For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా ప్రేయసి అందరితో అలా చేస్తోంటే అనుమానం కలుగుతోంది...’

|

ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో తను టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. వారానికి ఐదు రోజులే పని. ఉండటానికి మంచి ఇల్లు.. తిరగడానికి రేంజ్ రోవర్ కారు కూడా ఉన్నాయి. జీవితంలో సుఖ పడటానికి కావాల్సిన సొమ్ములు, సోకులు అన్నీ ఉన్నాయి.

ఇదే ఊపులో తనను ఓ అమ్మాయిని కలిశాడు. తన అందానికి ఫిదా అయిపోయాడు. మొదట్లో చూపులు కలిశాయి. ఆ తర్వాత పరిచయం అయ్యింది. అతి తక్కువ కాలంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి మనసులు కలిశాయి. అంతే ఓ మంచి సందర్భం చూసుకుని, తన ప్రేమ గురించి చెప్పేశాడు. తను కూడా ఓకే చెప్పేసింది.

తనను ఆ కుర్రాడు చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాడు. కానీ తన ప్రియురాలు మాత్రం తనతో ఎంత క్లోజ్ గా ఉంటుందో.. మిగిలిన పురుషులతో కూడా అలాగే సరదాగా, సన్నిహితంగా ఉంటోంది. తన ఫేస్ బుక్ అకౌంట్ ఐడి, ఇన్ స్టాలో, వాట్సాప్ నెంబర్లు, ట్విట్టర్ తో సహా తన పర్సనల్ విషయాలన్నీ చాలా మందితో షేర్ చేసుకుంటోంది. దీంతో తనకు ఆమెపై అనుమానం మొదలైంది. ఈ సందర్భంగా తన సమస్యకు ఒక మంచి సలహా చెప్పమని నిపుణులను కోరాడు. ఇంతకీ తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వర్కింగ్ కపుల్స్ వారాంతంలో ఇలా చేస్తే బోర్ అనే ఫీలింగే రాదు...!వర్కింగ్ కపుల్స్ వారాంతంలో ఇలా చేస్తే బోర్ అనే ఫీలింగే రాదు...!

అందమైన అమ్మాయి..

అందమైన అమ్మాయి..

హాయ్ ‘నా పేరు రాకేష్(పేరు మార్చాం). నేను కాలేజీ స్టడీస్ పూర్తి చేసేలోపే ఓ పెద్ద కంపెనీలో నాకు క్యాంపస్ ప్లేస్ మెంట్ లభించింది. నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఓ రోజు మా కాలేజీలో అందమైన అమ్మాయిని చూశాను. తన గురించి ఆరా తీస్తే తను నా జూనియర్ అని తెలిసింది.

చూపులు కలిశాయి..

చూపులు కలిశాయి..

ఓ రోజు మా ఇద్దరి చూపులు కలిశాయి. ఆ తర్వాత మా ఇద్దరి మనసులు కలిశాయి.. పరిచయం అయిన కొద్ది కాలంలోనే మేమిద్దరం సినిమాలకు, పార్కులకు, షాపింగుకు కలిసి వెళ్లేవాళ్లం. మేమిద్దరం ఎక్కువ సమయం కలిసి గడిపేవాళ్లం. ఇక దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్లలో చాలా బిజీగా ఉండేవాళ్లం.

సీనియర్లపై క్రష్..

సీనియర్లపై క్రష్..

అయితే తనకు నా మీద ప్రేమతో పాటు సీనియర్లపై అంటే నా క్లాస్ మేట్స్ పై కూడా క్రష్ ఉండేది. దీంతో నాతో ప్రేమగా ఉంటూనే సరదాగా మాట్లాడటం, సరసాలాడం వంటివి చేసేది. ఎవరైనా తనను ఫ్లర్ట్ చేస్తున్నారని తెలిస్తే చాలు వెంటనే నెంబర్ ఇచ్చేది.

<strong>ఆమెకు 12.. ఆయనకు 34.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది...</strong></p><p>ఆమెకు 12.. ఆయనకు 34.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది...

ఆఫీసులోనూ అదే..

ఆఫీసులోనూ అదే..

ఆ తర్వాత మా కాలేజీ స్టడీస్ పూర్తయిన తర్వాత మా ఇద్దరికీ.. నా క్లాస్ మేట్స్ కు ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. మరో విచిత్రమేమిటంటే.. వారంతా ఒకే టీమ్ లో ఉన్నారు. ఆ టీమ్ కు నా దురద్రుష్టం కొద్దీ నేనే లీడర్ ని. ఇంకేముంది కాలేజీలో ఎలా అల్లరి చేసేవాళ్లమో.. ఇక్కడ కూడా అంతే.

నమ్మలేకపోతున్నాను..

నమ్మలేకపోతున్నాను..

ఆఫీసులో కూడా తనకు ఎవరైనా లైన్ వేస్తున్నారని తెలిస్తే.. చాలు వాళ్లను దూరం పెట్టడం మానేసి.. వారితో మరింత క్లోజ్ గా ఉండేది. అంతేకాదు తన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకునేది. దీంతో తనను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఇప్పటికే మంచి రిలేషన్ షిప్ ఉంది.

అనుమానం వస్తోంది..

అనుమానం వస్తోంది..

తనపై అనుమానం వచ్చి.. తనకు ఈ విషయం గురించి అడగగా.. అంతకుముందు నేను కాలేజీలో మరో జూనియర్ తో సన్నిహితంగా విషయాన్ని గుర్తు చేస్తోంది. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మాత్రం తనను చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను. తనను విడిచిపెట్టడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. మా మాధ్య ఇలాంటి గొడవలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. వీటికి పుల్ స్టాప్ పెట్టాలంటే ఏమి చేయాలో మంచి సలహా చెప్పగలరు' అని ఓ యువకుడు తన సమస్యను ఇలా చెప్పుకున్నాడు.

<strong>మీ భాగస్వామి ‘అలక' తీర్చడం చాలా తేలిక.. అదెలాగో చూసెయ్యండి...</strong></p><p>మీ భాగస్వామి ‘అలక' తీర్చడం చాలా తేలిక.. అదెలాగో చూసెయ్యండి...

కన్ఫ్యూజ్ అవ్వకండి..

కన్ఫ్యూజ్ అవ్వకండి..

మీరు తనతో రిలేషన్ షిప్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ మీ వద్దే ఉంది. మీరు తనను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి. మీరు తనతో ప్రేమతో మాట్లాడుతూ చాలా విషయాల్లీ క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా ఉంటారు. కొందరు అందరితో కలిసిపోతూ ఉంటారు. అలాంటి వారి మనసుల్లో ఏమీ ఉండదు. కానీ బయట వ్యక్తులు వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేసేస్తుంటారు.

ఏ తప్పు చేయలేదనే..

ఏ తప్పు చేయలేదనే..

ఆమె అందరితో కలిసి సరదాగా ఉంటున్నప్పటికీ.. మీరు తనను ఇంకా నిజాయితీగా ప్రేమిస్తున్నారంటే.. దానికి కారణం తను ఇంకా ఏ తప్పు చేయలేదనే నమ్మకమే. కాబట్టి ఆమె గురించి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మీ ప్రేమను కొనసాగించండి.

English summary

What Does It Mean If My Girlfriend Flirts With Other Guys?

Here We are talking about the what does it mean if my girlfriend flirts with other guys. Have a look
Story first published: Saturday, July 10, 2021, 15:51 [IST]