For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగాళ్లలో ఆ వయసు తర్వాత సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుందో తెలుసా...

మగవారిలో ఆ సామర్థ్యం తగ్గడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మంది మగాళ్లు ఆ కార్యంపై ఎక్కువగా ఆసక్తి చూపలేకపోతున్నారు. యువకులుగా ఉన్న లైంగిక కార్యంలో రెచ్చిపోయే పురుషులు ఆ వయసు దాటాక అసలు ఆ కార్యం అంటేనే భయపడిపోతున్నారు.

What Causes Low Energy in Men?

మూడు పదుల వయసు దాటాక వారిలో ఆ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా 40+ దాటాక మగవారిలో సెక్స్ పై ఆసక్తి కలగడం లేదట. రాత్రి వేళ రతి క్రీడ అంటే తెగ భయపడిపోతున్నారు. ఎందుకంటే మగవాళ్లలోనూ మహిళల మాదిరిగా మూడ్ మారుతూ ఉంటుందట.

What Causes Low Energy in Men?

ముఖ్యంగా పురుషుల్లో మెనోపాజ్ కారణంగా ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోయి.. రతి క్రీడ సామర్థ్యం తగ్గుతోందని పలు అధ్యయనాలలో తేలింది. అంతేకాదు ఆడవారిలోలాగా పీరియడ్స్ టైంలో హార్మోన్లలో కలిగే మార్పు వల్ల ఇలా జరుగుతుందట. పురుషులు పడకగదిలో తమ సామర్థ్యం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలేంటో అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'నా భర్త పెళ్లైనా పక్కచూపులు చూస్తున్నాడు.. ఇతర స్త్రీలతో సరసాలాడుతూ...''నా భర్త పెళ్లైనా పక్కచూపులు చూస్తున్నాడు.. ఇతర స్త్రీలతో సరసాలాడుతూ...'

మెనోపాజ్ అంటే ఏమిటి?

మెనోపాజ్ అంటే ఏమిటి?

ఆడవారి శరీరంలో హార్మోన్ల మార్పు వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయో.. పురుషుల శరీరంలోనూ అలాంటి మార్పులు జరుగుతాయట. అమ్మాయిల్లో టీనేజీలో ప్రారంభమైన రుతుచక్రం ఓ నిర్దిష్ట వయసుకు వచ్చేసరికి ఆగిపోతుంది. దీన్నే మెనోపాజ్ అంటారు. దీని వల్ల అమ్మాయిల్లో అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు లావు కావడం, బాడీలో వేడి, విపరీతమైన మూడ్ స్వింగ్స్ వంటివి వస్తుంటాయి. కొందరిలో అయితే సూసైడల్ టెండన్సీ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మగవారిలోనూ..

మగవారిలోనూ..

ఇలాంటి పరిస్థితి కేవలం మహిళల్లోనే కాదు.. మగవారిలోనూ ఉంటుందట. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి హార్మోన్లలో చాలా మార్పులు కనిపిస్తాయని ఇటీవలే ఓ అధ్యయనంలో తేలింది. కానీ అమ్మాయిల కంటే ఇది అబ్బాయిల్లో చాలా విభిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అది తగ్గుతుంది..

అది తగ్గుతుంది..

పురుషుల్లో కనిపించే ఈ హార్మోన్ల మార్పును ఆండ్రో పాజ్ అని అంటారు. దీని వల్ల అబ్బాయిల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల మగవారి మగతనానికి అత్యంత ముఖ్యమైన హార్మోన్ మార్పుకు కారణమవుతుంది. మగవారిలో టీనేజీ మార్పులకు కలిగే ఈ హార్మోన్ల మార్పే ప్రధాన కారణం. మగవారు పడకగదిలో రెచ్చిపోవడానికి, వారి సామర్థ్యానికి మూలం కూడా ఈ హార్మోనే.

<strong>ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!</strong></p><p>ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!

ఎలా తెలుసుకోవచ్చంటే..

ఎలా తెలుసుకోవచ్చంటే..

అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గి ఆండ్రోపాజ్ దశకు చేరుకున్నారని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చట. మగవారిలో ఉన్నట్టుండి ఊబకాయం వస్తుంటే, అది ఆండ్రోపాజ్ లక్షణంగా పరిగణించొచ్చు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

ఇంకా ఏ లక్షణాలుంటే..

ఇంకా ఏ లక్షణాలుంటే..

అకస్మాత్తుగా లావు అవ్వడమే కాకుండా.. రెగ్యులర్ గా అలసిపోవడం, రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టకపోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ తగ్గడంతో మగవారి బాడీలో కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. దీని వల్ల నిద్ర లేమి, ఆందోళన వంటివి పెరుగుతాయట.

మగతనం తగ్గుదల..

మగతనం తగ్గుదల..

టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల మగవారి బాడీలో పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడంతో, వీర్య కణాల సంఖ్యను, వీర్యం ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. దీంతో మగవారిలో మగతనం తగ్గిపోతుంది.

బట్టతల వస్తుందట..!

బట్టతల వస్తుందట..!

అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతల వస్తుందట. ఛాతీ భాగంలో కూడా మార్పులు వస్తాయి. వీటి కారణంగానే మగవారి రొమ్ములు చదునుగా ఉండిపోతుంటాయి. టెస్టోస్టెరాన్ తగ్గడం వల్లే పురుషుల బాడీలోనూ వక్షోజాల వంటివి ఏర్పడొచ్చు.

వైద్యులను సంప్రదించండి..

వైద్యులను సంప్రదించండి..

40+ దాటిన పురుషులలో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

What Causes Low Energy in Men?

Here we are talking about the what causes low energy in men. Have a look
Story first published:Monday, June 14, 2021, 19:40 [IST]
Desktop Bottom Promotion