Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
kiss day 2022:ముద్దుల వానలో మునిగేందుకేనా కిస్ డే.. ముద్దులతో ఏమైనా లాభాలున్నాయా?
2022లో వాలెంటైన్ వీక్ సందర్భంగా కిస్ డే ఎప్పుడు, ముద్దుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెదాలపై పెదాలు రాసే ప్రేమలేఖనే ముద్దు అంటారని చెప్పాడో కవి. ఎందుకంటే కిస్ అనేది ఆప్యాయతను, అనురాగాన్ని పంచే చిలిపి అనుభవం. రొమాన్స్ కు ప్రారంభంలో అందరికీ గుర్తొచ్చేది ముద్దే.

ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. నేటితో వాలెంటైన్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ వారం రోజుల్లో కీలకమైనది కిస్ డే. ఈరోజు ప్రేమికుల మధ్య ముద్దు, మురిపాల ముచ్చట్లు జరుగుతాయి. ఇక మనలో కిస్ అనగానే అర్జున్ రెడ్డి, RX100 సినిమాలే గుర్తొస్తాయి.

ఎందుకంటే కుర్రకారు హద్దుల్లేకుండా ముద్దుల వానలో మునిగిపోయేందుకు ఇవి ఎంతగానో ప్రభావం చూపాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ముద్దు అనగానే తెగ మోహమాటపడేవారు చాలా మంది.

అయితే ఇప్పటితరం వారు ముద్దు పెట్టే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా.. ఎప్పుడు తమ పార్ట్నర్ తో కిస్ చేసుకుందామా అని తెగ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కిస్ వచ్చేసింది కిస్ డే. ఈ సందర్భంగా కిస్ డే అంటే కేవలం ముద్దులే కాదు.. ఈ విషయాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి...

ముద్దూ.. ముచ్చట..
మనలో చాలా మంది సింగిల్ గా ఉండే వారికి ఇలాంటి డైలాగులు ఎక్కువగా చెబుతుంటారు. ‘ముద్దూ ముచ్చట.. ముద్దూ మురిపెం లేని జీవితం' ఎందుకు అంటూ ఉంటారు. ఎందుకంటే రొటీన్, యాంత్రికంగా తయారైన మన జీవితంలో అప్పుడప్పుడూ ముద్దు, మురిపెం వంటివి ఉంటేనే చాలా థ్రిల్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రేమను చాటి చెప్పేందుకు ఉండే అద్భుతమైన సాధనాల్లో కిస్ చాలా కీలకమైనది.

బంధాన్ని బలంగా..
ఇక కిస్ అనగానే మనలో చాలా మందికి లిప్ లాక్ గుర్తొస్తుంది. అయితే ముద్దుల్లో చాలా రకాలున్నాయి. వాటిలో సినిమాల్లో చూపినట్టు గాల్లో ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చుకోవడం.. దగ్గరగా ఉన్నవారు బుగ్గపై కిస్ చేసుకోవడం.. నుదుటిపై ముద్దు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇంకా కొందరు అర్జున్ రెడిని సినిమాని ఆదర్శంగా తీసుకుని నేరుగా లిప్ లాక్ కోసం ట్రై చేస్తారు. అయితే కిస్ అనేది ఎలా పెట్టినా కూడా ప్రేమికుల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఆ సమయంలో ఇద్దరిలోనూ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.

ముద్దు పెట్టడం వల్ల..
కిస్ డే రోజున తమ ప్రేయసిని లేదా ప్రియుడిని ముద్దు పెట్టుకోవడం ద్వారా వారిని తాము ఎంతలా ఇష్టపడుతున్నామనేది.. వారికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని సులభంగా తెలియజేయొచ్చట. అయితే మనకు ఇష్టం లేని వారిని మనం కనీసం టచ్ కూడా చేయం. అయితే మనకిష్టమైన వారిని మాత్రం అస్సలు వదిలి ఉండలేం.

కిస్ డే కీలకం..
ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీకి సరిగ్గా ఒకరోజు ముందే వచ్చే ఈ కిస్ డే చాలా కీలకం. ఈ రోజున ముద్దుల ప్రపంచంలో మునిగితేలే ప్రేమికులు రేపటి రోజు అంటే వాలెంటైన్ రోజున మరోసాని తమ ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారట.

గిఫ్టులు ఇవ్వొచ్చు..
అయితే ముద్దుల విషయంలో కూడా హద్దులు ఉంటాయి. కిస్ డే అనగానే చాలా మంది ముద్దులు పెట్టుకోవడమని భావిస్తారు. అందుకే పెళ్లికి ముందు ఈ ముద్దులకు పెద్దలు హద్దులు పెడుతుంటారు. మన దేశంలో ఇలాంటి రోజు కేవలం బహుమతులే ఇచ్చుకునేవారంట. ఈరోజున రింగ్ లేదా లాకెట్ వంటివి బహుమతులుగా ఇవ్వడం ద్వారా ప్రేయసితో కలిసి ప్రియుడు జీవితాంతం ఉంటానని మాట ఇచ్చినట్టే. ఇదే రోజున ప్రియురాలికి మంచి పర్ఫ్యూమ్ లేదా మంచి రింగ్ వంటివి ఇవ్వొచ్చు. మగవారే కాదు.. ఆడవారు కూడా తమ ప్రియుడి కోసం మంచి టీషర్ట్స్, మగ్స్ వంటివి గిఫ్టులు ఇవ్వొచ్చు.

గొడవ తర్వాత కలవాలంటే..
ఒక్కోసారి మాటల్లో చెప్పలేని భావాలను కిస్ చేయడం ద్వారా చెప్పే వీలుంటుంది. అందుకే మనసులోని భావాలను కిస్ ద్వారా చెప్పేయండి. మీ భాగస్వామిపై అనంతమైన ప్రేమ ఉందని చెప్పేయండి. గొడవ తర్వాత కలిసిపోవాలంటే.. ఓ కిస్ తో స్టార్ట్ చేయండి. సారీ చెప్పాల్సిన సందర్భంలోనూ ముద్దుతోనే ప్రారంభించండి.

దాన్ని తగ్గిస్తుందట..!
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మన శరీరంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అయితే ముద్దు పెట్టినప్పుడు విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు కార్టిసాల్ ను తగ్గిస్తాయి. దీని వల్ల మన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అందుకే మీ పార్ట్ నర్ బాగా దగ్గరకు తీసుకోని ఓ కౌగిలి, ముద్దు ఇచ్చేస్తే ఒత్తిడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.
వాలెంటైన్ వీక్ లో ఏడో రోజున అంటే ఫిబ్రవరి 13వ తేదీన ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కిస్ డేను జరుపుకుంటారు. వాలెంటైన్ డే సందర్భంగా తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ముద్దు(kiss)ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు ప్రేమికులు. ఇలా చేయడం వల్ల తమ మధ్య బంధం మరింత బలపడుతుందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications











