For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలమంతా ఆ కౌగిలిలో అలాగే బంధిగా ఉండిపోవాలనిపిస్తుంది... ఆ వెచ్చదనంతో వచ్చే కిక్కే వేరప్పా..

|

''ఆమె కౌగిలి.. కమ్ముకొచ్చే మబ్బుల లోగిలి.. కొంటె కోరికలను స్వాగతించే వాకిలి..ఎంత ఆరగించినా తీరని ఆకలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి.. చెలితో ఓ కౌగిలి.. కుర్రాళ్ల మనసులో ఏదో గిలి గిలి.. మీ అందరికీ మీ ప్రియురాలితో రిలేషన్ పెరగాలి''..

మన తెలుగు వారందరికీ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెబుతున్నామంటే.. అందులో ''జంతర్ మంతర్ చూ మంతర్ కాళి.. అందర్ దర్ద్ దెబ్బకు ఖాళీ..'' అన్న డైలాగ్ కూడా అందరికీ బాగానే గుర్తుండే ఉంటుంది. అయితే నిజ జీవితంలో కూడా మీరు ఒక వ్యక్తిని నమ్మి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందట.

ఎవరి కోసం అయినా ఎన్నాళ్లుగానే వేచి ఉన్న సమయంలో వారు కళ్లెదుట వచ్చి కనిపిస్తే ఆ ఆనందాన్ని సైతం మాటల్లో చెప్పడం కంటే అమాంతరం వారిని కౌగిలించుకుంటారట. అయితే ప్రేమికుల విషయంలో కౌగిలింత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే ప్రస్తుతం అబ్బాయిలు ఒక అమ్మాయిని కౌగిలించుకున్నప్పుడు తమ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయో, తాము ఎలాంటి భావోద్వేగానికి గురయ్యామనే విషయాలన్నింటినీ ఓ సర్వేలో పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే కిందికి స్క్రోల్ చేయండి...

నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు..

మొదటి కౌగిలింత..

మొదటి కౌగిలింత..

'నిన్ను మొదటిసారి కౌగిలించుకున్న క్షణం నాకు ఇంకా బాగా గుర్తుంది. తొలి కౌగిలి అందించిన అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. అది నిజంగా ఓ అద్భుతమే. ఆ మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలను వెతుకుతున్నాను. ఆమె కురులు నాకు సిరులులాగా కనిపించాయి. అక్కడ ఉన్న పూలు సువాసనలను వెదజల్లుతున్నాయి. ఆమె కౌగిలింతలో అలాగే అపరిమితంగా ఉండిపోవాలి అనిపించింది‘ అని 24 ఏళ్ల ఆకాష్ ఆనంద అనే యువకుడు తెలిపాడు.

ఒక్క కౌగిలితో పెళ్లి..

ఒక్క కౌగిలితో పెళ్లి..

‘తనను కౌగిలించుకున్నాక తన కళ్లలో చూడలేకపోయాను. నాకు సిగ్గేసింది. అయినా తను వినకుండా అలాగే చూసింది. ఆ ఒక్క చూపుతో.. కౌగిలింతతో తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను‘‘ అని కౌశిక్ అనే యువకుడు తెలిపాడు.

అదో తియ్యని భావన..

అదో తియ్యని భావన..

‘ఆమెను ప్రేమగా కౌగిలించుకున్నప్పుడు నా పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అది ఒక తియ్యని భావన. ఆ క్షణంలో నా మనసులో ఏవేవో భావాలు చెలరేగాయి. కోరికలు గుర్రాలై పరుగెత్తాయి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను‘ ‘ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు‘ ‘నువ్వు నాకు దక్కినందుకు నేను చాలా లక్కీ‘ ‘నువ్వు ఇలాగే ఎప్పటికీ నాతోనే ఉండిపోవా‘‘ ‘‘నన్నే మనసారా కోరుకోవా‘ అనే ఆలోచనలన్నీ నా మనసులో వచ్చి వెళ్లిపోతుండేవి. కానీ ఆ కౌగిలితో ఆమె ప్రేమను అనుభవిస్తున్న భావన మాత్రం అలా ఉండిపోయింది‘ అని అనికేత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు

కౌగిలింతతో ప్రేమ..

కౌగిలింతతో ప్రేమ..

‘నేను నా ప్రియురాలిని కౌగిలించుకున్నప్పుడు తన మీద నాకు ఎంతో ప్రేమ ఉందో తెలియజేస్తాను. నా కౌగిలింత ద్వారా ఆమె పట్ల నేను ఎంత శ్రద్ధ తీసుకుంటానో తెలియజేసేందుకు ప్రయత్నిస్తాను‘ అని మహదేవన్ వెంకట్రామన్ అనే యువకుడు తన నిర్ణయాన్ని వివరించాడు.

అంతకన్నా ఆనందమేదీ..

