For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentine's Week List 2022 : ఏడు రోజులు.. ఏడు వింతలు.. ఏడు పద్ధతులు.. ప్రేమ బంధానికి పునాదులు...!

ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమతో నిండిన రోజ్ డేతో వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. ఈరోజున మీరు మీ భార్య లేదా మీ ప్రియురాలికి మాత్రమే రోజ్ ఫ్లవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

|

ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ మొదలవ్వడానికి రెండు మనసులు ఒకటైతే చాలు. అయితే అలా మనసులు కలవాలంటే మాత్రం చాలా కష్టమైన పని. దాన్ని సాధించాలంటే పెద్ద యుద్ధం వంటిదే చేయాల్సి ఉంటుంది. దాని కోసం చాలా చొరవ చూపాలి.

Valentine Week List

ప్రేమకు ముందు ఏ ఇద్దరికి అయినా పరిచయం ఉండటం వేరు. అయితే వారి ఆలోచన పెళ్లి, ప్రేమ వంటి విషయాలకు వచ్చేసరికి పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే మనది కులాలు, మతాలు, సంప్రదాయాల వంటి వాటితో నిండి ఉన్న దేశం. అయితే చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రేమలో పడిపోతున్నారు. లేటు వయసులో పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు.

Valentine Week List

ఇంకా విశేషమేమిటంటే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఫిబ్రవరి నెల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి అనేది లవర్స్ మంత్ అని చాలా మంది అంటారు. ఎందుకంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జంటగా జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే వాలెంటైన్స్ డే వీక్ కు చాలా క్రేజ్ ఏర్పడింది. కరోనా ముప్పు తగ్గిన తర్వాత ఈ వాలెంటైన్ వీక్ ను ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకోండి.

రోజ్ డే తో ప్రారంభం..

రోజ్ డే తో ప్రారంభం..

వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ఈ వాలెంటైన్స్ వీక్ 2022 ప్రారంభించడానికి ఇంకా కొంత సమయమే ఉంది. ఇప్పటికే చాలా మంది వాలెంటైన్స్ వీక్ ను ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేక సన్నాహాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ వీక్ లో ప్రతిరోజూ ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు. తమ భాగస్వామితో తన్మయత్వంగా గడపాలని ఆశిస్తున్నారు. అయితే వాలెంటైన్స్ లో మీ భాగస్వామిని ఎలా సర్ ప్రైజ్ చేయాలి ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీలోని జాబితాను ఫాలో అవ్వండి.. ఈ వీక్ మొత్తం మీ పార్ట్ నర్ తో ఎంజాయ్ చేయండి.

ఏయే రోజున ఏమి ఉంటుందంటే..

ఏయే రోజున ఏమి ఉంటుందంటే..

ఫిబ్రవరి 7వ తేదీ, సోమవారం : రోజ్ డే

ఫిబ్రవరి 8వ తేదీ మంగళవారం : ప్రపోజ్ డే

ఫిబ్రవరి 9వ తేదీ బుధవారం : చాక్లెట్ డే

ఫిబ్రవరి 10వ తేదీ గురువారం : టెడ్డీ డే

ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం : ప్రామిస్ డే

ఫిబ్రవరి 12వ తేదీ శనివారం : హగ్ డే

ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం : కిస్ డే

ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం : లవర్స్ డే

రోజ్ డేతో ప్రారంభం..

రోజ్ డేతో ప్రారంభం..

ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమతో నిండిన ఈ వారం రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ఈరోజున మీరు మీ భార్య లేదా మీ ప్రియురాలికి మాత్రమే రోజ్ ఫ్లవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజున మీరు మీ ప్రత్యేక స్నేహితులకు పువ్వులు ఇవ్వడం ద్వారా కూడా ఈరోజును జరుపుకోవచ్చు.

న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ అల భాగ్యనగరంలో మొదలైందట...న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ అల భాగ్యనగరంలో మొదలైందట...

ప్రపోజ్ డే..

ప్రపోజ్ డే..

వాలెంటైన్ వీక్ లో రెండో రోజు అయిన ఫిబ్రవరి 8వ తేదీన చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రపోజ్ డే (ప్రతిపాదన చెప్పాల్సిన రోజు). ఈరోజున మీరు మీ భాగస్వామి లేదా మీ ప్రియురాలి ఎదుట మీలో దాగి ఉన్న భావాలను సంతోషంగా వ్యక్తం చేయాలి.

