Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
రాజశేఖర్, జీవిత పెళ్లికి ముందే ఒకే రూములో ఉన్నారంట... ఎందుకో తెలుసా...!
రాజశేఖర్, జీవిత యొక్క ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు ఎక్కడికెళ్లినా జంటగానే వెళ్తుంటారు.. ఏ పని చేసినా జంటగానే చేస్తుంటారు.. వీరిద్దరూ కలిసి కనబడని సందర్భాలు చాలా తక్కువ సమయంలో ఉంటాయనే చెప్పొచ్చు.

వారే జీవిత-రాజశేఖర్. ఈ పేరులోనే కాదు.. నిజ జీవితంలో రాజశేఖర్ పక్కన జీవిత లేకపోతే ఏమి తోచదని వారే చాలా సందర్భాల్లో చెప్పారు. టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిది ప్రేమ వివాహం అని చాలా మందికి తెలుసు.

అయితే వీరి ప్రేమ ఎప్పుడు మొదలైంది.. ఎలా మొదలైంది.. అచ్చం సినిమాలో మాదిరిగానే వీరి ప్రేమలోనూ చాలా ట్విస్టులు ఉన్నాయా? లేక అంతా సాధారణంగా జరిగిపోయిందా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

డాక్టర్ నుండి యాక్టర్ గా..
హీరో రాజశేఖర్ తన యాక్టర్ కాకముందు డాక్టర్ చదువు చదివాడు. అయితే తనకు యాక్టింగ్ పట్ల ఉన్న ఆసక్తితో హీరోగా సినీరంగంలో అడుగుపెట్టారు. అయితే తను హీరో అవ్వడం ఏ మాత్రం ఇష్టం లేదు వారి తల్లిదండ్రులకు.

ఓ కండిషన్..
అయినా బలవంతంగా ఒప్పుకుని.. ఓ కండిషన్ పెట్టి సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు అంగీకరించారు. అయితే రాజశేఖర్ జీవితతో ప్రేమలో పడటం వల్ల ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడట.

అలా పరిచయం..
జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. ఆ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చకపోవడంతో రాజశేఖర్ సినిమా షూటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశారట. అలా ఈ ఇద్దరు మొదటిసారి కలిసి నటించే అవకాశం కోల్పోయారట. అయితే అప్పుడే అయిన పరిచయం మాత్రం ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది.

హైదరాబాదులో స్నేహం..
ఆ తర్వాల జీవిత తెలుగు సినీ రంగంలోకి తలంబ్రాలు సినిమాతో అడుగు పెట్టింది. అదే సినిమాలో రాజశేఖర్ కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాదులోనే జరగగా, ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారింది.

ప్రేమగా మారింది..
ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. రాజశేఖర్ ఆ సినిమా షూటింగ్ అయిపోయేంత లోపే జీవిత అంటే పిచ్చపిచ్చగా నచ్చేసింది. అయితే అప్పటికే తాను ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని ఇంట్లో మాటివ్వడం వల్ల ఈ బంధం ఆలోచించడానికి ఇష్టపడలేదు.

పేరేంట్స్ కు తెలియడంతో..
అయితే ఈ విషయం జీవిత ఇంట్లో కూడా తెలిసిపోయిందట. రాజశేఖర్ నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేడని తెలిసినా నీవు తనని ఎందుకు కావాలనుకుంటున్నావు అని ఆమె పేరేంట్స్ నిలదీశారట.

ఒంటరిగానైనా ఉంటాను..
అప్పుడే జీవిత తాను జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను కానీ, రాజశేఖర్ ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పిందట. మరోవైపు జీవితపై తనకు ప్రేమ ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల మాట కాదనలేక రాజశేఖర్ పెళ్లి సంబంధాలు కూడా చూసేశారట.

పెళ్లికి ముందు ఒకే గదిలో..
అయితే రాజశేఖర్ కు ఎన్ని సంబంధాలు చూసినా, ఏవీ సెట్ కాలేదట. కానీ జీవిత, రాజశేఖర్ లు మాత్రం తమ ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఎంతలా ఉంటే షూటింగ్ అయిపోయాక వీరిద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉండటం, ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం.. కలిసి రావడం.. అలా దాదాపు లివింగ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేశారట.

పాతికేళ్ల క్రితమే..
ఈ విషయం గురించి జీవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రస్తుతం చాలా మంది తాము మోడ్రన్ అని.. ప్రేమించుకునే సమయంలో అలా చేశాం.. ఇలా చేశాం.. అని చెబుతుంటారు కదా.. ఇలాంటివన్నీ మేము దాదాపు పాతికేళ్ల క్రితమే పూర్తి చేశామని' చెప్పారు.

రాజశేఖర్ కు ప్రమాదం..
ఇలా వీరి ప్రేమ బంధం బలంగా మారిన సమయంలో మగాడు సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ కి ఓ ప్రమాదం జరిగింది. అప్పుడు జీవిత పక్కనే ఉండి అన్ని సపర్యలు చేసింది. ఇది చూసిన రాజశేఖర్ పేరేంట్స్ వీరి ప్రేమని అంగీకరించారట.

1991లో వివాహం..
అలా 1991లో వీరిద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకుని.. ఘనంగా వివాహం జరిపించారు. వీరిద్దరికీ ఇద్దరు అమ్మాయిలు శివాని, శివాత్మిక. ప్రస్తుతం వీరిద్దరూ కూడా పెళ్లి ఈడుకు వచ్చారు. ఒకరేమో ఇప్పటికే హీరోయిన్ గా నటించగా.. మరొకరు మెడిసిన్ చదువుతున్నారు. చివరిగా జీవిత, రాజశేఖర్ అనేవి రెండు వేరే పేర్లు అయినప్పటికీ, వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మాత్రం రెంటిని జంట పేర్లుగా మార్చేశాయి. వీరి లవ్ స్టోరీ అప్పట్లో బోల్డ్, క్రేజీ లవ్ స్టోరీ అనేవాళ్లు.



Click it and Unblock the Notifications