For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!

|

రిలేషన్ షిప్ లో ఉన్న వారు.. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంట పడకగదిలో ఎంతో ఆనందాన్ని పొందాలని ఆరాటపడుతుంటారు. అయితే అందులో కేవలం కొందరు మాత్రం ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఆచరణలో అందరికీ అది సాధ్యం కాదు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతుంటారు. ముఖ్యంగా ఆ కార్యంపై క్రమంగా ఆసక్తి తగ్గించుకుంటూ ఉంటారు. మీ పార్ట్ నర్ తో మీకు అలా కాకుండా.. ఎప్పుడు కలయికలో మీరు కొత్తగా.. తాజాగా.. చురుకుగా.. ఉత్సాహంగా ఉండాలంటే.. కొన్ని పద్ధతులు పాటించాలి.. అవేంటో మీరే తెలుసుకోండి...

మీ పార్ట్ నర్ పై ప్రేమ పెరుగుతూ పోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

రొమాంటిక్ పేర్లతో..

రొమాంటిక్ పేర్లతో..

మీరు మీ భాగస్వామిని అనునిత్యం రొమాంటిక్ గా పిలిస్తే.. వారు చాలా ఆనందపడతారు. ఇలాంటి పేర్లను అందరిలాగే మీ పార్ట్ నర్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే మీరు మీ భాగస్వామిని రోటీన్ గా పిలవడానికి.. రొమాంటిక్ గా పిలవడానికి ఎంతో తేడా ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరూ ఏవైనా నిక్ నేమ్స్ పెట్టుకుని.. వాటితో పిలుచుకుంటే చాలా బెటర్.

మూడ్ పెరగాలంటే..

మూడ్ పెరగాలంటే..

మీ పార్ట్ నర్ మీకు నచ్చిన పని ఏదైనా చేస్తుందంటే.. దాన్ని కొనసాగించేలా ప్రోత్సాహిస్తూ ముచ్చట్లను ప్రారంభించండి. దీని వల్ల మీ పార్ట్ నర్ మూడ్ పెరుగుతుంది. అప్పుడు మీరు బెడ్ రూమ్ లో భాగస్వామితో బాగా ఎంజాయ్ చేయొచ్చు.

వీకెండ్స్ లో..

వీకెండ్స్ లో..

మన దేశంలో కొందరు దంపతులు మొదట్లో తమ భాగస్వామితో కలిసి బాగా ఎంజాయ్ చేసేందుకు వీకెండ్స్ కి బయటికెళ్తుంటారు. అయితే కాలం మారే కొద్దీ వీటికి బ్రేకులు వేస్తుంటారు. అయితే అలా ఆపితే.. వారికి మీపై ఇష్టం తగ్గిపోతుందట.. అందుకే మీకు వీలు కుదిరిన ప్రతిసారీ.. దాని కోసం సమయాన్ని కేటాయించుకోవాలి.

బంధం బలపడాలంటే..

బంధం బలపడాలంటే..

మీరు మీ భాగస్వామితో బంధాన్ని బలంగా మార్చుకోవాలంటే.. రెగ్యులర్ గా డేట్స్ కి వెళ్లాలి. మీరిద్దరే ఏకాంతంగా గడపాలి. ఇలాంటి వాటిని మీరు నెలకు కనీసం ఐదారుసార్లైనా చేస్తే మీ బంధం మరింత బలపడిపోతుంది.

పెద్దలు చేసే పెళ్లిలో మనం గుర్తించని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా...

రోజంతా ఆలోచించేలా..

రోజంతా ఆలోచించేలా..

అప్పుడప్పుడు మీరు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాల్సి రావొచ్చు. అలాంటి సమయంలో గత రాత్రి జరిగిన రొమాన్స్ గురించి రొమాంటిక్ మెసెజెస్ పంపండి. ఇలా చేయడం వల్ల వారు రోజంతా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు.

వేర్వేరు ప్రాంతాలకు..

వేర్వేరు ప్రాంతాలకు..

మీరు మీ భాగస్వామిని ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంచాలనుకుంటే.. వారిని ఆశ్చర్యపరచాలనుకుంటే.. రకరకాల గిఫ్టులే ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి కొత్త కొత్త ప్లేసులకు తీసుకెళ్లాలి. సరదాగా వీకెండ్స్ ఏదైనా లాంగ్ డ్రైవ్ కు లేదా లాంగ్ టూర్ వెళ్లడం వంటివి చేయడం వల్ల మీ బంధం చాలా సాఫీగా సాగిపోతుంది.

నీకెలా సాధ్యం..

నీకెలా సాధ్యం..

మనలో పొగడ్తలకు పడిపోని వారు ఎవరుంటారు చెప్పండి. అందరికీ పొగడ్తలంటే బాగా ఇష్టమే. మీరు ఆ కార్యంలో ఆనందంగా ఫీలవుతున్నారని.. మీ భాగస్వామి తెలుసుకోవాలంటే.. ఇలా చెప్పి చూడండి.. ‘ఇప్పుడు నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు ఇలా ఎలా చేయగలవు' అని చెబితే చాలు మీ ఆనందం రెట్టింపవ్వడం ఖాయం.

పనులను షేర్ చేసుకోవాలి..

పనులను షేర్ చేసుకోవాలి..

ఇద్దరు వ్యక్తులు ఎంత దగ్గరగా ఉంటే.. అంత ఎక్కువగా ఆనందం పెరుగుతుంది. అయితే మీ హ్యాపీనెస్ మరింత పెరగాలంటే.. మీరిద్దరూ కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. మీరు ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలనుకుంటే.. ఇద్దరు ఫైనాన్షియల్ ప్లాన్స్ తో పాటు సరదాగా గేమ్స్ పెట్టుకోవాలి. అలాగే మీరు చేసే పనులను షేర్ చేసుకోవాలి.

English summary

Ways to Keep Your Relationship Exciting and Fresh in Telugu

Here are these ways to keep your relationship exciting and fresh in telugu. Have a look
Story first published: Wednesday, April 7, 2021, 18:07 [IST]