For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవర్ ఆ కార్యం కోసం బ్లాక్ మెయిల్ చేస్తే.. ఎలా ఎస్కేప్ అయ్యిందో తెలుసా...

|

ప్రేమ, ఇష్క్, ప్యార్, ప్రీతి... ఈ రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంది. ఒక్కసారి దీని మాయలో పడ్డామంటే అంతే సంగతులు. ఇది ఎవరి మనసులో ఎప్పుడు పుడుతుందో అస్సలు తెలియదు.

అలా మొదలైన ప్రేమ ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే చరిత్రను పరిశీలిస్తే ప్రేమ కోసం ఏకంగా యుద్ధాలే జరిగాయి.. ప్రేమ కోసం రాజ్యాలను పణంగా పెట్టిన ఆధారాలు మనకు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. అయితే ప్రేమ అనేది ఏ స్వార్థం లేనిది. నిజాయితీ గల ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తారు.

ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కావాలంటే కష్టమే. ఇప్పుడంతా ప్రేమ పేరిట అమ్మాయిలు/అబ్బాయిలు ఇద్దరూ మోసపోతున్నారు. పైగా ప్రేమించకపోతే బెదిరింపులు.. దాడులు వంటివి చాలా సహజంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే తనను ప్రేమ పేరుతో వేధించిన ఓ అబ్బాయికి సరైన బుద్ధి చెప్పింది.. ముఖ్యంగా రొమాన్స్ కోసం అలా బ్లాక్ మెయిల్ చేసినా.. ఏ మాత్రం బెదురు లేకుండా ధైర్యంగా పోరాడింది.. అందరికీ ఆదర్శంగా నిలిచింది.. ఆ వీరనారి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

ఇలాంటి సంకేతాలుంటే..మీ మ్యారేజ్ లైఫ్ సమస్యల్లేకుండా సాఫీగా సాగిపోతుదంట

చిన్నతనంలో..

చిన్నతనంలో..

తన పేరు రాణి(పేరు మార్చాం). తను ఓ చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగింది. ఆ ఊరిలో వాళ్ల నాన్నే ప్రెసిడెంట్. తను ఎలాంటి వ్యక్తో అందరికీ బాగా తెలుసు. తన సోదరులకు ఊళ్లో మంచి పేరే ఉంది. దీంతో అందరికీ ఆ అమ్మాయి గురించి బాగా తెలుసు. తను కూడా నాన్న మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి కేవలం గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజీలోనే చదువుకుంది.

ఓ కలలా..

ఓ కలలా..

అయితే ఇంటర్మీడియట్ తర్వాత తను తొలిసారిగా ఊరు వదిలి రావాల్సి వచ్చింది. అయితే ఆ క్షణాలను తను ఎంతో హ్యాపీగా ఫీలయ్యింది. మొట్టమొదటి సారి అబ్బాయిలు ఉండే కాలేజీకి వెళ్లడం.. వారితో స్నేహం చేయడం.. తనకు పూర్తి స్వేచ్ఛ పెరగడం ఎంతో బాగా నచ్చాయి. అదంతా తనకు ఓ కలలా అనిపించేది..

ధైర్యం చేయలేదు..

ధైర్యం చేయలేదు..

తను చిన్న పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల చాలా సంప్రదాయంగా ఉండేది. అయితే సిటీకి వచ్చాక కుర్తీల వరకు మారింది. అంతేగానీ మోడ్రస్ డ్రస్సుల వరకు వెళ్లలేదు. తన ఫ్రెండ్స్ ఎంత బలవంతం చేసినా అలాంటి ధైర్యం చేయలేదు. అయితే అప్పుడప్పుడు రూమ్ దగ్గర మాత్రం కాస్త ధైర్యం చేసి టీషర్ట్స్, జీన్స్ ధరించేది.

అప్పుడే ఓ అబ్బాయి..

అప్పుడే ఓ అబ్బాయి..

అప్పుడప్పుడే నాలో మెల్లగా మార్పు మొదలైంది. తన క్లాస్ మేట్లలో ఓ అందమైన అబ్బాయి తనతో మెల్లగా మాటలను కలిపాడు. అయితే తాను మగాళ్లతో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు గమనించాడు. అందుకే ఆ వాతావరణంలో కలిసిపోయేందుకు తను బాగా సాయం చేశాడు. అది తనకు బాగా నచ్చింది. అంతే ఓ రోజు సరదాగా కాఫీ తాగుదామని పిలిచాడు.

2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

మొదట్లో స్నేహం..

మొదట్లో స్నేహం..

తెలిసిన వ్యక్తే.. పైగా క్లాస్ మేట్ కావడంతో కాఫీ తాగేందుకు తను కూడా ఒప్పుకుంది. అలా వారిద్దరి మధ్య స్నేహం ప్రారంభమైంది. అయితే వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో వారికే తెలియదు. ఎందుకంటే కాఫీ కప్పుతో కలిసిన వారిద్దరూ అప్పటినుండి కాలేజీ పూర్తయ్యేవరకు వారు బాగా క్లోజ్ గా ఉండేవారట.

