For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారంలో స్త్రీలను మునుపెన్నడూ లేని విధంగా సుఖపెట్టాలనుకుంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి...

|

శృంగారం అనేది కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఇలాంటి విషయాల్లో ఏవైనా సమస్యలు తలెత్తుతాయని కొందరు కొన్ని రకాల ఆర్టిఫిషియల్ ఆయిల్స్ ను వాడుతున్నారు. ఇంకా కొందరు పెట్రోలియం జెల్లీ వంటి అసహజ పద్ధతుల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటివి చేయడం అమ్మాయిలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అయితే ఎప్పుడూ శృంగారం సుఖంగా అనుభవించే వారు కూడ కొన్నిసార్లు తమ ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మీకు కూడా ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. శరీరం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే, మనసు మాత్రం మరో లోకంలో విహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమయాల్లో చాలా నొప్పిని అనుభవిస్తారు.

కానీ వారిని పంటి బిగువన ఆ నొప్పిని భరిస్తారు తప్ప, అలాంటి విషయాలను బయటపెట్టరు. ఈ నేపథ్యంలో అమ్మాయి మరియు అబ్బాయిలిద్దరి కలయిక సమయంలో మహిళలకు నొప్పి కలగకుండా పూర్తిగా సుఖవంతంగా జరిగేందుకు కొన్ని మెళకువలను తెలుసుకోవాలి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం...

షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట...

భావప్రాప్తి దక్కాలంటే...

భావప్రాప్తి దక్కాలంటే...

మహిళల యోనిలో స్రవాలు ఊరించకుండా మీరు ఆ కార్యంలో బలవంతంగా పాల్గొంటే వారు చాలా ఇబ్బందికి గురవుతారు. ఉదాహరణకు మనకు చింతకాయ, ఉసిరికాయను ఉప్పు, కారం కలుపుకుని నంజుకుని తినబోయే ముందు నోటిలో ఎలాగైతే స్రవాలు ఊరుతాయో, శృంగారంలోనూ అలాంటి భావనాలు కలగాలి. అప్పుడే స్త్రీలతో శృంగార కార్యంలో పాల్గొనాలి. అప్పుడు వారికి నొప్పి అనేది కలగకుండా భావప్రాప్తి కలుగుతుంది.

ప్రతి అంగుళాన్ని..

ప్రతి అంగుళాన్ని..

మీరు ఆమెతో శృంగారంలో పాల్గొనే ముందు ఆమె శరీరాన్ని ఓ ఆట స్థలంగా ఉపయోగించుకోవచ్చు. కేవలం రెండు, మూడు ప్రాంతాలతో ముగించడానికి బదులుగా మీ భాగస్వామిలోని చెవులు, మెడ, చేతులు, కాళ్లు, వెనుక, ఛాతీతో పాటు ఆమె పాదాలతో పాటు ప్రతి అంగుళాన్ని తాకి ఆమెలో కోరికల ఉద్రేకాన్ని ప్రేరేపించాలి.

ప్రత్యేక అనుభూతి కోసం..

ప్రత్యేక అనుభూతి కోసం..

కొన్నిసార్లు మీరు శృంగారంలో పాల్గొనే ముందు మీ భాగస్వామికి అందులో ఆసక్తి ఉందా లేదా అడిగి తెలుసుకోవాలి. వారు మానసికంగా సిద్ధమైతేనే మీ ఇద్దరికీ ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. లేదంటే ఆమెలో మీరు ఇంద్రియ స్పందనలు ప్రేరేపించి ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయాలి.

ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.. కట్ చేస్తే వార్నింగులు.. ఛేజింగులు.. కేసులు.. తర్వాత ఏంటంటే?

ఒక్కొక్కరికి ఒక్కోలా..

ఒక్కొక్కరికి ఒక్కోలా..

