For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!

మీ వివాహ జీవితాన్ని మరింత రొమాంటిక్ గా మార్చుకునేందు ఉన్న మార్గాలేంటో చూడండి.

|

ఇప్పటివరకు వేసవికాలం ఉక్కపోతతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా కురుస్తున్నాయి. మండుటెండల్లో, కరోనా లాక్ డౌన్లో అల్లాడిన వారికి ఇప్పుడిప్పుడు కాస్త ఊరట లభించింది. ఇక పెళ్లైన జంటలకైతే వర్షాకాలం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ways to Immediately Improve Your Romantic Relationship

అయితే ప్రస్తుతం పెళ్లయిన కొత్తలో కొందరు జంటలు రతిక్రీడను అనుకున్నంతగా ఆస్వాదించలేకపోతున్నారు. బిజీ లైఫ్, మానసిక సమస్యలు, ఆర్థిక పరిమితులు ఇతర కారణాలతో ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. దీంతో సెక్స్ లైఫ్ పై కొత్త జంటలకు ఆసక్తి తగ్గిపోతోంది.

Ways to Immediately Improve Your Romantic Relationship

మరి కొందరు తమ పార్ట్ నర్ తో పడకగదిలో ఆ కార్యంలో పాల్గొనేందుకు భయపడుతున్నారు. మరికొందరు రతి క్రీడలో రోటీన్ గా పాల్గొనడం వల్ల బోర్ కొడుతుందని ఫీలవుతున్నారు.

Ways to Immediately Improve Your Romantic Relationship

ఈ నేపథ్యంలో లైంగిక జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకోవడానికి, మీ భాగస్వామితో సంబంధాన్ని మరింత సన్నిహితంగా మార్చుకునేందుకు కొన్ని కొత్త మార్గాలను అన్వేషించాలి. అందుకోసం మీరు బయటికే వెళ్లాల్సిన పనిలేదు. మీరు ఈ వర్షాకాలంలో మీ రొమాంటిక్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ విషయంలో మోసం జరిగితే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా...ఆ విషయంలో మోసం జరిగితే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా...

వర్షంలో తడిచేయండి..

వర్షంలో తడిచేయండి..

మీ ఇద్దరికీ వర్షం అంటే ఇష్టం అయితే.. మీరు నీటిలో తనివితీరా తడిచిపోండి. ఒకరిపై మరొకరు వాన చినుకులు చల్లుకుంటూ ఎంజాయ్ చేయండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గా సన్నిహితం పెరుగుతుంది. అయితే వర్షం మరీ కుండపోతలా కురుస్తుంటే మాత్రం ఇలాంటివి చేయకండి. వర్షం చిరు జల్లులుగా కురుస్తున్నప్పుడు ఇలాంటి ఆటలను ప్రయత్నించండి. మీ ఇద్దరికీ డ్యాన్స్ వస్తే.. మీ పార్ట్ నర్ తో కలిసి చక్కని రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ వేయండి. దీంతో మీ ఇద్దరికీ ఎక్సర్ సైజ్ చేసినట్టు కూడా అవుతుంది. డ్యాన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటే.. మీరిద్దరూ కలిసి వానలో అటు, ఇటూ తిరగండి. లేదా వానను చూస్తూ ఇంట్లోనే డ్యాన్స్ వేయండి. మీరిద్దరూ ఎలా చేసినా మీ ఇద్దరి మధ్య కోరికలు పెరిగితే చాలు. మీరు పడకగదిలో పార్ట్ నర్ తో రెచ్చిపోవచ్చు.

వెచ్చని కౌగిలి..

వెచ్చని కౌగిలి..

సాధారణంగా వర్షాకాలం, చలికాలం జంటలను మరింత దగ్గర చేసే కాలాలు అంటుంటారు పెద్దలు. అది వాస్తవమే. బయట చల్లని వాతావరణం ఉన్నప్పుడు వెచ్చగా మీ భాగస్వామిని కౌగిలించుకుంటే.. మీ బాడీలో వేడి పుట్టడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. అందుకే వర్షం కురుస్తున్నప్పుడు మీరు ఆ కార్యంలో పాల్గొనడం కూడా మంచి పనే. అయితే మీరిద్దరూ రోటీన్ గా చేసే రొమాన్స్ కంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తే.. అది మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

మీ కోరికలను..

మీ కోరికలను..

మీ ఇద్దరికీ కొత్తగా పెళ్లైతే.. మీరు మీ భాగస్వామితో మీ కోరికలను షేర్ చేసుకోండి. వారి కోరికలేంటో కూడా తెలుసుకోండి. ఇలా మీరిద్దరూ ఆ కార్యం గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలు.. మీరు రతి క్రీడను బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మీ పార్ట్ నర్ విషయంలో కూడా బాగా నమ్మకంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

ఆషాడ మాసంలో కొత్త జంటల కలయిక ఎందుకు ఉండదో తెలుసా...ఆషాడ మాసంలో కొత్త జంటల కలయిక ఎందుకు ఉండదో తెలుసా...