అంతకన్నా ఆనందమేదీ..

‘నేను ప్రేమించిన అమ్మాయి కౌగిలిలో మంచు ముక్కలా కరిగిపోవడం కంటే ఆనందం ఇంకా ఏముంటుంది. నేను నా గర్ల్ ఫ్రెండ్ ను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు నా మనసులో ఎలాంటి ఆలోచనలు రాలేదు. నా మనసంతా పూర్తిగా భావోద్వేగంతో నిండిపోయింది. నాకు ఎంతో సుఖంగా సంతోషంగా అనిపించింది‘ అని క్లార్క్ అనే వ్యక్తి అన్నాడు.

నీ కౌగిలి చెరసాలలో..

నీ కౌగిలి చెరసాలలో..

‘నీ కౌగిలి అనే చెరసాలలో ఎప్పటికీ విడుదల అవ్వని జీవిత ఖైదీగా నన్ను మార్చేశావు‘ అని మరో యువకుడు తన భావాన్ని బయటపెట్టాడు.

అప్పట్లో కేవలం కంటి చూపులతో.. మరిప్పుడు స్మార్ట్ చూపులతో...

ఆ కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి..

ఆ కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి..

‘నన్ను కౌగిలింతలతో ముంచేసి ఉక్కిరిబిక్కిరి చేసేశావు. నీ కౌగిలిలో ఏదో మాయ ఉంది. నీ కౌగిలిలో ఎంతో హాయి ఉంది. నీ కౌగిలిలో ఎంతో సుఖం ఉంది‘ అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపాడు.

మరిన్ని విషయాలు..

మరిన్ని విషయాలు..

ఒక అమ్మాయిని హత్తుకున్నప్పుడు ఇంకా ఎన్నో విషయాలు మనసులో మెదలుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలే చలికాలం.. సాయంకాలం వేళ చల్లని గాలిలో అందమైన అమ్మాయి కళ్లు ఆర్పకుండా తననే చూస్తుంటే...

ప్రత్యేక అనుభూతి..

ప్రత్యేక అనుభూతి..

మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు మీ ప్రేయసి నుండి కౌగిలింత అందుకోవడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి కౌగిలింత మీకు తేలికైన మరియు ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే గాక మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది.

బలమైన బంధం కోసం..

బలమైన బంధం కోసం..

మీరు మీ భాగస్వామితో బలమైన సంబంధం ఏర్పరచుకోవాలంటే ఒక కౌగిలితో మీరు ఆ పనిని ప్రారంభించవచ్చు. ఒక్క కౌగిలింత వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని వల్ల మీ ప్రియమైన భాగస్వామిలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

భౌతిక ఆకర్షణ..

భౌతిక ఆకర్షణ..

మీరు మీ భాగస్వామితో భౌతిక ఆకర్షణను ఎలివేట్ చేయాలి అనుకుంటే మీరు ముద్దుల వంటి వాటి జోలికి వెళ్లకూడదు. కౌగిలింత అనేది శారీరక ఆకర్షణను పెంచుతుంది. దీని వల్ల మీరు మీ భాగస్వామి భౌతికంగా చాలా దగ్గరయ్యేందుకు సహాయపడుతుంది.

గొడవలు మర్చిపోయేందుకు..

గొడవలు మర్చిపోయేందుకు..

మీరు మీ భాగస్వామి ఏదైనా సందర్భంలో గొడవలు పడినప్పుడు వాటిని మరచిపోయేందుకు కూడా ఈ కౌగిలింతలను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది మీ గొడవలను మరచిపోయేలా చేస్తుంది. అంతేకాదు మీ మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.

ఆ ప్రేమికులిద్దరూ పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు... కానీ అంతలోనే...

అసహనంగా ఉన్నప్పుడు..

అసహనంగా ఉన్నప్పుడు..

మీ ప్రియురాలు అసహనంగా ఉన్న సమయంలో మీరు ప్రేమగా.. ఆమె రెండు చేతులను చాచి, ఆమె ముఖంలో అందమైన నవ్వును చూస్తూ ఒక్క హగ్ ఇవ్వండి. అంతే మీ ఇద్దరు చిరునవ్వుతో ఎంతో ఆనందాన్ని పొందుతారు.

వెచ్చని అనుభూతి..

వెచ్చని అనుభూతి..

ఈ చలి కాలంలో చల్లటి వాతావరణంలో మీరు మీ ప్రియురాలిని లేదా భార్యను గట్టిగా ఆలిగంనం చేసుకుంటే మీకు వెచ్చని అనుభూతి అనేది కలుగుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధానికి మరో మంచి సంకేతం అవుతుంది.

English summary

what's going on in a guy's mind while hugging a girl?

Here us talking about what's going on in a guy's mind while hugging a girl?. Take a look
Story first published: Monday, January 13, 2020, 16:57 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more