Latest Updates
-
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.!
మీ బంధంలో కేవలం రొమాన్సే కాదు.. ఇవి కూడా ముఖ్యమే...!
మీ రిలేషన్ షిప్ లో ఇలాంటి విషయాలు చాలా కష్టంగా ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన సమాజంలో అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. యవ్వనంలో వచ్చాక ఎవరో ఒకరితో రిలేషన్ షిప్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు.

అది ప్రేమ బంధం, వివాహ బంధం ఏదైనా కావొచ్చు. అయితే ఏ రిలేషన్ షిప్ లో అయినా గొడవలు, వాదనలు అనేవి చాలా సర్వసాధారణం. అయితే ఎవరైతే రిలేషన్ షిప్ లో అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారో అలాంటి వారి సంబంధాలు జీవితాంతం హాయిగా సాగుతాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సింగిల్ గా ఉండేవారు ఎప్పుడెప్పుడు మింగిల్ అవుదామా అని తహతహలాడుతూ ఉంటారు. అయితే రిలేషన్ షిప్ లోకి వెళ్లడమంటే.. కేవలం కబుర్లు చెప్పుకోవడం.. షాపింగుకెళ్లడం.. సినిమాలకు, పార్కులకు వెళ్లడం.. రొమాన్స్ చేసుకోవడం.. మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

కొన్ని సమస్యలు..
సింగిల్ గా ఉండే వారు ఎవరితో అయినా రిలేషన్ షిప్ ప్రారంభించే ముందు పార్ట్ నర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరితో అయితే మింగిల్ అవ్వాలనుకుంటున్నారో వారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన కచ్చితంగా ఏర్పడాలి. అలా చేయగలిగితే.. మీ ఇద్దరికీ ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ అలా జరగకపోతే.. మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

సమస్యలొస్తున్నాయంటే..
మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పటికీ, ఏదైనా ఘర్షణలు, వాదనలు వస్తున్నాయంటే.. మీరిద్దరూ విభిన్న కోణాల్లో ఆలోచించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాంటివి రాకుండా ఉండాలంటే.. ప్రతిసారీ మీ యాంగిల్ లో ఆలోచించకుండా.. మీ పార్ట్ నర్ యాంగిల్ లో ఆలోచించాలి.

ఎలా ఆలోచిస్తారని..
మీరు మీ పార్ట్ నర్ ను నిజాయితీగా ప్రేమిస్తున్నట్లయితే.. వారు ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తారనే విషయంపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం చాలా మంది చాలా ఈజీగా లవ్ లో పడిపోతారు. కనీసం ఎదుటి వారి గురించి ఏమీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. వారంటే తమకు ప్రాణం అంటూ చెప్పేస్తుంటారు.

స్వార్థపూరితంగా..
కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కూడా రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాలని అనుకుంటారు. అయితే కొందరు మాత్రం సింగిల్ గా ఉండలేక.. ఇంకొకరితో మింగిల్ అవ్వాలనుకుంటారు. బాధలో ఉండేవారు కూడా తాము తమ బాధను ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి రిలేషన్ షిప్ కావాలని కోరుకుంటారు.

ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు..
ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అది రిలేషన్ షిప్ అయినా ఇంకేదైనా.. ఎవ్వరు మంచివారైనా.. ఎంత డీసెంట్ గా ఉన్నా.. కోపం తెచ్చుకోవడం సహజం. అలాంటి సమయంలో అర్థం చేసుకోవాలే తప్ప.. ఆవేశపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తప్పులను అర్థం చేసుకోవాలి..
ఎవరైనా సరే.. తమ రిలేషన్ షిప్ లో ఆనందంగా ఉండాలంటే.. ఒకరి తప్పులను మరొకరు అర్థం చేసుకోవాలి. ఎక్కువగా క్షమించే గుణం ఉన్నవారే తమ రిలేషన్ షిప్ లో ఎక్కువగా ఆనందంగా ఉంటారట.



Click it and Unblock the Notifications
