Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శృంగారం వేళ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.. అది లేకపోతే కార్యం సఫలం కాదు
శృంగారం వేళ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేకపోతే లైంగిక చర్య ద్వారా సంతృప్తి పొందలేరు. శృంగార ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకునేందుకు చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారం.. ఇదంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కానీ దాని గురించి మాట్లాడాలంటే మాత్రం సిగ్గుపడతారు, భయపడతారు. శృంగారం అనేది పూర్తిగా ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అంశం. కానీ దీని గురించి చర్చించడానికి చాలా మంది భయపడిపోతారు. చాలా మందికి లైంగిక విశ్వాసం ఉండదు. లైంగిక విశ్వాసం లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. గతంలో జరిగిన పరిస్థితులు, నొప్పి, ఆచరణలో విఫలం కావడం, ఎమోషనల్ పెయిన్, బ్రేకప్ ఇలాంటి చాలా కారణాలు శృంగార ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి.

దాంపత్య బంధంలో శృంగారం చాలా కీలకమైన పాత్ర. లైంగికంగా సంతోషంగా ఉన్న దంపతుల మధ్య చాలా సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. పడకగదిలో పనితీరుకు ఆటంకం కలిగించే ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరం. లైంగిక విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడే కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి:
చాలా మంది వ్యక్తులు శృంగారం చేస్తున్నప్పుడు వేరే ఆలోచనల్లో మునిగిపోతుంటారు. తాము చేస్తున్న లైంగిక చర్యల వల్ల భాగస్వామి ఆనందపడుతున్నారా, ఇలా చేయడం వారికి ఇష్టమేనా, ఇంకేదైనా చేయాలా అనే ఆలోచనలు వారి మదిలో మెదులుతూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనల వల్ల ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించలేరు.
శృంగార సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం. ఎక్కువగా ఆలోచించడాన్ని, ప్రతికూలంగా ఆలోచించడాన్ని తగ్గించండి. ప్రస్తుతం క్షణాన్ని ఆనందించడానికి ప్రయత్నించండి. శారీరక, మానసిక అనుభవాలపై శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించండి.

మీ భాగస్వామి గురించి మరింత సన్నిహిత విషయాలు తెలుసుకోండి:
లైంగిక విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి నిత్యం నేర్చుకోవడం. మీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, భాగస్వామి శృంగార ఇష్టాయిష్టాలు ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. అలాగే పూర్తి నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి. లైంగిక సంబంధం భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోండి. వ్యక్తిగత విషయాలు తెలుసుకోండి.

మాట్లాడటానికి ఇష్టపడే స్థానం:
శృంగార సమయంలో మాటల అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ శృంగారం చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా చాలా ముఖ్యం. పోర్న్ వీడియోల్లోనో, సినిమాల్లోనో ఎలాంటి మాటలు లేకుండా జరిగే శృంగారం నిజ జీవితంలో వర్కవుట్ కాదని గుర్తుంచుకోండి.
శారీరకంగా, మాటల ద్వారా కమ్యూనికేట్ చేయడం చాలా చాలా కీలకమని గుర్తుంచుకోండి. ఒకటి ఇష్టాయిష్టాలు మరికొరితో పంచుకోవాలి. ఎలాంటి అనుభూతిని ఆస్వాదిస్తున్నారో మాటల ద్వారా, చేతల ద్వారా చెప్పండి.

ఇష్టమైన వాటిని అన్వేషించండి:
శృంగార సంబంధంలో ఉన్నా లేకున్నా, వేరొకరితో శృంగారంలో పాల్గొనే ముందు మీరు ఇష్టపడేదాన్ని ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీరు మీపై మరియు మీ ఆనందంపై దృష్టి పెట్టడం మంచిది. మీ శరీరం దానిలోని ప్రతి భాగం గురించి మీకు ఎలా అనిపిస్తుందో మార్చడానికి సమయం పడుతుంది. మీరు ఇష్టపడే మరియు ఇష్టపడని భాగాల గురించి ఆలోచించండి.

గత అనుభవాల గురించి ఆలోచించడం మానేయండి:
ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. ఆ గతంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. అందులో కొన్ని అద్భుతమైనవి ఉంటే మరికొన్ని నిరుత్సాహపరిచేవి ఉండొచ్చు. మీ గతానికి ప్రస్తుతానికి అలాగే భవిష్యత్తులో మీ పనితీరుతో సంబంధం లేదని అర్థం చేసుకోండి.



Click it and Unblock the Notifications