Latest Updates
-
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు
Hug Day 2022:కౌగిలింతల్లో ఎన్ని రకాలున్నాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...
కౌగిలింతల్లో ఎన్ని రకాలున్నాయి?వాటి వల్ల వచ్చే లాభాలేంటి
ఎవరికైనా ఏదైనా సమయంలో బాధ కలిగినప్పుడు ఆత్మీయులను ఒక్కసారి ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే భారం, ఒత్తిడి కచ్చితంగా తగ్గిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

మనలో చాలా మంది బాధతో డీలాపడినా.. సంతోషంతో ఉరకలేస్తున్నా.. ఒత్తిడితో ఆందోళన చెందుతున్నా.. ఇలా ఎలాంటి ఫీలింగ్స్ ను అయినా ఒకరితో షేర్ చేసుకోవడానికి 'కౌగిలి'(Hug) అనేది మంచి టానిక్ లా పని చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే మన మనసుకు నచ్చిన వారిని గాఢంగా కౌగిలించుకోవడం వల్ల బాడీలో ఉండే థైమస్ గ్రంథి ప్రేరేపణకు గురవుతుందట.

దీంతో శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్పత్తి ప్రారంభమై మనల్ని అది వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండీ కాపాడుతుందట. దీంతో మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అంతే కాదు ఆలింగనం అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి.

ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు మీ పార్ట్నర్ ను కౌగిలించుకుంటే అది వారికి సురక్షితమైన కౌగిలింత అనే భావన కలుగుతుంది. ఈ ఫీలింగ్ అక్షరాలతో వర్ణించలేని విధంగా ఉంటుంది. అలాంటి వివిధ రకాల కౌగిలింతలపై మీరు ఓ లుక్కేయండి... మీ నిజ జీవితంలోనూ వీటిని ప్రయత్నించండి..

మంచి స్నేహితులుగా..
బియర్ హగ్ అనేది సాధారణంగా స్నేహితులు ఇచ్చి పుచ్చుకుంటారు. సాధారణంగా ఎలుగుబంట్లు వాటి బలంతో మనల్ని చంపగలవని చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే స్నేహితులను ఈ విధంగా ఈ కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారు.

లవర్స్ హగ్..
ఇలాంటి కౌగిలింతలు ‘‘ప్రేమికులకు ఎక్కువ.. స్నేహితులకు తక్కువ'' అన్న రీతిలో మనకు దర్శనమిస్తుంటాయి. ఈ కౌగిలిలో ఎదుటి వ్యక్తిని ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. వారి భుజంపై తలవాలుస్తారు. అంతేకాదు ఆపై పక్కనే ఉండే చెవిలో ఏవేవో గుసగుసలు వినిపిస్తుంటారు. మీరు ఈ రకమైన కౌగిలింత ఒకరిపై మరొకరికి అమితమైన నమ్మకం ఉందని కచ్చితంగా తెలుపుతుంది.

కన్నీళ్ల కౌగిలింత..
మీ మనసుకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్తున్నప్పుడు మీరు వారిని చాలా సేపు కౌగిలించుకుంటారు. ఈ కౌగిలింతలో ఎక్కువగా కన్నీళ్లతో నిండి ఉంటుంది.

హార్ట్ పల్స్ హగ్..
ఈ రకమైన కౌగిలి అనేది మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి మాత్రమే ఉంటుంది. అది చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ రకమైన కౌగిలిలో ఇద్దరు ప్రేమికులు వారి హృదయ స్పందనలను మరియు వారి శ్వాసను వింటారు.

కిస్ కౌగిలి..
కౌగిలింత అనేది ముద్దూ ముచ్చటలకు స్వాగతం పలికే ఆహ్వానం. రొమాన్స్ అనేది కౌగిలింతతో ప్రారంభమై అది ఫాంటసీలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి మీరు ముద్దు లేదా అంతకంటే ఎక్కువ ఆహ్వానంగా కౌగిలింతను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఫ్యామిలీ హగ్..
కౌగిలింతలు అనేవి కేవలం ప్రేమికులు మరియు స్నేహితులకే కాదు. ఫ్యామిలీ మెంబర్స్ తోనూ జరుపుకోవచ్చు. మన ముఖంలో సంతోషం.. పెదవిపై చిరునవ్వు కలగలిపి ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడాన్ని పొలైట్ హగ్ అని పిలుస్తారు. ఇలాంటి ఆలింగనాలు చాలా ఎక్కువగా స్నేహితుల మధ్య మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరచూ కనబడుతూ ఉంటాయి.

గాఢమైన కౌగిలి..
ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూసిన వారు మన కళ్లెదుట వాలిపోతే.. అప్పుడు పట్టపగ్గాల్లేని ఆనందంతో అమాంతం వారాని కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. ఈ కౌగిలిలో ఎదుటివారి చుట్టూ చేతులు రెండూ చుట్టేసి, వారిని గాఢంగా హత్తుకుని కౌగిలిలో బంధిస్తారు. ఎంతో ఆత్మీయతతో అందించే ఇలాంటి కౌగిలిని అందరూ స్వాగతిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు ఇలాంటివి తెగ ఎంజాయ్ చేస్తారు.

ఓదార్పు కౌగిలి..
మీరు మీ తల్లి ఎదపై ప్రేమతో తల వాలిస్తే అది అమ్మ కౌగిలింత. ఈ రకమైన కౌగిలింత ఒక్క మీ తల్లి మాత్రమే ఇవ్వగలదు. అయితే కొన్నిసార్లు ప్రేమికులు కూడా ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ఇలాంటి కౌగిలింతలు ఇచ్చుకుంటారు. కాబట్టి వీటిలో మీకు ఏ హగ్ నచ్చిందో వాటిని ప్రయత్నించి చూడండి... అద్భుతమైన అనుభూతిని పొందండి.
వాలెంటైన్ వీక్ లో భాగంగా ఆరో రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీన హగ్ డే జరుపుకుంటారు. ప్రతి ఒక్క కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. ఆలింగనం అనేది మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది. మీరు ఎవరినైనా ప్రేమతో ఆలింగనం చేసుకుంటే అది ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది.
ఆలింగనం అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి సురక్షిత కౌగిలి, బియర్డ్ హగ్, పొలైట్ హగ్, హ్యాపీ హగ్, గుడ్ బై హగ్, మదర్ హగ్. మీరు ఈ కౌగిలింతలను ట్రై చేసి మంచి అనుభూతిని పొందండి.



Click it and Unblock the Notifications











