Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
‘నా ప్రియురాలు సడెన్ గా నా రూమ్ కొచ్చింది.. అప్పుడేమైందంటే...’
మీ ప్రియురాలు సడెన్ గా మీ రూమ్ కొస్తానంటే ఏమి చేయాలో చూడండి.
సాధారణంగా బ్యాచ్ లర్స్ రూమ్స్ లో వీకెండ్స్ టైమ్ లో ఎక్కువగా సిట్టింగులు వేస్తుంటారు. లేదా ఇంట్లో అమ్మ నాన్న లేనప్పుడు స్నేహితులతో కలిసి పార్టీల్లాంటివి జరుపుకోవాలని ప్లాన్ చేస్తుంటారు.

ఇంకొందరూ తమ ప్రియురాలితో కలిసి ఎక్కడికైనా బయటకు సరదాగా వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే ఓ కుర్రాడికి వింత పరిస్థితి ఎదురైంది. తను తన గర్ల్ ఫ్రెండ్ ఓ పార్టీకి వెళ్లాడు. అక్కడేమో బాగా లేటైంది. దీంతో తన ప్రియురాలు ఆ కుర్రాడి రూమ్ వచ్చేస్తానని సడన్ గా చెప్పేసింది.

కానీ తన ఆ రూమ్ లో తన ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా కూడా ఆమె తన ప్రియుడి గదికి వెళ్లి రాత్రంతా అక్కడే గడపడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా.. అలాంటి ఓ ఫన్నీ అనుభవాన్నీ పంచుకుంటున్నాడు ఓ కుర్రాడు. ఆ విశేషాలేంటో మీరూ చూడండి.

ఎంట్రీలోనే షాక్..
తన ప్రియురాలికి ఎంతలా నచ్చజెప్పినా వినకుండా వచ్చేసిందామె. అలా వచ్చిన ఆమెకు ఎంట్రీలోనే షాక్ తగిలింది. ఎందుకంటే బ్యాచ్ లర్ రూమ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ చూసిన వెంటనే తనకు నేను స్టోర్ రూమ్ కు కాదు.. నీ బెడ్ రూమ్ కు వస్తా అని చెప్పింది. తను కూడా అది స్టోర్ రూమ్ కాదు.. బెడ్ రూమే అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.

ఫ్రెండ్స్ పార్టీ..
ఆ బట్టలన్నీ తను ఫోల్డ్ చేసి పెడతానని చెప్పి.. బెడ్ నీట్ గా రెడీ చేసి హాలులోకొచ్చేసరికి తనకు బీర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. దీంతో తనకు కోపం పెరిగిపోయింది. అది చూసిన ఆ కుర్రాడికి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. వెంటనే తన ఫ్రెండ్స్ కు చెప్పి క్లీన్ చేయిస్తా అన్నాడు.

సిట్టింగ్ పార్టీ..
అంతలోనే మరో ఫ్రెండ్ వచ్చి ఈరోజు సండే కదా. రాజేష్ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశాం. నైట్ సిట్టింగ్ కూడా ఉంది. త్వరగా రెడీ అవ్వమన్నాడు. దీంతో తనకు ఏమి చేయాలో తోచలేదు. తనకు తన ప్రియురాలు వచ్చిన విషయం గురించి చెప్పాడు. అయినా తను మాట వినలేదు. ఎప్పటినుండో వేసుకున్న ప్లాన్ ఇది. నీ ప్రియురాలి కోసం క్యాన్సిల్ అంటే కష్టం అన్నాడు.

చేసేదేమీ లేక..
అందరూ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి.. నేను నా బెడ్ రూమ్ కి వెళ్లిపోయాను. అంతలోపే తను కిచెన్ లోకి అడుగు పెట్టింది. అక్కడ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అది చూసిన తనకు ఆకలి కూడా చచ్చిపోయింది. నేనప్పుడు తనకు ఆన్ లైనులో ఫుడ్ ఆర్డర్ పెడతాలే అని కవర్ చేశాను. దీంతో తను శాంతించింది.

రొమాంటిక్ సినిమా..
ఓ వైపు ఫ్రెండ్స్ పార్టీ స్టార్టవుతుంటే.. నేను నా ప్రియురాలితో కలిసి రొమాంటిక్ సినిమా చూడటం ప్రారంభించాను. అదే సమయంలో తనకు ఇష్టమైన బిర్యానీ కూడా వచ్చింది. ఇక స్నాక్స్ తింటూ ఇద్దరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నాం.

మధ్యలో బయటికి..
అలా మేమిద్దరం సినిమా చూస్తుండగానే.. ఓసారి మధ్యలో బయటికెళ్లి పరిస్థితి ఎలా ఉందో అబ్జర్వ్ చేయడానికి వెళ్లాను. అందరూ ఫుల్లుగా తాగేసి పడిపోయారు. అంతే నేను కంగారుగా వెళ్లి నా రూమ్ తలుపు గడి పెట్టేశాను. ఆ తర్వాత నేను తను కళ్లలో కళ్లు పెట్టుకుంటూ గాఢంగా ప్రేమించుకోవడం మొదలుపెట్టాం.

అద్భుతమైన రొమాన్స్..
సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఆ తర్వాత మేమిద్దరం మా జీవితంలోనే అద్భుతమైన రొమాన్స్ చేశాం. ఆరోజు చేసిన ఆ కార్యం నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎలాంటి శబ్దం రాకుండా సెక్స్ చేయాలన్న థ్రిల్ మా ఆనందాన్ని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు.

లాంగ్ డ్రైవ్..
ఆ తర్వాత మేమిద్దరం లాంగ్ డ్రైవ్ కు వెళ్లాం. అక్కడ ఓ కుల్ఫీ కొన్నాం. అక్కడ కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఒక్కదాన్ని మేమిద్దరం జుర్రుకున్నాం. మళ్లీ తిరిగి వెళ్లి రూమ్ కెళ్లి రొమాన్స్ లో పాల్గొన్నాం. ఆ తర్వాత రాత్రంతా తను మా రూమ్ లో ఉండి ఉదయాన్నే ఎవ్వరూ నిద్ర లేవక ముందే వెళ్లిపోయింది. తను నా గదిలో నుండి వెళ్లేటప్పుడు ఇచ్చిన కిస్ నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టమైనది' అంటూ ఓ కుర్రాడు తన ప్రేయసి గురించి ఇలా చెప్పాడు.



Click it and Unblock the Notifications