Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
ఈ చిట్కాలను ఫాలో అయితే మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ ను కనిపెట్టడం చాలా ఈజీ...!
మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ ను కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు ఎవరికైనా పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుండేవారు. అయితే ప్రస్తుతం సూది పిన్ను నుండి బట్టల వరకు.. స్మార్ట్ ఫోన్ నుండి టివి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ తో పాటు అన్ని వస్తువులు ఆన్ లైనులో అందుబాటులో ఉన్నాయి. ఇదే సందర్భంలో ఆన్ లైనులో మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు అవకాశాలు చాలా సులభమయ్యాయి. ఒకప్పుడు మన దేశంలో ఇది వరకు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ చేయాలంటే.. పెళ్లిళ్ల బ్రోకర్లను లేదా మ్యారేజీ బ్యూరోలను, పండితులను ఎక్కువగా సంప్రదించేవారు. తమకు కావాల్సిన లక్షణాలను, డిమాండ్లను, కట్నకానుకల గురించి ముందే అన్ని వివరించి.. అన్నీ కుదిరాకే పెళ్లి సంబంధాలను కుదుర్చుకునే వారు.

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఆన్ లైనులోనే తమకు కావాల్సిన అల్లుడిని, భాగస్వామిని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాట్రిమోనియల్ సైట్లకు డిమాండ్ బాగా పెరిగింది.

అయితే ఇలాంటి సమయంలో ఫేక్ ప్రొఫైల్స్ కూడా పెరుగుతున్నాయి. చాలా మంది తమ వివరాలను తప్పుగా నమోదు చేయడం.. పెళ్లికి ముందు పూర్తి వివరాలు చెప్పకుండా ఎక్కువ డబ్బును డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ కాలంలో, ఏ అమ్మాయి వివరాలు అసలువో.. ఏ అబ్బాయి వివరాలు నకిలీవో తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఇదే సందర్భంలో మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్ కూడా అసలుదా? నకిలీదా అనే విషయాలను కచ్చితంగా చెక్ చేసుకోండి. అందుకు కొన్ని చిట్కాలను పాటించండి... ఏ వివరాలు సరైనవో తెలుసుకోండి..

ప్రొఫైల్ ఫొటో..
మీరు మ్యాట్రిమోనియల్ సైటులో ఏదీ నకిలీది, ఏది నిజమైనది గుర్తించడానికి మొట్టమొదట ఫొటో బాగా సహాయపడుతుంది. ప్రొఫైల్ ఫొటో లేని వారు , అలాంటి వివరాలను చూసే అవసరమే లేదు. ఒక వేళ ఫొటో ఉన్నప్పటికీ అది ఏ సెలబ్రెటీది కాకుండా.. వారి అసలైన ఫొటో అయితే ఎంత నమ్మశక్యంగా ఉందో చెక్ చేయండి.

పేరుతో ఉన్న ఫొటో..
కొంతమందికి ఫొటో ఎడిటింగ్ బాగా ఇష్టం. కాబట్టి మీరు మ్యాట్రిమోనియల్ సైటులోని అకౌంట్ నుండి ఏదైనా అభ్యర్థనను స్వీకరించినట్లయితే, అప్పుడు వారి పేరుతో పాటు ఫొటోను జాగ్రత్తగా పరిశీలించాలి. ఫొటో ఎడిటింగ్ చేసిందా లేదా న్యాచురల్ ఉన్నదేనా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఫొటో విభిన్న లక్షణాలతో ఉంటే దాన్ని మీరు విస్మరించడం మంచిది.

వేరే వాళ్లు క్రియేట్ చేయొచ్చు..
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే మధురమైన ఘట్టం ఒక్కసారే వస్తుంది. కాబట్టి అలాంటి పెద్ద నిర్ణయం గురించి అబ్బాయి లేదా అమ్మాయి తీవ్రంగా ఆలోచించకపోవచ్చు, లేదా వారు తమ నిజమైన గుర్తింపును దాచాలనుకుంటారు. లేదా వారి అకౌంట్ వివరాలను వేరొకరితో క్రియేట్ చేయొచ్చు.

సోషల్ మీడియా సైట్లలో..
మీరు చూసిన ప్రొఫైల్ పేరును ఇతర సోషల్ మీడియాలో (ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో) కూడా సెర్చ్ చేయండి. అక్కడ ఉండే పేర్లు.. ఇక్కడ పేర్లు మరియు అందులో ఉండే ఫొటోలు.. ఇక్కడ ఉండే ఫొటోలు సరైనవా కాదా చూడండి. దీని వల్ల మీరు ఆ ప్రొఫైల్ నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి మార్గం సులభమవుతుంది. ఒకవేళ ఆ వివరాలు మ్యాచ్ కాకపోతే మీరు ఆ ప్రొఫైల్ ను మరచిపోవచ్చు.

తరచుగా సవరణలు..
మ్యాట్రిమోనియల్ వెబ్ సైటులకు సంబంధించి నిర్వహించిన పరిశోధనల ప్రకారం, చాలా మంది వ్యక్తులు తమ వివరాలను నకిలీ ఖాతాలు లేదా ఫేక్ ఐడీలను క్రియేట్ చేసే వ్యక్తులు తమ అకౌంట్ల వివరాలను తరచుగా సవరించుకుంటూ ఉంటారు. ముందుగా వ్యక్తి ఉన్న ఫొటోను మారుస్తూ ఉంటారు. అభిరుచులు మారుస్తారు. ఉద్యోగ వివరాలను కూడా మారుస్తుంటారు. కాబట్టి మీరు ఎవరినైనా ఫైనల్ చేసే ముందు ఈ వివరాలను చెక్ చేయడం మరచిపోవద్దు.

డబ్బులు అడిగితే..
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైనులో చాలా మంది ఇతర వ్యక్తులను మోసం చేశారని మీరు ఇదివరకే చాలా వార్తల్లో.. టివీల్లో చూసే ఉంటారు. కాబట్టి ఎవరైతే మ్యాట్రిమోనియల్ సైట్లలో డబ్బులను అడుగుతారో అలాంటి వారిని మీరు తిరస్కరించడమే మంచిది.

తొందరపెడితే..
కొందరు వ్యక్తులు సరైన ఐడి, సరైన వివరాలు మ్యాట్రిమోనియల్ సైట్లలో క్రియేట్ చేసినప్పటికీ.. తొలిసారి సమావేశానికి ప్లాన్ చేసి.. అక్కడ అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తారు. తన సౌలభ్యం కోసం అని కల్లబొల్లి కబుర్లు చెబితే మీరు అలాంటి వారిని విస్మరించడమే మంచిది.

క్రాస్ చెక్ చేసుకోండి..
మీరు మ్యాట్రిమోనియల్ సైటులో ఏదైనా ప్రొఫైల్ ను ఫైనల్ చేసి ఉంటే, వారి సంబంధాన్ని నిర్ధారించడానికి లేదా వారిని వివాహం చేసుకునే విషయంలో తొందరపడకుండా, ముందుగా మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో క్రాస్ చెక్ చేయండి.



Click it and Unblock the Notifications