సరాదాగా వెళ్లి...

సరాదాగా వెళ్లి...

తనకు అతనే తొలి బాయ్ ఫ్రెండ్. అంతేకాదు తను వాళ్ల రూమ్ కి దగ్గర్లోనే ఉండేవాడు. అందుకే అప్పుడప్పుడు వారిద్దరూ బయటికి సరాదాగా వెళ్లి వస్తూ ఉండేవాళ్లు. ఇద్దరూ కలిసి వ్యక్తిగతంగా, ఏకాంతంగా గడిపేవాళ్లు. కొన్నిసార్లు వాళ్ల ఇంట్లోకి కూడా వెళ్లారు. అయితే ముద్దుల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. ఎందుకంటే తను పెళ్లి తర్వాత రొమాన్స్ లో పాల్గొనాలని భావించేది.

రొమాన్స్ చేసేందుకు..

రొమాన్స్ చేసేందుకు..

అయితే ఓ రోజు తన బాయ్ ఫ్రెండ్ తనను కలిసినప్పుడు తనతో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో పీరియడ్స్ రీజన్ చెప్పి అక్కడి నుండి తప్పించుకుని వచ్చేసింది. తను కూడా అప్పుడు అర్థం చేసుకున్నట్టు నటించాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాటింగ్, కాలింగ్ కంటిన్యూ అవుతూనే ఉండేది.

రొమాన్స్ టైమ్ లో సైజు అనేది పెద్ద విషయమే కాదట...! ఎందుకో తెలుసా...

అర్జంటుగా రమ్మన్నాడు..

అర్జంటుగా రమ్మన్నాడు..

అలా ఓ రోజు తన బాయ్ ఫ్రెండ్ ఏదో ఒక విషయం గురించి తనతో అర్జెంట్ గా మాట్లాడాలి రమ్మన్నాడు. తను ప్రేమించే వ్యక్తే కాబట్టి తన రూమ్ కి వెళ్లింది. అయితే అక్కడ అతను చాలా డల్ గా కనిపించాడు. ఏమైందని అడిగితే.. వెంటనే తన స్మార్ట్ ఫోన్ తీసి అందులో తను, అతను ఉన్న ఫొటోలు, రొమాంటిక్ చాటింగులన్నీ చూపించాడు. వాటిని చూపి తనతో రతి క్రీడకు ఒప్పుకోవాలని లేదంటే వాటిని ఆన్ లైనులో పెడతానని బెదిరించాడు.

బ్లాక్ మెయిల్ చేస్తూనే..

బ్లాక్ మెయిల్ చేస్తూనే..

ఆ క్షణం తను అక్కడ నుండి ఏడుస్తూ వెళ్లిపోయింది. అప్పటి నుండి తనకు అస్సలు నిద్ర పట్టలేదు. అలా తను ఓ నెల రోజుల వరకు బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కేవలం బెదిరించడమే తప్ప.. మాములుగా మాట్లాడిందే లేదు. మెసెజ్ అనేది లేదు. అలా నేను డల్ గా ఉండటం చూసిన మా లెక్చరర్ అడగ్గానే.. తను ఏడ్చుకుంటూ మొత్తం చెప్పేసింది. తను చెప్పిన ధైర్యంతో వాళ్ల అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పింది. వాళ్ల అమ్మ ఫోన్లోనే తిట్టినా తన పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండమని చెప్పింది.

తనను పిలిపించి..

తనను పిలిపించి..

ఆ తర్వాత ఆ అబ్బాయిని ప్రిన్సిపల్ రూమ్ కి పిలిపించారు. తన స్మార్ట్ ఫోన్లో తన చేత్తోనే డిలీట్ చేయించారు. మళ్లీ తన వల్ల ఆ అమ్మాయికేమైనా ప్రాబ్లమ్ వచ్చిన్టటు తెలిస్తే.. టిసి ఇచ్చి పంపుతామని.. ఎక్కడా అడ్మిషన్ దొరక్కుండా చేస్తామని చెప్పడంతో తను భయపడ్డాడు. అప్పటి నుండి తాను ఎక్కడ కనిపించినా తల వంచుకుని వెళ్లిపోయేవాడు. అలా తన లైఫ్ లో తొలి ప్రేమ తనకు రతి కోరిక వల్ల చెడు అనుభవంగా మిగిలిపోయింది. అప్పటి నుండి తన జీవితం ఎడ్యుకేషన్, ఫ్యామిలీతో ఆనందంగా ముందుకు సాగింది.

English summary

What Is the Best Way to Escape From a Person You Love in Telugu

Here we are talking about the what is the best way to escape from a person you love in Telugu. Have a look
Story first published: Monday, January 3, 2022, 19:13 [IST]