For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందే మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి...!

పెళ్లికి ముందు కచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో చూసెయ్యండి.

|

వివాహం అనే ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. ఎందుకంటే మన ఆలోచనలకు అనుగుణంగా భాగస్వామి దొరకడం అంత సులభం కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఎంతగా సర్దుకుపోయినా అన్ని రకాలుగా అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకొచ్చు.. దొర్కపోవచ్చు..

What Are the Things to Do Before Getting Married in Telugu

ఈ నేపథ్యంలో సింగిల్ ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా ఎంజాయ్ చేసేయండి.. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత మగవారైనా.. ఆడవారైనా వారి జీవితం మొత్తం చాలా మారిపోతుంది. ఇలాంటి విషయాలు పెళ్లయిన వారికి చాలా బాగా తెలుస్తాయి. ఎందుకంటే వివాహం జరిగిన భాగస్వామితో సంతోషంతో పాటు కొన్ని సంసార సమస్యలు ఎదురవుతాయి.

What Are the Things to Do Before Getting Married in Telugu

దీంతో చాలా సందర్భాల్లో చిరాకు పుడుతుంది. ఇవి అనుభవించే వారికే తెలుస్తాయి. అయితే సంతోషమైనా.. సమస్య అయినా అది మీ పార్ట్నర్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వివాహానికి ముందే మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే తీర్చేసుకోండి.. వీటి వల్ల పెళ్లి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటమే కాదు.. మీరు మరింత హుషారుగా ఉండేలా చేస్తాయి. ఇంతకీ పెళ్లికి ముందు చేయాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

కొత్త ఏడాదిలో ఈ రొమాంటిక్ రిజల్యూషన్స్ మీ లైఫ్ ను మార్చేయొచ్చు...కొత్త ఏడాదిలో ఈ రొమాంటిక్ రిజల్యూషన్స్ మీ లైఫ్ ను మార్చేయొచ్చు...

పర్యాటక ప్రదేశాలు..

పర్యాటక ప్రదేశాలు..

మీరు పెళ్లికి ముందు మీ స్నేహితులతో కలిసి ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే అవకాశం వస్తే అస్సలు మిస్సవ్వొద్దు. ఈ చలికాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో అరకు, వనజంగి హిల్స్ వంటి ప్రాంతాలు ఎంతో సుందరంగా ఉంటాయి. మన దేశంలో ఇలాంటి సుందర ద్రుశ్యాలతో పాటు ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముందే మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. అక్కడ వీలైతే కొత్త మిత్రులను పరిచయం చేసుకోండి.. కొత్త వాతావరణం.. కొత్త ప్రదేశంలో మీ స్నేహితులతో హ్యాపీగా గడపండి.

చురుగ్గా మారొచ్చు..

చురుగ్గా మారొచ్చు..

అలా వెళ్లినప్పుడు బయటి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలు మీకు బాగా అర్థం అవుతాయి. దీని వల్ల మీరు మరింత బలంగా మారొచ్చు. మీరు చురుగ్గా మారిపోతారు. అదే పెళ్లి తర్వాత ఇలాంటి అవకాశం దాదాపు ఉండకపోవచ్చు. అప్పుడు పరిస్థితులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీకు కాబోయే వారితో..

మీకు కాబోయే వారితో..

ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. మీకు ఎంగేజ్ మెంట్ అయి ఉంటే.. పెళ్లికి ముందే వారితో సరదాగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అదే సందర్భంలో వారితో ఏదైనా విషయంలో తేడాలొస్తే గొడవ పెట్టుకోవడం వంటివి చేయండి. ఇలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ సందర్భంలో వారు ఎలా ప్రవర్తిస్తారు.. అనే విషయంలో మీకు కొంత స్పష్టత వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు ఎలా వేయాలో తెలుసుకోవచ్చు.

ఈ భంగిమలతో భావప్రాప్తి త్వరగా పొందుతారట...! మీరూ ట్రై చేసి చూడండి...ఈ భంగిమలతో భావప్రాప్తి త్వరగా పొందుతారట...! మీరూ ట్రై చేసి చూడండి...

