Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
భార్యతో కాకుండా ఇతరులతో అలా చేస్తే.. మోసం చేసినట్టేనా...!
రిలేషన్ షిప్ లో ఈ రకమైన మోసాల గురించి తెలుసా..
వివాహ బంధం లేదా ప్రేమ బంధం ఇంకా ఎలాంటి బంధంలో అయినా ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు మనం బాగా నమ్మిన వారి చేతిలోనే మోసపోతూ ఉంటాం.

అయితే మోసాలలో చాలా రకాలున్నాయి. అందులోనూ వివాహ జీవితంలో మోసం అంటే అబద్ధం చెప్పడం.. ఇతరులతో ఎక్కువగా గడపడం వంటివి మాత్రమే కాదు..

మనల్ని కాదని ఇంకొకరిని కనీసం తాకకుండా కూడా మోసం చేయొచ్చు. అలాంటి మోసాలు ఎలా ఉంటాయి.. అలాంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మోసం చేయడమే..
మహిళలు మగాళ్లతో.. మగవారు మహిళలతో చాలా క్లోజ్ గా ఉండి భాగస్వామితో కూడా అలా క్లోజ్ గా ఉండకుండా ఉంటే అది నిజంగా మోసం చేయడమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇది మోసం కిందకే వస్తుందనే విషయం తెలియక చాలా మంది వారికి తెలియకుండానే మోసం చేసేస్తున్నారు.

విడిపోయేంతలా..
కొందరు కపుల్స్.. ఇలా మోసం చేయడం.. లేదా మోసపోవడం వల్ల విడిపోయే దాకా వెళ్తుంది. కొంతమంది విడాకులు తీసుకుని విడిపోతారు కూడా. అయితే ఇలాంటి విషయాలను కొందరు ఓపెన్ గా చెప్పుకుంటే.. మరికొందరు మాత్రం తమ రిలేషన్ షిప్ లో సర్దుకుపోతూ ఉంటారు. అయితే సర్దుకుపోవడం అనేది ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. ప్రస్తుత కాలంలో సర్దుకుపోవడం వంటి సహనం చాలా మంది కనబడటం లేదు. అంతేకాదు.. తమ రిలేషన్ షిప్ లో ఏదైనా మోసం జరిగితే.. వారు ఎంత దూరమైనా వెళ్తున్నారు. అందుకే భాగస్వామితో ఉన్నంత క్లోజ్ గా ఇతరులతో ఉండకండి. అలా చేస్తే అది నిజంగా తప్పే అవుతుంది.

సోషల్ మీడియాలో..
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా కాలం అని చెప్పొచ్చు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఇటీవల కాలంలో టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోవడంతో.. ఆన్ లైనులో కొత్త వ్యక్తులతో పరిచయాలు.. వారితో క్లోజ్ గా చాటింగ్ చేయడం.. వీడియో కాలింగ్ కూడా మోసం కిందకే వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

వివాహేతర సంబంధాలు..
ఇలాంటి విషయాల గురించి మనం ప్రతిరోజూ ఏదో ఒక చోట వింటూ ఉంటాం. ఎందుకంటే వివాహేతర సంబంధాలు చాలా చోట్ల ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొత్త దారిలో సాగుతున్నాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లోనే ఎక్కువగా గడపడం.. పక్కన పార్ట్నర్ ఉన్నా కూడా తమ ప్రియురాలికి లేదా ఇతరులకు ఎక్కు ప్రియారిటీ ఇవ్వడం.. వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం వంటివి కూడా మోసం చేయడమే అవుతుంది.

ఇంకొకరితో షేర్ చేసుకోవడం..
మీ భాగస్వామి గురించి.. వారి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి ఇతరులతో షేర్ చేసుకోవడం.. అక్కడితో ఆగకుండా వారితో కంప్లైట్ చేయించడం.. చేయడం కూడా మోసం కిందకే వస్తుందట. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీ భాగస్వామిని చాలా బాధపెడతాయి. కాబట్టి మీ పార్ట్నర్ కు నచ్చని విషయాలను ఇతరులకు చెప్పకండి.

సీక్రెట్ ఫ్రెండ్స్..
మీ భాగస్వామికి తెలియకుండా మీరు సీక్రెట్ ఫ్రెండ్స్ ను కలిగి ఉండటం.. మీ పార్ట్నర్ కు పరిచయం చేయకుండా వారితోనే ఎక్కువగా గడపడం అనేది కూడా మోసం కిందకే వస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేస్తుంటే.. ఇప్పటికైనా మీ భాగస్వామితో అలాంటి విషయాలను షేర్ చేసుకోండి.



Click it and Unblock the Notifications