ఇప్పట్లో ప్రేమ అంటే కేవలం శృంగారమేనా? ఆ రెండింటి మధ్య వ్యత్యాసమే లేదా?

మీరు మీ భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడు చాలా నిబద్ధతతో వ్యవహరించాలి. వారితో ఉన్న మానసిక అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం వంటి మొదలైన అంశాలు శృంగారాన్ని, ప్రేమను వేరు చేసి చూపిస్తాయి.

ప్రేమ గురించి ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా, ఎంతమంది లవర్స్ అందులో ఉండే మజాను అందుకున్నా దాని గురించి ఎంతో కొంత చెప్పేందుకు ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే తరాలు మారినా.. యుగాలు మారినా.. ప్రేమ ఇంకా ఇప్పటికీ టాప్ ప్లేసులో నిలుస్తోంది.

sex and making love?

ఈ జీవితంలోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ప్రేమ అనేది కచ్చితంగా అవసరమవుతుంది. ప్రేమ అవసరం లేకుండా ఎవ్వరూ జీవించలేరు. అయితే ప్రస్తుత జనరేషన్ వారిలో చాలా మంది ప్రేమ అంటే కేవలం శృంగారం అనే భ్రమలో ఉండిపోతున్నారు. ప్రేమకు మరియు శృంగారానికి సంబంధించి తేడాను తెలుసుకోలేకపోతున్నారు...

నిబద్ధతతో వ్యవహరించడం..

నిబద్ధతతో వ్యవహరించడం..

మీరు మీ భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడు చాలా నిబద్ధతతో వ్యవహరించాలి. వారితో ఉన్న మానసిక అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం వంటి మొదలైన అంశాలు శృంగారాన్ని, ప్రేమను వేరు చేసి చూపిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ అంటే అది ఎంతో ఆప్యాయత, అనురాగంతో కూడిన మానసిక అనుబంధం. ఇలాంటి వారికి శృంగార పరంగా కలయిక అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. అది వారికి మంచి భావోద్వేగం కూడా.

ఇందులో ప్రేమ ఉండదు..

ఇందులో ప్రేమ ఉండదు..

శృంగారం అనే విషయంలో ప్రేమ అనేదే ఉండదు. ఇది కేవలం శారీరక సుఖం చేసే ప్రక్రియ. కొన్ని అవసరాలను తీర్చుకోవడం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగిక పరమైన కలయిక మాత్రమే. ఇలాంటివి తాత్కాలికంగానే సంతోషాన్నిస్తాయి.

ప్రేమలో మునిగి తేలటమే కాక..

ప్రేమలో మునిగి తేలటమే కాక..

ప్రేమలో లోతుగా మునిగిపోవడమే కాకుండా.. వారు తమ శరీరాల కలయికకు ఎక్కువగా ఆసక్తి చూపే ఇద్దరుప్రేమికులు ఉపయోగించే పదమే లవ్ మేకింగ్. జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్న వారు చేసే శృంగార కార్యం చాలా అందంగా ఉంటుంది. వారి కోణంలో రెండు శరీరాల కలయిక అనేది పరిమితం కాదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

అందరి ఆలోచనల్లోనూ..

అందరి ఆలోచనల్లోనూ..

ప్రేమ, శృంగారం వంటి విషయాల పట్ల చాలా మంది ఆలోచనల్లో చాలా వ్యత్యాసం ఉంది. ప్రేమ అంటే కేవలం శృంగారం అని, దాని ద్వారానే తమ ప్రేమను తెలియజేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రేమలో శృంగార ఘట్టం ఒక భాగం అని గుర్తించాలి. శృంగారమే జీవితం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి.

సహజ కోరిక..

సహజ కోరిక..

శృంగారం అనేది వయసు వచ్చిన ప్రతి ఒక్కరిలో సహజ కోరికగా ఉంటుంది. అలాగే ప్రేమ అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, శృంగారం విషయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే. ప్రేమ అనేది ఒక కళ వంటిది. అది ప్రేమలో మునిగి తేలిన వారికే తెలుస్తుంది.

శృంగారం అనేది యాంత్రిక చర్య..

శృంగారం అనేది యాంత్రిక చర్య..

శృంగారం అనేది ఆడ, మగవారి శరీరాల మధ్య జరిగే ఒక యాంత్రిక చర్య మాత్రమే. కానీ అంతమాత్రాన అది ప్రేమగా మారిపోదు. ప్రేమ అంటేనే మానసికంగా బలమైన అనుబంధం కలిగి ఉండటం అని తెలుసుకోవాలి. ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ, ప్రేమ కలిగి ఉంటూ కొనసాగించే లైంగిక పరమైన అనుబంధమే లవ్ మేకింగ్ అని గుర్తుంచుకోవాలి.

కళ్లకు నచ్చిన వారిని..

కళ్లకు నచ్చిన వారిని..

తమ కళ్లకు ఎవరైతే నచ్చుతారో అలాంటి వారందరినీ సొంతం చేసుకోవడానికి, అలాంటి వారందరితో రిలేషన్ కావాలనుకుంటే అది ప్రేమ కాదు. అలాగే అవసరాల కోసం, డబ్బు, ఆస్తి వంటి వాటి కోసం జీవిత బంధాన్ని ఏర్పరచుకునేది కాదు ప్రేమంటే.

ప్రేమ కోసం ఏమైనా..

ప్రేమ కోసం ఏమైనా..

ఎవరినైనా చూసినప్పుడు తమ మనసు నిజాయితీగా, నిజంగా రెస్పాన్స్ వంటివి ఇస్తుందో.. అలాంటి వారి కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుందో అలాంటి దాన్నే ప్రేమ అంటారు. ఇలా ఇద్దరి మధ్య బంధం ఏర్పడితే అప్పుడు అది నిజమైన ప్రేమ అవుతుంది. అలాంటి వారు నిజమైన ప్రేమికులు అవుతారు.

నీవు లేకుండా..

నీవు లేకుండా..

నిజమైన ప్రేమ అనేది సుగుణాలతో కలిసి ఉంటుంది. సుగుణాలు స్వయంగా.. ఎదుటి వ్యక్తిలోనూ ప్రేమను పుట్టిస్తాయి. అయితే సుగుణాలు తగ్గినప్పుడు ప్రేమ కూడా తగ్గిపోతుంది. ప్రేమ విషయంలో నేను, నీవు లేకుండా బతకలేను అని చెప్పడానికి ఒక ఊత సాయం కూడా నేను నడవలేను అని చెప్పడానికి మధ్య ఎలాంటి తేడా లేదు.

ప్రేమే శాశ్వతం..

ప్రేమే శాశ్వతం..

శృంగారం అనేది కేవలం శరీరానికి సంబంధించిన అవసరం అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దాని వల్ల కాసేపు సంతోషం, సుఖం దక్కొచ్చు. కానీ జీవితాంతం ఆనందం మాత్రం ఉండదు. ఒక స్టేజీ వరకు వచ్చి అది ఆగిపోతుంది. అదే ప్రేమ విషయానికొచ్చేసరికి ఇది రెండు మనసులకు సంబంధించింది. ఇది మాత్రం శాశ్వతంగా జీవితాంతం ఉంటుంది.

Story first published: Friday, January 10, 2020, 15:34 [IST]
Desktop Bottom Promotion