Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కారులో ఆ కార్యం కానిచ్చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే...
కారులో ఆ కార్యం కానిచ్చేవారి కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారం విషయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి. కొందరు సినిమాల్లో చూసి ప్రభావితమైతే.. మరికొందరు పుస్తకాల్లో కథలను చూసి ప్రేరణ పొందుతారు.

అలా కలయికలో పాల్గొనడం వల్ల కపుల్స్ ఇద్దరికీ మంచి అనుభూతి కలుగుతుందని భావిస్తారు. అంతేకాదు శృంగారం వల్ల భార్యభర్తలిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

ఇక మన భారతీయ సమాజంలో శృంగారం అంటే రహస్య కార్యంగా.. నాలుగు గదుల మధ్య పవిత్ర కార్యంగా భావిస్తారు. అందుకే శృంగారం గురించి ఇప్పటికీ మన దేశంలో బహిరంగంగా మాట్లాడుకోరు. దీంతో చాలా మందికి ఆ కార్యం పట్ల అనేక అపొహలు ఏర్పడుతూ ఉంటాయి. మరొకొందరు ఆ కార్యాన్ని కూడా ఆచారం ప్రకారం చేయాలనుకుంటారు.

ఇదిలా ఉండగా.. కొందరు జంటలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కొన్ని ఫాంటసీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటిలో కారులో ఆ కార్యం చేయాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. ఇలా కారులో రొమాన్స్ చేసే కల్చర్ విదేశాల్లో ఎక్కువగా జరుగుతుందని మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. కొందరు కోరికలను ఆపుకోలేక.. మూడ్ వస్తే చాలు కారులోనే రెచ్చిపోతుంటారు. అయితే అలా కారులో ఆ కార్యంలో పాల్గొనడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించరు. ఎందుకంటే కారులో కలయికలో పాల్గొన్నంత మాత్రాన, మంచి ఫీలింగ్ ఏమీ కలగదట. సినిమాల్లో చూపించినంత ఈజీగా ఏమీ ఉండదట. ఈ సందర్భంగా కారులో రొమాన్స్ చేయాలనుకునే వారు ఈ ముఖ్యమైన విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ కారులో ఆ కార్యం ఎందుకు చేయకూడదనేందుకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కారులో కష్టంగా ఉంటుదట..
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ఆ కార్యంలో పాల్గొనడం అనేది ఇప్పటికీ నిషేధమే. కాబట్టి మీరు రోడ్డుపైన లేదా ఇతర ఏకాంత పార్కింగ్ స్థలాల్లో మీరు ఆ కార్యంలో పాల్గొంటూ ఉండగా.. పోలీసులకు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మహిళలకు చాలా బాధకరంగా ఉంటుందట. అందుకే పెళ్లి తర్వాత ఆ కార్యం ఇంట్లోని పడకగదిలో నాలుగు గోడల మధ్య జరగాలని అంటారు.

సంతృప్తి పొందలేరు..
కారులో కలయికలో పాల్గొనేందుకు సరైన స్థలం అందుబాటులో ఉండదు. మీరు కోరుకున్న భంగిమలో శృంగారం చేయకపోవచ్చు. కారులోని గేర్, అద్దం, డోర్ ఇలా ఏదో ఒకటి తగిలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు గాయపడే ప్రమాదం ఉంది. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోచేయి లేదా శరీరంలోని ఇతర భాగాలకు కచ్చితంగా దెబ్బతింటాయి. కాబట్టి కారులో రొమాన్స్ చేస్తున్నప్పుడు, లొకేషన్ చూసి జాగ్రత్తగా పాల్గొన్నప్పటికీ, ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు మీరు సంతృప్తిని పొందలేరు.

హ్యాపీగా ఉండదు..
కారులో ప్లేసు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మీరు కోరుకున్నంతగా ఎంజాయ్ చేయకపోవచ్చు. ఎందుకంటే కారులో ప్లేసు చాలా ఇరుకుగా ఉంటుంది.. దీంతో మీకు కలయికలో పాల్గొనేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కారులోని ముందు సీట్లలో స్థలం మరీ తక్కువగా ఉంటుంది. బ్యాక్ సీట్లో అయితే కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ అది కూడా ఆ కార్యంలో పాల్గొనేందుకు అనువుగా ఉండదు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఆ పని కానిచ్చేయాలి. అయినా ఇది ఆనందాన్ని ఇవ్వదు.

ఊపిరాడదు..
కారులో ఇరుకైన స్థలం కారణంగా.. మీరు కలయికలో పాల్గొన్నప్పుడు బాడీలో వేడి తగ్గిపోతుంది. ఇక విండోస్ మూసిన కారులో ఏసి కాసేపు ఆన్ చేయకపోతే గాలి ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. అద్దాలన్నీ ఆవిరిగా మారడంతో కదులుతున్న కారులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం.

లెదర్ సీట్లుంటే..
మీ కారులో లెదర్ సీట్లు ఉంటే, మీ భాగస్వామితో రొమాన్స్ లో పాల్గొనడం మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. ఖాళీ స్థలం లేకపోవడం, శబ్దాలు, వాటిపై అసౌకర్య కదలిక మొదలైనవి సంతోషకరమైన సరసాలను ఆస్వాదించడం కష్టంగా ఉంటుంది.

కారులో కానివ్వాలంటే..
ఒకవేళ మీరు కారులో ఆ కార్యంలో పాల్గొనాలని భావిస్తుంటే, ప్రతిరోజూ యోగా చేయండి. మీ కండరాలను బలంగా మార్చుకోండి. లేదంటే మీకు కీళ్ల నొప్పులు, ఒళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక కారులో ఎలా పడితే అలా ఆ పని చేస్తే.. మీ కాళ్లలోని చిన్న నరాలకు చాలా ఇబ్బంది కలుగుతుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కారులో ఆ కార్యంలో పాల్గొనాలనుకునే వారు ఎవరూ లేని చోట.. అది కూడా రాత్రి వేళలో పాల్గొంటే మేలని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
కారులో కలయికలో పాల్గొనేందుకు సరైన స్థలం అందుబాటులో ఉండదు. మీరు కోరుకున్న భంగిమలో శృంగారం చేయకపోవచ్చు. కారులోని గేర్, అద్దం, డోర్ ఇలా ఏదో ఒకటి తగిలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు గాయపడే ప్రమాదం ఉంది. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మోచేయి లేదా శరీరంలోని ఇతర భాగాలకు కచ్చితంగా దెబ్బతింటాయి. కాబట్టి కారులో రొమాన్స్ చేస్తున్నప్పుడు, లొకేషన్ చూసి జాగ్రత్తగా పాల్గొన్నప్పటికీ, ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు మీరు సంతృప్తిని పొందలేరు.
ఒకవేళ మీరు కారులో ఆ కార్యంలో పాల్గొనాలని భావిస్తుంటే, ప్రతిరోజూ యోగా చేయండి. మీ కండరాలను బలంగా మార్చుకోండి. లేదంటే మీకు కీళ్ల నొప్పులు, ఒళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక కారులో ఎలా పడితే అలా ఆ పని చేస్తే.. మీ కాళ్లలోని చిన్న నరాలకు చాలా ఇబ్బంది కలుగుతుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కారులో ఆ కార్యంలో పాల్గొనాలనుకునే వారు ఎవరూ లేని చోట.. అది కూడా రాత్రి వేళలో పాల్గొంటే మేలని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Click it and Unblock the Notifications