For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.. కానీ తన స్నేహితులతో తప్పుగా ప్రవర్తిస్తోంది...’

|

మన లైఫ్ ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ లైఫ్ జర్నీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఒక్కోసారి మనం కోరుకున్నవన్నీ నెరవేరినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు.. వారినే దక్కకుండా చేస్తుంది.

ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కదు. కానీ ఆఖరికి మన గమ్యం చేరేలా చేస్తుంది. కానీ నా జీవితంలో మాత్రం అలా జరుగుతుందో లేదోనని ఓ ప్రియుడు తన ప్రేమ జీవితంలో జరుగుతున్న సంఘటనల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు నిత్యం స్నేహితులతో అలా చేస్తోందట. ఇది తనకు నచ్చడం లేదని.. అయినా తను అలానే చేస్తోందని వాపోతున్నాడు. ఈ నేపథ్యంలో తానేం చేయాలని నిపుణులను సలహ అడిగాడు. ఈ ప్రియుడి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రతి క్రీడలో స్త్రీలు అలా చేస్తే.. అబ్బాయిలు మరింత రెచ్చిపోతారట...!రతి క్రీడలో స్త్రీలు అలా చేస్తే.. అబ్బాయిలు మరింత రెచ్చిపోతారట...!

బలమైన ప్రేమ..

బలమైన ప్రేమ..

హాయ్ ‘నా పేరు రాజా బాబు(పేరు మార్చాం). నా వయసు పాతిక సంవత్సరాలు. నేను స్కూల్ డేస్ లో నుండే ఓ అమ్మాయిని చాలా సిన్సీయర్ గా లవ్ చేస్తున్నాను. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. అక్కడే మా ప్రేమ మరింత బలపడింది.

ఒకే కంపెనీలో..

ఒకే కంపెనీలో..

మా కాలేజీ ప్రేమ కొనసాగుతుండగానే.. మా ఇద్దరికీ క్యాంపస్ ప్లేస్ మెంట్ వచ్చింది. మా ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాం. అక్కడ కూడా నేను తనతో ఎక్కువ సమయం గడిపేవాడిని.

అలా దగ్గరయ్యాం..

అలా దగ్గరయ్యాం..

ఇలా చిన్నప్పటి నుండి మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. మా ఫ్రెండ్స్ మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందని.. మేమిద్దరం భార్యభర్తలవుతామని కచ్చితంగా చెప్పేవారు. ఈ క్రమంలోనే తను నాకు మానసికంగా, శారీరకంగా బాగా దగ్గరైంది. తనతో ప్రతి వీకెండ్ కలిసి బాగా ఎంజాయ్ చేసే వాడిని.

నమ్మడం లేదు..

నమ్మడం లేదు..

అయితే తను మాత్రం నన్ను పూర్తిగా నమ్మడం లేదు. వారాంతంలో తను ఎక్కువగా తన క్లోజ్ ఫ్రెండ్స్ ను కలుస్తూ ఉంటుంది. వారంతా లేడీసే. వారందరూ కలిస్తే అచ్చమైన తెలుగు బూతులే మాట్లాడుకుంటారు. అందరి పర్సనల్ విషయాలను చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటారు. పైగా పడకగదిలో జరిగే ఘట్టం గురించి మాట్లాడతారు.

‘ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!‘ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!

తనే చెప్పింది..

తనే చెప్పింది..

వారేమి మాట్లాడతారనే విషయాలను నా ప్రియురాలు నాకు వచ్చి స్వయంగా చెబుతుంది. అయితే తను మాత్రం తన పర్సనల్ విషయాలను ఎవ్వరికీ చెప్పనని నాతో చెబుతోంది. కానీ నాకు తన మీద నమ్మకం కుదరడం లేదు. ఇలాంటి అలవాట్లు ఉన్నా ప్రియురాలితో ఇంకా కలిసి ఉండొచ్చా.. లేక తనకు బ్రేకప్ చెప్పాలా? కానీ తనను మాత్రం నేను చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు' అని ఓ కుర్రాడు తన సమస్యను నిపుణులకు చెప్పుకున్నాడు. అందుకు వారు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమెకు అర్థమయ్యేలా..

ఆమెకు అర్థమయ్యేలా..

తనను మీరు నిజాయితీగా ప్రేమిస్తున్నారు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా చెప్పకండని తనకు అర్థమయ్యేలా వివరించండి. దీని వల్ల మీరు ఇబ్బందికి గురవుతున్నట్లు చెప్పండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య శారీరక, మానసిక బంధం ఉందని చెబుతున్నారు.

చులకనవుతారని..

చులకనవుతారని..

మీ పర్సనల్ విషయాలు అందరికి చెప్పుకుంటే.. ముఖ్యంగా స్నేహితులకు చెబితే.. అందరిలో చులకన కావడమే కాదు.. రిలేషన్ షిప్ లో సమస్యలు వస్తాయని తనకు వివరించండి. ఇలాంటివి మీరు చెప్పినా తను పట్టించుకోకపోతే.. మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఇద్దరికి ఉండే కామన్ ఫ్రెండ్ ద్వారా చెప్పించండి.

సీరియస్ తీసుకోమనండి..

సీరియస్ తీసుకోమనండి..

మీరు అలా చెప్పించిన తర్వాత ఆ విషయాన్ని తను ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది గమనించండి. అయినా ఏ మార్పు రాకపోతే మంచి మానసిక నిపుణులను సంప్రదించండి. అంతేకానీ తొందరపాటులో మీ ప్రేమను దూరం చేసుకోకండి. ఆమెకు తగిన సమయం ఇవ్వండి. మీరు కూడా కొంత సమయం తీసుకోండి. ఎవరి కోసమో మీరు ప్రాణంగా ప్రేమించే భాగస్వామిని వదులుకోకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ రిలేషన్ షిప్ విషయంలో ఫైనల్ డెసిషన్ మీదే.

English summary

What Can You Do When You Love Your Girlfriend but You Don't Trust Her Fully

Here we are talking about the what can you do when you love your girlfriend but you don't trust her fully. Read on