తొందరపాడొద్దు..

తొందరపాడొద్దు..

ప్రస్తుత రోజుల్లో పెళ్లికి ముందు రిలేషన్ అనే విషయంలో చాలా మంది ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే పెళ్లికి ముందే అలాంటి సంబంధం కావాలనుకోవడం అప్ డేట్ స్టేజ్. ఒక వ్యక్తిని చూసిన వెంటనే.. మనకు సూటవుతారా? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి ఆలోచనా విధానం ఏంటనే విషయాలను అంచనా వేసుకోవాలి. ఎందుకంటే వారితో జీవితాంతం కలిసి జీవించడం కాదు.. వారితో గడపడం జీవితాంతం కలిసి ఉండేది మీరే కాబట్టి.. కాబట్టి ఇలాంటి విషయాల్లో తొందరపడకండి.

ఫైనాన్స్ ఫ్రీడమ్..

ఫైనాన్స్ ఫ్రీడమ్..

పెళ్లికి ముందు ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎక్కువ స్థిరంగా ఉండాలి. మీరు ఆర్థిక పరమైన విషయాల్లో ఎలా పడితే అలా ఖర్చులు చేయకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురవుతుందనే విషయం ఎవ్వరికీ తెలీదు. కాబట్టి మీరు బ్యాంకు ఖాతాలో కొంత సొమ్మును ఆదా చేయడం ఉత్తమం.

జాలీగా జర్నీ..

జాలీగా జర్నీ..

పెళ్లికి ముందు ఎక్కువగా చదువుకోవడం.. బిజీగా పని చేయడం వంటివి చేస్తుంటే.. కాస్త గ్యాప్ ఇవ్వండి. జాలీగా జర్నీ చేయండి. మీకు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వేగంగా వెళ్లండి. మీకు నచ్చిన ప్లేసులన్నీ చుట్టేసి రండి. ఎందుకంటే పెళ్లి తర్వాత ఇలాంటి అవకాశాలు దాదాపు అసాధ్యమే. అందుకు అనేక ఆర్థిక పరమైన సమస్యలు.. భాగస్వామికి జర్నీ ఇబ్బంది వంటి కారణాలెన్నో ఉంటాయి.

చలికాలంలో ఈ భంగిమలు ట్రై చేస్తే.. రెట్టింపు మజాను పొందుతారట...!చలికాలంలో ఈ భంగిమలు ట్రై చేస్తే.. రెట్టింపు మజాను పొందుతారట...!

కొత్త అలవాట్లు..

కొత్త అలవాట్లు..

పెళ్లికి ముందు చాలా మందికి అనేక అలవాట్లు ఉంటాయి. అయితే మీరు పెళ్లి ఫిక్స్ అయితే మీరు కొన్ని కొత్త అలవాట్లను నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా చదవడం, రాయడం, అల్లడం, గార్డెనింగ్, యోగా, సోషల్ వర్క్ ఇలా రకరకాల పనులను చేయడం వల్ల మీ మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఎలాంటి అలవాట్లు లేకపోతే ఖాళీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

భరోసా ఉండేలా..

భరోసా ఉండేలా..

మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. మీ స్నేహితులు, సహోద్యగులు, ఇతర వ్యక్తులతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. వివాహం జరిగాక ఇంటికొచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏదైనా సమస్య వస్తే.. వారు మీకు అండగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఫిట్ గా ఉండేందుకు..

ఫిట్ గా ఉండేందుకు..

మీ ఆరోగ్యంపైనా వీలైనంత ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మీ బాడీ ఫిట్ గా ఉండేందుకు రెగ్యులర్ గా వర్కౌట్లు చేయండి. అలాగే కాజు, బాదం, పిస్తా వంటి వాటిని మీ డైట్లో చేర్చుకోండి. వీటితో పాటు మీరు వేసుకునే డ్రస్సులపైనా కాస్త శ్రద్ధ వహించండి.

English summary

What Are the Things to Do Before Getting Married in Telugu

Here are the things to do before getting married in Telugu. Have a look
Story first published:Monday, January 17, 2022, 15:49 [IST]
Desktop Bottom Promotion