For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral Story:తనతో పెళ్లి కావాలంటే.. ఈ షాకింగ్ రూల్స్ కు ఓకే చెప్పాలన్న కుర్రాడెవరో తెలుసా...

|

మనలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడాలన్నా.. సాన్నిహిత్యం పెరగాలన్నా.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి.

రిలేషన్ షిప్ లో ఇలాంటివి లేకపోతే.. అది ఎలాంటి బంధమైనా సరే చీలికలు రావడమో లేదా గొడవలు వంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రేమ సంబంధంమైనా.. వివాహ బంధమైనా.. నమ్మకం అనే పునాదులపైనా అనుబంధం కలకాలం ఆనందంగా కొనసాగుతుంది. అలా కాకుండా సంబంధంలో ప్రతి చిన్న దానికి నిందలు వేసుకోవడం.. భాగస్వామిలో పదే పదే లోపాలు వెతకడం.. ప్రతి దానికీ పార్ట్నర్ ను బాధ్యులను చేస్తే.. ఆ బంధం బీటలు వారడం ఖాయం.

ఏ రిలేషన్ షిప్ లో అనుమానం అనేది ఇసుమంత ఉన్నా కూడా ఆ బంధం మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే తమ పార్ట్నర్ పై డౌట్ ఉండే వారు వారిని అనునిత్యం ఫాలో అవుతూ.. వారిపై డేగకన్ను వేసి ఉంటారు. ఏ చిన్న తప్పు జరిగినా వారిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ బాయ్ ఫ్రెండ్ తన ప్రేయసితో పెళ్లికి ముందే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ.. అవి చేయాలి.. ఇవి చేయాలి.. అది చేయొద్దు.. ఇది చేయొద్దు.. అని ఏకంగా 11 షాకింగ్ రూల్స్ పెట్టాడట. ఈ కండిషన్స్ కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశాడట. ఈ షాకింగ్ రూల్స్ పెట్టే ముందే ఓ నోట్ సిద్ధం చేసి తన ప్రియురాలికి అందించాడు. ఇది చూసి ఆ ప్రియురాలు షాకయ్యింది. ఇంతకీ ఆ కుర్రాడు పెట్టిన కండిషన్స్ ఏంటి.. ఆ కుర్రాడు ఎవరు? అంత ఆశ్చర్యకరమైన రూల్స్ ఏమున్నాయి.. ఎందుకని ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది? నెటిజన్లు ఎందుకని తెగ ట్రోల్ చేస్తున్నారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అలా చేస్తే.. మీకు నచ్చిన అమ్మాయి వయసుతో పని లేకుండా పడిపోతుందట...!

అమెరికాలో..

అమెరికాలో..

అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న కరోలిన్ అనే అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పటివరకు వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ముప్పై పువ్వులు.. అరవై కాయలుగా సాఫీగా సాగింది. అయితే అనుకోకుండా ఆ కుర్రాడికి ఏమైందో తెలియదు కానీ.. తన ప్రియురాలి కోసం 11 షాకింగ్ రూల్స్ క్రియేట్ చేశాడు. వాటిని కచ్చితంగా ఫాలో కావాలన్నాడు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

తాను లేకుండా..

తాను లేకుండా..

కరోలిన్ (తన ప్రియురాలు) తాను లేని సమయంలో బయటకు సింగిల్ గా తిరగకూడదు. ఎవ్వరితోనూ కలవకూడదు. బయట ఏమి తినకూడదు. డ్రస్సు లూజుగా ఉండేదే వేసుకోవాలి. టైట్ గా డ్రస్సులు వేసుకోకూడదు. తాను లేనప్పుడు అబ్బాయిలతో అస్సలు మాట్లాడకూడదు.

కపుల్స్ ఆ కార్యాన్ని అకస్మాత్తుగా అవాయిడ్ చేసేందుకు గల కారణాలేంటో తెలుసా...

కచ్చితంగా పాటించాలని..

కచ్చితంగా పాటించాలని..

తను ఇచ్చిన ఉంగరాన్ని ఎప్పటికీ తీసివేయకూడదు. రాత్రి తొమ్మిది గంటలలోపు ఇంటికి కచ్చితంగా రావాలని, అలాగే క్రాప్ టాప్ వంటివి వేసుకోకూడదు. పార్టీలకు అస్సలు వెళ్లకూడదు. తనతోనే ఎక్కడికైనా వెళ్లాలి అనే రూల్స్ పెట్టాడు. ప్రతిరోజూ ఈ రూల్స్ ను కచ్చితంగా ఫాలో కావాలని కోరాడు.

ఈ రూల్స్ ను..

ఈ రూల్స్ ను..

తన బాయ్ ఫ్రెండ్ పెట్టిన ఈ 11 షాకింగ్ రూల్స్ ను కరోలినా స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి వ్యక్తితో నేను ఇన్ని రోజులు ఎలా రిలేషన్ కొనసాగించాను.. అని బాధపడిన ఆమె తనతో బంధానికి గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు ఆ పోస్టులో వివరించింది. అయితే తను ఆ విషయంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

నెటిజన్ల ట్రోలింగ్..

నెటిజన్ల ట్రోలింగ్..

ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ముందుగా తనతో రిలేషన్ షిప్ కట్ చేసుకోవాలనుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి వాడితో బంధం కంటిన్యూ చేస్తే.. అన్నీ మూసుకుని వాడు చెప్పినట్లుగా ఆటలాడాల్సి వస్తుందని.. వాడి చేతిలో నీవు కీలుబొమ్మగా మారే అవకాశం ఉందన్నారు.

English summary

Viral Story: Boyfriend makes 11 shocking rules for girlfriend; Here is the list in Telugu

Here are the boyfriend makes 11 shocking rules for girlfriend, Here is the list in Telugu. Have a look
Story first published: Tuesday, September 21, 2021, 14:38 [IST]