For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిండర్లో ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త సుమా...!

|

ఒకప్పుడు తెలియని వ్యక్తితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా భయపడిపోయేవారు. వారు ఎలాంటి వారో.. వారితో ఎలా ప్రవర్తించాలో అనే సందేహాలు అందరిలో ఉండేవి. అయితే ఆ రోజులు పోయాయి.

ఇప్పుడంతా ఆన్ లైన్ జమానా. మనకు ఏదీ కావాలన్నా ఆన్ లైనులో అందుబాటులో ఉంటున్నాయి. గుండుసూది నుండి గుమ్మడికాయ దాకా ప్రతిదీ ఆన్ లైనులోనే లభిస్తున్నాయి.

అలా ఈ డిజిటల్ యుగంలో డేటింగ్ పేరిట తెలియని వ్యక్తులతో కలిసి ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. దాని కోసం ప్రత్యేకమైన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అందులో టిండర్ అనే యాప్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో చాలా మంది అదే యాప్ లో తమ వివరాలను నమోదు చేస్తున్నారు. తమ అలవాట్లు, అభిరుచులకు తగ్గ వారిని సెలెక్ట్ చేసుకుని వారితో కలిసి డేటింగుకు వెళ్తున్నారు.

అయితే ఇలా కొత్త వ్యక్తులతో డేటింగుకు వెళ్లే వ్యక్తులు కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇంతకీ టిండర్లాంటి యాప్ లలో ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మగాళ్లు ఎంత అందంగా ఉన్నా.. అలా ఉంటే 'ఆ' కార్యం కష్టమంటున్న అమ్మాయిలు...!

ఫేస్ కనిపించకుండా..

ఫేస్ కనిపించకుండా..

టిండర్ యాప్ లో ఎవరైతే తమ ఫేస్ కనిపించకుండా వివరాలను నమోదు చేస్తారో.. అలాంటి వారి వివరాలు ఫేక్ అని మీరు ఫిక్స్ అవ్వొచ్చు. మరికొంత మంది కేవలం సెక్సీ కళ్లు మాత్రమే కనబడేలా.. మనల్ని ఆకట్టుకునేలా ప్రొఫైల్ పిక్ పెడుతూ ఉంటారు. అలాంటివి చూసి మీరు అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వారిలో చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఉంటారు. మీకు మరీ తన వివరాలు నచ్చాయని అనిపిస్తే, మాత్రం ముందుగా తనతో చాటింగ్ చేసి, వీలైతే వారితో ముందుగానే ఫోన్లో మాట్లాడి మీకున్న అనుమానాలను వ్యక్తం చేయండి. వారు చెప్పే సమాధానాలను బట్టి మీరు ఓ అంచనాకు రావొచ్చు.

ఫోటో లేకపోతే..

ఫోటో లేకపోతే..

మీరు దర్టీ టాక్ లో కోసం టిండర్ ని వాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది కచ్చితంగా మంచిదే. ఎందుకంటే మీరు కొన్ని మంచి ఉద్వేగాలను కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో మీరు ఎవరితో చాట్ చేస్తున్నారనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ముందుగా తన పిక్ ఉంటేనే మీరు చాటింగులో ముందుకెళ్లాలి. లేదంటే కొందరు మీ పర్మిషన్ లేకుండా మీ ఇన్ బాక్స్ మరియు మీ మనసును వేటాడే అవకాశం ఉంటుంది. మరోవైపు తను పంపే ఫొటోలను కూడా గుడ్డిగా నమ్మకండి.

నచ్చిన వెంటనే..

నచ్చిన వెంటనే..

మీరు లెక్కలేనన్ని మగవారి ముఖాలను స్వైప్ చేస్తుంటారు. అందులో కొన్ని అందంగా.. మరికొన్ని మాములుగా కనిపిస్తాయి. అయితే కొన్ని ఫొటోలు చూసినప్పుడు మీ కళ్లలో వెయ్యి కాంతుల వెలుగు వచ్చినట్టవుతుంది. అలాంటి వారితో కచ్చితంగా డేటింగ్ వెళ్లాలని అనిపించొచ్చు. కానీ అక్కడే మీరు తొందరపడకూడదు. తను నిజంగా అలానే ఉంటారా? లేదా ఫొటో ఎడిటింగ్ ద్వారా అలా అట్రాక్ట్ చేస్తున్నాడా అనే దాని కోసం, తనతో చాటింగ్ చేసి, తన లైవ్ ఫొటోలను అడగండి. అప్పుడు కూడా మీకు నచ్చితే, అప్పుడు మీరు ముందడుగు వేయొచ్చు..

రొమాన్స్ లో మగువలు అలా చేస్తే మగాళ్లు మరింత మజా పొందుతారట...!

నకిలీ వివరాలు..

నకిలీ వివరాలు..

స్పష్టంగా, అతను టాల్‌స్టాయ్‌ను చదువుతాడు. చైకోవ్స్కీని హమ్ చేస్తాడు. తార్కోవ్స్కీని చూస్తాడు మరియు ‘ముతక' కళను సమర్థించడు. అతని ఇష్టపడే బ్రాండ్ వైన్ ఉచ్చరించడానికి ప్రాక్టీస్ తీసుకుంటుంది మరియు అతని పొగలు హై-ఎండ్ క్యూబన్ సిగార్లు. అలాంటి వ్యక్తి లేడని మేము క్లెయిమ్ చేయలేదు, కానీ నీడ స్పెక్ట్రంలో అతనికి ర్యాంక్ ఉందా అని మీరు ఆలోచించాలని మేము సలహా ఇస్తున్నాము! అతని మెలికలు తిరిగిన గ్రంథాలు అతని ఫోన్ ద్వారా అతనికి థెసారస్ ఉన్నాయని స్పష్టం చేస్తే, అతను మోసపూరితంగా డిగ్రీ పొందవచ్చు.

ప్రస్తుత డిజిటల్

ప్రస్తుత డిజిటల్

ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా డిజిటల్ దేవదాసులు చాలా మందే ఉంటుారు. సోషల్ మీడియాలో తమకు ఎలాంటి చెడు అలవాట్లు(మద్యపానం, దూమపానం) లేవని చెబుతుంటారు. కానీ అలాంటి వారిని గుడ్డిగా నమ్మకండి. ఆ విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ ముందడుగు వెళ్లండి.

ఆ కార్యం కోసం కాదు..

ఆ కార్యం కోసం కాదు..

మీరు డేటింగ్ యాప్ లో ఇష్టపడే వ్యక్తితో బయటకు వెళ్లడం అంటే కేవలం ఆ కార్యం కోసం మాత్రమే కాదు.. తనతో సరదాగా ఎవ్వరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు.. తనతో ఎంచక్కా కబుర్లు చెప్పుకునేందుకు.. మీకు నచ్చిన ప్రదేశంలో సేద తీరడానికి అనే విషయాలను కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంతేగానీ డేటింగ్ హడావుడిగా ఆ కార్యం కోసం చేసే ప్రయత్నం కాదు.

English summary

Types of men on Tinder that you should avoid in Telugu

Here are the types of men on tinder that you should avoid in Telugu. Take a look