Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
తాళి కట్టే టైమ్ కి వరుడికి షాకిచ్చిన వధువు.. ‘నా లవర్ వస్తాడంటూ... తననే పెళ్లి చేసుకుంటానని..’
సరిగ్గా తాళి కట్టే శుభ ముహర్తం వేళ వరుడికి వధువు ఎలాంటి షాకిచ్చిందో చూడండి..
మన చూసే సినిమాల్లో.. తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇంకెక్కడైనా పెళ్లిళ్లలో ఏదో ఆటంకం రావడం.. చివరి నిమిషంలో కళ్యాణం ఆగిపోవడం జరగడం సర్వసాధారణం. ఇక తెలుగు సినిమాల్లో అయితే.. సరిగ్గా తాళి కట్టే వేళ ఆపండి.. ఆగండి.. అనే డైలాగులు మనం ఎన్నోసార్లు వినే ఉంటాం.

అయితే రియల్ లైఫ్ లో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి వెరైటీ ట్విస్ట్ తాజాగా వెలుగులోకొచ్చింది. కరోనా టైమ్ లో కళ్యాణం చేసుకుంటున్నానని.. తాను కూడా ఓ ఇంటివాడు అవుతానని సంబరపడ్డ కొత్త పెళ్లికొడుక్కి.. సరిగ్గా తాళి కట్టే సమయానికి వధువు దిమ్మ తిరిగే షాకిచ్చింది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తను ఇది వరకే ఓ వ్యక్తిని ప్రేమించానని.. మరి కాసేపట్లో తన ప్రియుడు(లవర్) వస్తున్నాడని తననే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పేసింది.

ఆ క్షణం పెళ్లికొడుక్కి ఆమె ఏమి చెబుతుందో అర్థం కాలేదు.. మీరెమి చెబుతున్నారో నాకర్థం కావడం లేదు.. మళ్లీ చెప్పమన్నాడు.. అయితే ఆ వధువు అందరి ముందు ధైర్యంగా తన ప్రియుడి గురించి చెప్పేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ పెళ్లికూతురు తన ప్రియుడిని పెళ్లాడిందా.. లేదా తనతోనే బలవంతంగా మూడు ముళ్లు వేయించుకుందా అనే విషయం తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

తమిళనాడులో..
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా మట్టకండి గ్రామంలో కరోనా టైములో ప్రియదర్శి అనే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించేందుకు అక్టోబర్ 29న ముహుర్తాన్ని నిర్ణయించారు.

కరోనా కారణంగా..
కరోనా మహమ్మారి కారణంగా అతికొద్ది మంది బంధువులను, స్నేహితులను మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అందరూ అనుకున్నట్టుగానే వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తల్లిదండ్రులు.

పెళ్లిపీటల మీద..
అయితే పెళ్లిపీటల మీద ఉన్న ప్రియదర్శి అనే పెళ్లికూతురు సరిగ్గా తాళికట్టే శుభ ముహుర్తం సమయానికి తన మనసు మార్చుకుంది. ఎందుకంటే తన మనసులో మరొకరు ఉన్నారు. అయితే ఆ విషయాన్ని పెళ్లిపీటల మీద కూర్చునేంత వరకు ఎవరికీ చెప్పలేదు.

తాళికట్టే సమయానికి..
సరిగ్గా తాను ఓ ఇంటి వాడిని అవుతున్నానంటూ సంబంరంలో ఉన్న పెళ్లికొడుక్కి ఒక్కసారిగా షాకిచ్చింది. శుభముహుర్తం వచ్చేసిందని వధువు మెడలో మూడు ముళ్లు వేయమని పంతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వరుడికి రెడ్ సిగ్నల్ ఇచ్చింది. సరిగ్గా తాళికట్టే సమయానికి తన ప్రియుడి గురించి చెప్పింది.

వరుడికి షాక్..
‘ఒక అరగంట ఓపిక పట్టండి. నా ప్రియుడు వస్తున్నాడు. తనే వచ్చి నా మెడలో తాళి కడతాడు' అని చెప్పేసరికి వరుడికి దిమ్మతిరిగింది. ఈ మాటలకు షాకైన తను క్లారిటీ కోసం ‘ఏమంటున్నావ్' అని మరోసారి పెళ్లికూతురిని ప్రశ్నించాడు.

తననే పెళ్లాడతా..
తన ప్రశ్నకు ప్రియదర్శి అనే పెళ్లికూతురు ఇలా బదులిచ్చింది. ‘నాకు ఈ వివాహం ఇష్టం లేదు. నేను ఓ యువకుడిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పింది. ఆ వధువు మాటలు విన్న బంధువులు, వరుడి తల్లిదండ్రులు తెల్లముఖం పెట్టారు.

కోపంతో కొట్టడానికి..
వరుడు ఇదే విషయాన్ని తమ బంధువులకు చెబుతుండగానే.. ప్రియదర్శి పెళ్లి పీటల మీద నుండి పైకి లేచింది. దీంతో వరుడి బంధువులలో ఓ మహిళ వధువుని కొట్టినంత పని చేసింది.

నచ్చిన వాడితోనే..
కానీ వధువు తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తె మనసు తెలుసుకుని.. ఆమెకు నచ్చిన వాడితోనే పెళ్లి జరిపిస్తామని చెప్పారు. తమ కూతురి ప్రేమను అర్థం చేసుకున్న ప్రియదర్శి పేరేంట్స్ అదే మండపంలో తను ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి జరిపించారు.

ఈ తంతును ఆసక్తిగా..
దీంతో ఈ వివాహ వేడుకకొచ్చిన బంధువులందరూ ఈ పెళ్లి తంతును చివరివరకు ఉండి చాలా ఆసక్తిగా తిలకించారు. మరో విశేషం ఏమిటంటే.. పెళ్లికొడుకు కూడా ప్రియదర్శి ప్రేమను అర్థం చేసుకుని.. ఏ గొడవ చేయకుండా అక్కడి వెళ్లిపోవడం గమనార్హం. అంతేకాదు వారి బంధువులందరికీ నచ్చజెప్పి అక్కడి నుండి తీసుకెళ్లడం విశేషం.
వైరల్ అయిన పెళ్లి..
అచ్చం సినిమా సీన్లను, ట్విస్టులను తలపించిన ఈ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వివాహం గురించి దేశమంతా ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. ఈ పెళ్లి తంతును మీరు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు.



Click it and Unblock the Notifications