మీ టికిల్స్ (గిలిగింతలు)ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే అందరూ మహిళలు ఒకే రకంగా ఉండరు. కొందరు మహిళలకు ఇంద్రియ స్పర్శ సుఖవంతంగా ఉంటుంది. మరికొందరికి ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు. కాబట్టి మీరు మీ భాగస్వామి ఇష్టపడే లేదా ఇష్టపడని వాటి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఆమె ఉదరంపై మీరు 'W' లేదా 8 గీయడం వంటివి చేస్తే కొందరికి చిరాకుగా అనిపించవచ్చు. కానీ మీ వెచ్చని అరచేతిని దానిపై ఉంచితే కొందరికి చాలా సుఖంగా ఉంటుంది.

ఫ్రెంచ్ కిస్ ఇష్టపడరు..

ఫ్రెంచ్ కిస్ ఇష్టపడరు..

ముద్దులలో ఫ్రెంచ్ కిస్ అంటే అందరూ ఎంతగానో ఇష్టపడతారు. అయితే చాలా మంది మహిళలు ఇలాంటి ముద్దులను ఇష్టపడరట. అసలు అది ఉత్తమ ముద్దు కాదని భావిస్తారట. అయితే మీ పెదవులతో వెచ్చని స్పర్శ, వెచ్చని శ్వాస మరియు ఆహ్వానించదగిన నిబ్బల్ కోసం స్థిరమైన ఆటను కలిగి ఉంటారు. కాబట్టి ఫ్రెంచ్ కిస్ లతో దూకుడుగా వెళ్లే బదులు మీరు సున్నితంగా వ్యవహరించాలి. ఎందుకంటే ముద్దు అనేది తొందరపాటు చర్య కాదు. మీ ఆత్మ వారి కోసం శోధిస్తున్నట్లు అనిపించాలి.

సున్నిత భాగాలను..

సున్నిత భాగాలను..

మీరు ఆమె అవకాశం ఇచ్చేంత వరకు కొంచెం వేచి ఉండాలి. ఆమె శరీరం మొత్తం వేడెక్కడానికి మరియు ఆమెను శృంగార పరంగా మంచి మానసిక స్థితిలోకి తీసుకొచ్చాక ఆమెకు అత్యంత సన్నిహిత భాగాలను తాకడం వంటివి చేయాలి. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

ఇలాంటి మెసెజ్ లు పంపిస్తే మీ భాగస్వామి మీకు ఫిదా అయిపోవాల్సిందే...!

మాట్లాడటం మర్చిపోవద్దు..

మాట్లాడటం మర్చిపోవద్దు..

మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందు ఆమెతో మాట్లాడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరచిపోవద్దు. ముందుగా ఆమె ఏమి కోరుకుంటుందో తెలుసుకోండి. మీకు శిక్షణ ఇవ్వమని ఆమెను అడగండి. ఈ రకమైన కమ్యూనికేషన్ వల్ల మీరు ఒకరినొకరు ఆనందించడానికి సహాయపడుతుంది.

చాలా మంది పురుషులకు తెలియదు..

చాలా మంది పురుషులకు తెలియదు..

శృంగారం పాల్గొనే చాలా మంది పురుషులకు ఈ విషయం గురించి తెలియదు. మీరు మీ భాగస్వామి యొక్క సున్నితమైన ప్రదేశాలను చాలా మెత్తగా తాకాలి. అప్పుడు స్వయంగా మీకు సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే స్త్రీ గుహ్యాంకురము చాలా సున్నితమైనది. అందుకోసం మీరు మీ స్త్రీలను ఉత్తేజపరచాలి.

బలవంతం చేయొద్దు..

బలవంతం చేయొద్దు..

మీరు మీ భాగస్వామితో ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేయొద్దు. ఎందుకంటే అందరూ మహిళలు ఇలాంటి వాటిని ఇష్టపడరు.

చూశారు కదా... ఈ చిట్కాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ జీవితంలో వీటిని ట్రై చేసి శృంగారం ఆనందాన్ని పొందండి.

English summary

Tips to keep your Women happy in bed

Here are the some tips to keep your woman happy in bed. Take a look
Story first published: Wednesday, March 11, 2020, 17:14 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more