For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి మీకు ఎలాంటి భార్య వస్తుందో తెలుసా...

|

వివాహం అనేది మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక్కసారే వచ్చే మధురమైన అనుభూతి. తమకు నచ్చిన భాగస్వామితో కలిసి ఏడడుగులు వేయాలని వయసు వచ్చిన వారంతా కోరుకుంటారు.

అయితే పెళ్లి అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో అనేక సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అంతేకాదు ఒకప్పుడు కళ్యాణం అనే కమనీయ కార్యక్రమం కొనసాగాలంటే.. అటు ఏడుతరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతారు.

వీటన్నింటితో పాటు పెళ్లి అనే తంతు ముందుకు పోవాలంటే.. మనసులు మాత్రమే కలిస్తే సరిపోదు.. జాతకాలు కూడా కలవాలని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే వైవాహిక జీవితాన్ని అదే డిసైడ్ చేస్తుందని చాలా మంది నమ్మకం.

అందుకే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల ఆధారంగా రాశి ప్రకారం పెళ్లిళ్ల గురించి అడుగులు ముందుకేస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. రాశి చక్రాలను బట్టి మగవారు తమకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో ముందే డిసైడ్ అవుతారంట... ఈ సందర్భంగా ఏ రాశి వారికి ఎలాంటి భార్య వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనొచ్చా.. ఆ ఘట్టంపై యువత ఆలోచన ఎలా ఉందంటే...!పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనొచ్చా.. ఆ ఘట్టంపై యువత ఆలోచన ఎలా ఉందంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలను ఎక్కువగా తీసుకుంటారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు తమకు అలాంటి లక్షణాలు ఉండే భాగస్వామి కావాలని కోరుకుంటారు. అయితే వీరు ప్రాక్టికల్ విషయాలను పక్కనబెట్టి, ఫాంటసీలను ఎక్కువగా నమ్ముతారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు అమ్మాయిల పట్ల చాలా విధేయత మరియు నమ్మకంగా ఉంటారు. అయితే వీరు మహిళలను నాలుగు గోడల మధ్య సౌకర్యవంతమైన హౌస్ ఉంచేందుకు ఇష్టపడతారు. ఇలాంటి విషయంలో కొన్నిసార్లు మొండిగా కూడా వ్యవహరిస్తారు. ఇలాంటి కండిషన్లన్నీ వివాహానికి ముందే చెప్పేస్తారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు స్త్రీల విషయంలో చాలా ఉద్వేగంగా ఉంటారు. వీరు చాలా త్వరగా విసుగు చెందుతారు. అంతేకాదు ఆసక్తి కూడా కోల్పోతారు. వీరు నిరంతరం కొత్తదనం మరియు తాజాదనం కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలుండే అమ్మాయిలనే భాగస్వామి కావాలని కోరుకుంటారు. అందుకే వీరి వైవాహిక జీవితంలో ఎక్కువ గొడవలు వస్తుంటాయి.

పెళ్లిలో కన్యాదానం అక్కర్లేదంట.. సెకండ్ మ్యారేజ్ కూడా మంచిదట... ఎందుకో మీరే చూడండి...పెళ్లిలో కన్యాదానం అక్కర్లేదంట.. సెకండ్ మ్యారేజ్ కూడా మంచిదట... ఎందుకో మీరే చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు పొందే భాగస్వాములు చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే ఈ రాశి స్త్రీలు భర్తలకు తమ జీవితాన్ని అంకితమిచ్చేస్తారు. వీరు చాలా విషయాల్లో నిజాయితీగా ఉంటారు. వీరు ఎలాంటి కల్మషం లేకుండా తమ శ్రీవారిని ప్రేమిస్తారు. వీరు తమ భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి తమ భాగస్వామి చాలా విషయాల్లో రక్షణగా ఉంటుంది. అయితే వివాహ జీవితంలో వారిని మీరు ఆనందంగా మరియు సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలను పొగుడుతూ ఉంటే చాలు మిమ్మల్ని తెగ ప్రేమిస్తారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు పెళ్లి చేసుకునే స్త్రీలు చాలా విషయాల్లో పరిపూర్ణతను కోరుకుంటారు. వీరు భర్తల నుండి ఎన్నో అంచనాలు కలిగి ఉంటారు. వీరు హాస్య పూరిత మరియు ప్రేమపూర్వక స్వభావంతో పాటు ప్రాక్టికాలిటీ మరియు భావోద్వేగాల సంపూర్ణ సమతుల్యతను కలిగి ఉంటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు తమకు కాబోయే భాగస్వామి పాఠశాల దశ నుండే కోరుకుంటారు. ముఖ్యంగా స్కూల్ క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. వారిపైనే ఎక్కువ అంచనాలను కలిగి ఉంటారు. వీరికి రొమాన్స్ చేయడమంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అదే సమయంలో వీరి భాగస్వామి మానసికంగా పాల్గొనే వరకు మనశ్శాంతితో ఉండలేరు.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి తమ జీవిత భాగస్వామి చాలా విషయాల్లో బలంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు వారి లైఫ్ పార్ట్ నర్ ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండాలని భావిస్తారు. అదే సమయంలో ఈ రాశి స్త్రీలు కూడా తమ భాగస్వామి విషయంలో ఇవే విషయాలను కోరుకుంటారు. అందుకే వీరి వైవాహిక జీవితంలో ఉత్సాహంతో నిండి ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఎక్కువగా ఆశిస్తారు. వీరు వివాహం విషయంలో కూడా పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారు. అందుకే తమ భాగస్వామి విషయంలో కూడా అలాంటివే ఉండాలని భావిస్తారు. అంతేకాదు వీరు తమ భాగస్వామికి చాలా స్నేహపూర్వకంగా, సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు మల్టీ టాలెంటెడ్. వీరు చాలా విషయాల్లో స్వతంత్రంగా ఉండాలని భావిస్తారు. వీరు కఠినమైన సమయాల్లో ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండాలని కోరుకుంటారు. భాగస్వామిలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే ఓకే చెప్పేస్తారు. అంతేకాదు.. వీరు పడకగదిలో చాలా రొమాంటిక్ గా గడుపుతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు తమ భాగస్వామి స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటారు. తమను అర్థం చేసుకునేలా ఉండాలని భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే స్మార్ట్ గా ఉంటారో.. ఆహ్లాదకరమైన, స్వతంత్ర మరియు సాహసాలను ఇష్టపడతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు తమ భాగస్వామితో రొమాన్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వీరు తమ భార్యకు నచ్చితే...తను మూడ్ లోనే అలాంటి కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. వీరు తమ భాగస్వామికి మంచి ఫిజిక్ మరియు అందం ఉండాలని కోరుకుంటారు.

English summary

What kind of a wife you would be based on your zodiac sign

Here we are talking about the what kind of a wife would be based on your zodiac sign. Read on
Story first published: Tuesday, February 23, 2021, 13:14 [IST]