For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి మీరెలాంటి భార్యను పొందుతారో తెలుసా...!

|

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనే ఘట్టం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఎవ్వరి జీవితంలో అయినా ఒక్కసారే వచ్చే మధురమైన అనుభూతి. అందుకే పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటుంటారు మన పెద్దలు.

అయితే ఇప్పుడంతా సీన్ లేదు కానీ.. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి ధోరణి, మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వారి గురించి మనం ఓ అంచనాకు రావొచ్చు.

అయితే ఇవన్నీ జరిగినప్పటికీ చాలా మంది పెళ్లి అనే పేరెత్తగానే ముందుగా జాతకాలు చూస్తుంటారు. ఇప్పటికీ చాలా మంది జాతకాలు కుదరకపోతే పెళ్లిళ్లను క్యాన్సిల్ కూడా చేసేస్తారు. ఎందుకంటే జాతకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు చాలా మంది పెద్దలు.

అందుకే వారి జన్మ రాశులకు సరిపడా ఇతర రాశులకు చెందిన వారితో వివాహాలు జరిపించడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇలా చేస్తేనే వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని విశ్వసిస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు.. ఇంతకీ ఏయే రాశి వారు ఎలాంటి భాగస్వామిని చేసుకుంటారో చూసేద్దాం రండి...

ఈ రాశిచక్రాలు అత్యంత రహస్యపూరితమైనవట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!ఈ రాశిచక్రాలు అత్యంత రహస్యపూరితమైనవట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు సాహాసోపేతమైన మరియు ఎక్కువగా ప్రేమించే స్త్రీని భార్యను పొందుతారు. వీరు భర్తల యొక్క వాస్తవిక అంచనాలను అర్థం చేసుకోరు. ఇదంతా వీరి పుట్టుకతో వచ్చిన స్వభావం కారణంగానే జరుగుతుంది. ఎప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. వీరు మీకు చాలా విషయాల్లో సహాయం కూడా చేస్తారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు మంచి గుణవంతురాలిని భార్యగా పొందుతారు. వీరు మీ ఇంటిని అందంగా, హాయిగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీరు కొంత మొండి పట్టుదలగా ఉన్నప్పటికీ అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అధికంగా ఖర్చు చేస్తారు. వీరు భర్తలపై ఎంతో ప్రేమను కలిగి ఉంటారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ప్రతిసారీ కొత్త విషయాలను కనుగొనే భార్యను పొందుతారు. అయితే వీరి భాగస్వామి కొన్నిసార్లు చంచంలంగా వ్యవహరిస్తారు. కానీ భర్తతో లోతైన మరియు ఆసక్తికరమైన సంభాషణలు చేయడానికి ఇష్టపడతారు. అయితే వీరు ఏ విషయంపైనా ఎక్కువ ఆసక్తి పెంచుకోరు. త్వరగా ఆసక్తిని కోల్పోతారు. వీరు ఎక్కువగా విసుగు చెందరు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు వివాహం విషయం చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు చేసుకోబోయే భాగస్వామి భర్తపై ఎంతో అంకితభావంతో ఉంటారు. వీరు ఎలాంటి కండిషన్లు లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకుని.. వాటిని మీకెలా అందించాలో బాగా తెలుసు. వీరి స్వభావంతో మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటారు. కానీ వీరికి అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.

నవంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...!నవంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు పెళ్లి చేసుకునే అమ్మాయిలు భావోద్వేగాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే వీరు భర్త యొక్క ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం.. సంతోషం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే వీరికి అభినందనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ భార్యలు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు పరిపూర్ణమైన స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. వీరు చేసుకున్న అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ.. భావోద్వేగాల విషయంలో బ్యాలెన్స్ గా ఉంటారు. ఒక కుటుంబాన్ని సజావుగా ఎలా నడపాలో వీరికి బాగా తెలుసు. వీరు ఒక భాగస్వామిగా చాలా నమ్మదగినవారు మరియు ప్రేమగలవారు కూడా.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు పెళ్లి చేసుకునే భాగస్వామికి రొమాన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు తమ భర్తతో బంధానికి సమానంగా భావోద్వేగంతో ఉండాలని కోరుకుంటారు. వీరు తమ భర్తలతో ఆనందం, వినోదం పొందడానికి కొన్ని చిలిపి పనులు చేయడానికి ఇష్టపడతారు. అందుకే వీరిని సరదా భార్యలని చెప్పొచ్చు.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారు చాలా సున్నితమైన అమ్మాయిని భార్యగా పొందుతారు. అయితే వీరి వివాహ జీవితం చాలా ఉత్సాహంతో నిండి ఉంటుంది. వీరు తమ భర్తల నుండి మానసిక భద్రతను కోరుకుంటారు.

నవంబరులో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!నవంబరులో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు స్వేచ్ఛాయుతంగా ఉండే అమ్మాయిని భార్యగా పొందుతారు. వీరు ప్రతిదీ ఆసక్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. వీరు చాలా సహాయకారిగా కూడా ఉంటారు. వీరు తమ భర్తలతో చాలా ఓపెన్ మైండ్ డ్ గా ఉంటారు. వారిని అలాగే ఉండాలని కోరుకుంటారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు మల్టీ టాలెంట్, ఫన్నీ, చురుకుగా, ఉత్సాహం, శక్తివంతంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వీరికి కాబోయే భార్యకు కాస్త కష్టపడేతత్వం కూడా ఉంటుంది. మీకు కష్టం వచ్చిన సమయంలో వీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉంటారు. మీకు చక్కగా సహకరిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం వీరు కొంత సోమరితనంగా మరియు అసహ్యంగా ఉంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు పెళ్లి చేసుకునే అమ్మాయి అతి తక్కువ కాలంలో మంచి స్నేహితురాలిగా మారిపోతారు. వీరు చాలా సాహసోపేతంగా ఉంటారు. వీరు తమ భర్తకు ఏ విషయాలైతే ఇష్టమో.. అలాంటి వాటిపై గొప్ప ఆసక్తి చూపడానికి ఇష్టపడతారు. వీరు మార్పులు లేని లైఫ్ ను ఇష్టపడరు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు మంచి నమ్మకమైన అమ్మాయిని భార్యగా పొందుతారు. వీరు వివాహం చేసుకున్న మహిళ చాలా రొమాంటిక్ గా ఉంటారు. అంతేకాదు, వీరు తమ భర్తలపై ఎంతో అంకితభావంతో ఉంటారు. అయితే వీరికి కొంచెం సిగ్గు కూడా ఎక్కువే. ఇది ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కానీ వీరు తరచుగా మూడ్ స్వింగర్స్ అనుభవిస్తారు.

English summary

What kind of wife would you be based on your zodiac sign in Telugu?

Here we talking about the what kind of wife would you be based on your zodiac sign in Telugu? Read on