పోల్చుకోవద్దు..

పోల్చుకోవద్దు..

చాలా మంది సినిమాల్లో చూపించినట్టు తాము కూడా ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలా మీరు మీ లైంగిక జీవితాన్ని పోల్చి చూసుకుంటే.. మీరు ఎప్పటికీ ఆ కార్యాన్ని ఆస్వాదించలేరు. ఎందుకంటే సినిమాల్లో చూపించేది అంతా నిజం కాదు. మీలో ఉత్తేజం నింపేందుకు.. కోరికలు పుట్టేందుకు వారు ఎడిటింగ్, మేకప్ ఎక్కువగా చేస్తారు. మీరు ప్రతికూల ఆలోచనలు చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి మీ లైంగిక జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేయడం వంటివి చేయొద్దు. దీని వల్ల మీరు ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మీరు వీలైనంత ఎక్కువగా రతి క్రీడలో ఎక్కువసార్లు పాల్గొనాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి ప్రముఖ సెక్సాలజిస్టు మురాడియన్ ఇలా అన్నారు. మీ లైంగిక జీవితాన్ని ఇతరులతో పోల్చుకునే ముందు ముందుగా మీరు ఆ కార్యాన్ని ఆనందించడంపై ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పారు.

ఫోర్ ప్లేతో ప్రారంభించండి..

ఫోర్ ప్లేతో ప్రారంభించండి..

మీ భాగస్వామితో కలయికలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లేతో ప్రారంభించండి. ఇది మీ లైంగిక జీవితాన్ని పెంచే ఉత్తమ మార్గాల్లో ఒకటని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే కొందరు ఫోర్ ప్లే కాకుండా నేరుగా ఆ కార్యంలో అడుగుపెడుతుంటారు. దీని వల్ల కాసేపటికే వారు డీలా పడిపోతారు. ఇలా జరగకూడదంటే.. మీ భాగస్వామిని ముందుగా మూడ్ లోకి తీసుకురావాలి. మీ పార్ట్ నర్ బాడీలోని సున్నితమైన భాగాలను మీ చేతులతో సుకుమారంగా తాకాలి. ఇక రొమాన్స్ ముగించే సమయానికి ఆరు సెకన్ల ముందు మీ భాగస్వామికి ఓ ముద్దు ఇవ్వడం ద్వారా మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్య శారీరక సంబంధం మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

రొమాంటిక్ ఫీలింగ్..

రొమాంటిక్ ఫీలింగ్..

మీరిద్దరూ పడకగదిలో రొమాంటిక్ ఫీలింగ్ పొందాలంటే మీ ఇద్దరి మధ్య లైంగిక జీవితంపై విశ్వాసం ఉండాలి. అందుకోసం మీకు ఎలాంటి భంగిమలంటే ఇష్టం.. మీ భాగస్వామికి ఏ రకమైన భంగిమలు ఇష్టమో తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ రతి క్రీడకు సంబంధించి కొన్ని కోరికలు ఉంటాయి. అప్పుడు మీరిద్దరూ ఆ కార్యంలో పాల్గొంటే.. మీరిద్దరూ పూర్తి మజాను పొందుతారు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్..

డబుల్ మీనింగ్ డైలాగ్స్..

మీరిద్దరూ బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు.. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి ముందు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుకోవాలి లేదా డర్టీ టాక్స్ చేసుకోవడం కూడా మీ ఇద్దరిలో మూడ్ పెంచుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికీ ఆనందం కలుగుతుంది. వీటి వల్ల కూడా మీ బాడీలో హార్మోన్లు ఉత్తేజంగా మారి మిమ్మల్ని ఆ కార్యానికి సిద్ధం చేసేస్తాయి.

ఇబ్బందులను గుర్తించండి..

ఇబ్బందులను గుర్తించండి..

ఆస్ట్రేలియన్ స్టడీ ప్రకారం 20.3 శాతం మంది స్త్రీలు, 2.4 శాతం మంది పురుషులు రతి క్రీడ సమయంలో శారీరక నొప్పితో ఇబ్బంది పడ్డారని తేలింది. సాధారణంగా మహిళలు బాధాకరమైన, ఇష్టం లేని లైంగిక కార్యాన్ని ఇష్టపడరు. అందుకే వారిని ఇబ్బందిపెట్టకుండా సున్నితంగా వ్యవహరించాలి. అలాంటి సందర్భాల్లో మీరిద్దరూ ఆహ్లాదకర వాతావరణంలో గడపాలి. మీ భాగస్వామికి ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు ఆ సమయంలో ఆ కార్యంలో పాల్గొనకండి. అయినా సమస్యలుంటే మంచి సెక్స్ నిపుణుడిని కలిసి సలహాలు తీసుకోండి.

English summary

Ways to Immediately Improve Your Romantic Relationship

Here are the ways to immediately improve your romantic relationship. Have a look
Story first published:Monday, June 28, 2021, 15:14 [IST]
Desktop Bottom Promotion