Just In
- 50 min ago
మాంసాహారం కంటే ఈ పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు... దృఢమైన శరీరానికి ఇవి చాలు!
- 3 hrs ago
రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి
- 4 hrs ago
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
- 4 hrs ago
తల చాలా దురదగా ఉందా? మీరు ఈ చిట్కాలను ప్రయత్నించిన వెంటనే దురద పోతుంది
Don't Miss
- News
Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
- Sports
IPl Qualifier 1 : మనది కాని టైంలో కొన్నిసార్లు మింగేయాలి.. తప్పదు అన్న జోస్ బట్లర్
- Movies
Janaki Kalaganaledu May 25th: జ్ఞానాంబకు తెలియకుండా పెళ్లి ప్లాన్.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మల్లిక!
- Finance
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
- Automobiles
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- Technology
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Benefits of love marriage:ప్రేమ పెళ్లిలో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా...
ఈ ప్రపంచంలో 'ప్రేమ'అనేది ఎప్పుడు.. ఎక్కడ.. ఎందుకు.. ఎవరి మదిలో ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అది మనలో పుట్టిన నాటి నుండి ప్రతి ఒక్కరూ మాంచి అనుభూతిని పొందుతారు.
అయితే ప్రేమలో పడే వారికి కులం, మతం, ధనం, ప్రాంతం, ఆస్తి, అంతస్తులతో పెద్దగా పనిగా ఉండదు. అలాంటి అడ్డంకులన్నీ అధిగమించి ప్రేమ పెళ్లితో ఎందరో ప్రేమ జంటలు ఏకమవుతూ ఉంటారు. ఈరోజుల్లో చాలా మంది పేరేంట్స్ ప్రేమ వివాహాలను అంగీకరిస్తూ ఉన్నారు. కులమతాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసేందుకు ఆనందంగా ఒప్పుకుంటున్నారు.
అయితే తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని.. వారితో జీవితాంతం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పెళ్లి అనే సంఘటనతో చాలా మంది జీవితాల్లో ఒక మలుపు అనేది వస్తుంది. అయితే ఎలాంటి మార్పులు ఉంటాయనేది మన జీవిత భాగస్వామిని బట్టి ఉంటుంది. మన దేశంలో వివాహం అనే ముఖ్యమైన ఘట్టానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే కులాంతర లేదా మతాంతర పెళ్లి చేసుకోవడం వల్ల లవ్ చేసిన పార్ట్నర్ తో కలిసి హ్యాపీగా లైఫ్ సాగిపోవడమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
మీ
మాజీ
లవర్
ను
మరచిపోవాలనుకుంటున్నారా?
అయితే
ఇలా
చేయండి...

విభిన్నమైన ఆచారాలు..
ప్రేమ పెళ్లిలో చాలా మందిలో మగవారు, ఆడవారి కులాలు, మతాలు కచ్చితంగా వేర్వేరుగా ఉంటాయి. ఈ కారణంగా వారి కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. దీంతో ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం పెళ్లి అనేది రెండు సార్లు జరుగుతుంది. ఇలాంటి అవకాశం కేవలం ప్రేమ పెళ్లి చేసుకునే వారికి మాత్రమే దక్కుతుంది. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అయితే, కుటుంబ సభ్యులకు, బంధువులకు దాదాపుగా ఒకే రకమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు ఉంటాయి. అయితే ప్రేమ వివాహంలో పూర్తి విభిన్నంగా ఉంటుంది.

కొత్త విషయాలు నేర్చుకుంటారు..
మీరు ప్రేమించిన వ్యక్తి కులం, మతంతో పాటు రాష్ట్రం కూడా వేరైతే.. అప్పుడు వారి భాషను కూడా నేర్చుకోవచ్చు. అంతేకాదు రెండు ప్రాంతాల వారికి అలాంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇద్దరి భాషలు, పద్ధతులు వేర్వేరు కావడం వల్ల వారి పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు అర్థం చేసుకుని.. వాటిని ప్రాక్టికల్ గా ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో వారి ఆచారాలను, పద్ధతులను గౌరవించడం నేర్చుకొంటారు.

కొత్త రకాల వంటకాలు..
మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆహారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులోనూ ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రత్యేకమైన వంటకాలు, రుచులు ఉంటాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి కొత్త రకాల వంటకాలు రుచి చూసే అవకాశం దక్కుతుంది. ప్రతిరోజూ కొత్త రకం రుచులు పరిచయం అవుతూ ఉంటాయి. అలాగే మీకు తెలిసిన వంటకాలను కూడా వారికి రుచి చూపించొచ్చు.
లవర్
ఆ
కార్యం
కోసం
బ్లాక్
మెయిల్
చేస్తే..
ఎలా
ఎస్కేప్
అయ్యిందో
తెలుసా...

కొత్త పండుగలు..
ప్రేమ పెళ్లి వల్ల కొత్త వంటకాలతో పాటు.. కొత్త పండుగల గురించి కూడా తెలుసుకోవచ్చు. అలా పుట్టింట్లో జరిగే పండుగలతో పాటు మెట్టినింటి పండుగలను కూడా ప్రతి సంవత్సరమూ ఆనందంగా జరుపుకోవచ్చు. అలాగే సెలవులు వచ్చినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్లేందుకు రెండు ఆప్షన్లు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాయి. అందులో ఒకటి పుట్టినిల్లు.. మరొకటి అత్తారిల్లు.. దీంట్లో కూడా మీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైతే ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లే అద్భుతమైన అవకాశం దక్కుతుంది.

ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చు..
ప్రేమ పెళ్లి చేసుకున్న వారు.. అత్తారింట్లో పని చేసే విషయంలో ఏదైనా మిస్టేక్ జరిగితే..మీరు సులభంగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే అక్కడి పరిస్థితులపై సరైన అవగాహన లేదని చెప్పొచ్చు. ఇలా చేయాలని మీకు తెలిదని సింపుల్ గా చెప్పొచ్చు. ఇలాంటివి చాలా సార్లు వర్కవుట్ అవుతుంది.

సర్దుబాటు సులభం..
సంబంధంలో సామరస్యం లేనప్పుడు ఏదైనా వివాహం విఫలమయ్యే అవకాశం ఉంది. అత్యంత స్థిరమైన, ప్రేమగల లేదా వ్యవస్థీకృతమైన వాటిని కూడా నాశనం చేసే అంశం. శృంగార వివాహం యొక్క ప్రారంభ రోజుల నుండి పొందిన ముందస్తు జ్ఞానం వారు ఒకరి వ్యక్తిత్వం, పాత్ర, ఇష్టాలు మరియు అయిష్టాలను అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది. ఇది వారి వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది.