భాగస్వామి విభేదించవచ్చు. దీంతో వీరు కొంత నిరాశకు గురౌతారు. ఈ రాశి వారు కన్య లేదా వృషభరాశి వారికి దూరంగా ఉండాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా.. శుభప్రదంగా ఉండాలంటే శనిదేవుడిని ఆరాధించాలి. అలా చేస్తేనే.. మీ వివాహ జీవితంలో ఆనందంతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల వీరి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కాలక్రమేణా వీరి సమస్యలు తగ్గి, వీరి జీవితం ఆనందకరంగా మారుతుంది. వీరు మకరం, కుంభ రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు. ప్రతి శనివారం వీరు తప్పకుండా ఏదో ఒక దానిని తయారు చేయాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. అయితే వీరికి భాగస్వామితో ప్రేమ బంధం చాలా బలంగా ఉంటుంది. కానీ మీకు ప్రేమను చూపించడానికి సరైన సమయం దొరకకపోవచ్చు. కర్కాటకం, వృశ్చికం, మేష రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే.. సోమవారం రోజున ఈశ్వరుడికి పూజ చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం వల్ల వీరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వీరు తమ జీవితాన్ని చాలా సరదాగా, స్వేచ్ఛగా గడిపేందుకు ఇష్టపడతారు. వీరు ధనస్సు, మీన రాశిని పెళ్లి చేసుకోకూడదు. ‘ఓ దుర్గే నమః' అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా వీరి జీవితం కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారి వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే.. వీరి జీవితం చాలా మాధుర్యంగా ఉంటుంది. వీరి వివాహ జీవితంలో ఎక్కువగా గొడవలు ఉండవు. అయితే అంతగా రొమాన్స్ ఉండకపోవచ్చు. వీరు రొమాన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. వీరు మిధునం లేదా కన్య రాశి వారికి వివాహం విషయంలో దూరంగా ఉండాలి. వీరు వివాహ జీవితాన్ని ఆనందంగా గడపాలంటే.. వజ్రాన్ని ధరించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అయితే అప్పుడప్పుడు భాగస్వామితో కొన్ని గొడవలు ఉంటాయి. అయితే వీరికి భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా అవి వెంటనే తగ్గిపోతాయి. వీరు వృషభం, తుల రాశి వారికి వివాహం విషయంలో దూరంగా ఉండాలి. వీరు ప్రతిరోజూ తులసి కోట కింద దీపం వెలిగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల మీ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి వివాహ జీవితం కొంత విభిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. వీరు భాగస్వామితో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇదే సమయంలో వీరి మధ్య ప్రేమ కూడా ఉంటుంది. వీరు సింహం, వృశ్చికం, ధనస్సు రాశిని పెళ్లి చేసుకోకూడదు. వీరు నిత్యం శివుడిని పూజించడం ద్వారా.. వీరి వైవాహిక జీవితంలో మనస్పర్దలు, కలహాలు ఉంటే తొలగిపోతాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారు తమ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరి వివాహ జీవితం విచిత్రంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం లేని కారణంగా.. వీరి జీవితం సంతోషకరంగా సాగదు. వీరు కర్కాటక, సింహ రాశుల వారికి దూరంగా ఉండాలి. వీరి వివాహ జీవితం రొమాంటిక్ గా.. సంతోషకరంగా.. సాగాలంటే వీరు ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించాలి.

మీన రాశి..
ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా.. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. వీరి జీవిత భాగస్వామి కూడా చాలా తెలివైన వారు. వీరి మాటలను వినడమే కాదు.. వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అయితే వీరికి ఆర్థిక సమస్యల కారణంగా.. జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభం, కుంభం, తుల రాశి వారిని వివాహం చేసుకోకూడదు. మీ వైవాహిక బంధంలో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలంటే.. మొక్కలను నాటడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.



Click it and Unblock the Notifications