చాక్లెట్ డే..

చాక్లెట్ డే..

వాలెంట్ వీక్ లో మూడో రోజు అయిన ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డేగా జరుపుకుంటారు. ఈరోజు మీ రిలేషన్ షిప్ లో స్వీట్ ను కొనసాగించేందుకు మీరు ఈరోజు మీ ప్రియురాలికి లేదా మీ భాగస్వామికి ప్రేమతో ఒక మంచి చాక్లెట్ ఇవ్వాలి.

టెడ్డీ డే..

టెడ్డీ డే..

వాలెంట్ వీక్ లో నాలుగో రోజు అయిన ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేగా జరుపుకుంటారు. ఈరోజున మీరు మీ భాగస్వామికి ఒక అందమైన టెడ్డీని బహుమతిగా ఇవ్వొచ్చు.

ప్రామిస్ డే..

ప్రామిస్ డే..

వాలెంట్ వీక్ లో ఐదో రోజు అయిన ఫిబ్రవరి 11వ తేదీన మీ భాగస్వామితో లేదా మీ ప్రియురాలితో కలిసి భవిష్యత్తులో సంతోషంగా జీవిస్తామని ప్రామిస్ (ప్రమాణం) చేసే రోజు.

వింతలకే వింత... విమానంతో వివాహమాడనున్న ఆ మహిళ... మీరు విన్నది నిజమే...వింతలకే వింత... విమానంతో వివాహమాడనున్న ఆ మహిళ... మీరు విన్నది నిజమే...

హగ్ డే..

హగ్ డే..

కౌగిలి.. మీ ఇద్దరి ప్రేమకు ఉత్తమ లోగిలి.. వాలైంటెక్ వీక్ లో ఒక రొమాంటిక్ కౌగిలి అనేది మీ ఇద్దరి జీవితాలకు మంచి అనుభూతి కావాలి.. అందుకే వాలెంట్ వీక్ లో ఆరో రోజు అయిన హగ్ డే నాడు మీరు మీ భాగస్వామిని ప్రేమగా కౌగిలించుకోవాలి. మీ సంబంధాన్ని మరింత బలపరచుకోవాలి.

కిస్ డే..

కిస్ డే..

వాలెంట్ వీక్ లో ఏడో రోజు అయిన ఫిబ్రవరి 13వ తేదీన, మీరు మీ ప్రియురాలికి లేదా మీ భాగస్వామికి ప్రేమతో ముద్దు ఇచ్చి మీ ప్రేమను వ్యక్తం చేయాలి. ఈరోజున చాలా మంది జంటలు సినిమాకు వెళ్లడం లేదా ఒకరితో ఒకరు కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి ఏకాంతంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. అంతే కాదు, మీరిద్దరూ కలిసి ఒకరితో కలిసి ఒకరు మంచి సమయాన్ని గడపవచ్చు.

వాలెంటైన్స్ డే..

వాలెంటైన్స్ డే..

ఇది లాస్ట్ అయిన చాలా లేటెస్ట్.. ఈరోజే మీకు అసలు సిసలైన రోజు. ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే నాడు మీరిద్దరూ కలిసి పార్కులలో ప్రశాంతంగా గడిపేందుకు వెళ్లొచ్చు. అంతేకాదు మీరు ఇంట్లో ఉండి కూడా ఒకరితో ఒకరు ఏకాంతంగా ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించవచ్చు.

FAQ's
  • వాలెంటైన్స్ డే వీక్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?

    చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఫిబ్రవరి నెల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి అనేది లవర్స్ మంత్ అని చాలా మంది అంటారు. ఎందుకంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జంటగా జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే వాలెంటైన్స్ డే వీక్ కు చాలా క్రేజ్ ఏర్పడింది. ఇక అసలు విషయానికొస్తే.. వాలెంటైన్ వీక్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఏడో తేదీ నుండి ప్రారంభమవుతుంది. 14వ తేదీన ముగుస్తుంది. ఈ ఏడు రోజుల పాటు ప్రేమికులు ఎంతో ఆనందంగా గడుపుతారు.

English summary

Valentine Week List : Check all special days with date in Telugu

During February month, from the 7th to the 14th, the world will be celebrating the Valentine week, starting with Rose Day. Here are those days of build-up to Valentine’s Day.
Desktop Bottom Promotion