Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
‘బర్త్ డే రోజు అలా వచ్చి సర్ ప్రైజ్ చేసిన నా ప్రేయసి...’ ఆ తర్వాత ఏం జరిగిందంటే...?
మీరు, మీ ప్రియురాలు రూమ్ లో ఒంటరిగా ఉంటే ఏమి చేస్తారు
'నాకు చిన్నప్పటి నుండి జిమ్ చేసే అమ్మాయిలన్నా.. జాబ్ చేసే అమ్మాయిలన్నా ఎంతో గౌరవం.. ఇష్టం.. నేను సినిమాలు చూస్తున్నప్పుడు కూడా జిమ్ చేసే వారిని చూసి ఎంతో ఆనందిచేవాణ్ణి.

నేను పెరిగి పెద్దయ్యాక కూడా జిమ్ లో పని చేసే అమ్మాయిని లేదా బాడీ ఫిట్ గా ఉండి జాబ్ చేసే స్త్రీని లేదా బాగా సంప్రదాయ బద్ధంగా ఉండి.. అందమైన చీర కట్టులో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను.

కానీ నాకు పెళ్లి వయసొచ్చేసరికి నా ఆశ నిరాశగా మారిపోయింది. నేను ఫ్రెండ్ షిప్ చేసిన అమ్మాయిలంతా చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే నేను మంచి జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశను వదిలేసుకున్నాను.

మా ఆఫీసులోనే..
అంతలో నాకు కూడా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడంతా కలర్ ఫుల్ గా ఉంది. అక్కడే కొత్తగా ఓ అమ్మాయి పరిచయమైంది. మొదట్లో కళ్లు కళ్లు కలిశాయి.. ఆ తర్వాత మాటలు పెరిగాయి. అలా కొద్ది కాలంలోనే తను నాకెంతో ప్రత్యేకంగా అనిపించింది. దీంతో తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాను.

ఓ రాత్రి..
తనకు కూడా వైన్ తాగే అలవాటు ఉంది. అలా మేమిద్దరం కలిసి ఓ వీకెండ్ రాత్రి వైన్ తాగుతున్నప్పుడు నాకు చిన్నప్పటి నుండి ఓ ఫ్యాంటసీ ఉందని చెప్పాను. దాని గురించి చెప్పినప్పుడు తను విపరీతంగా నవ్వింది. అయితే నాకు ఆ ఫ్యాంటసీ అనుభవాన్ని కలిగిస్తానని నాలో ఆశల్ని రేకేత్తించింది.

బర్త్ డే సెలబ్రేట్ చేసుకోలేదు..
ఆ తర్వాత కొద్దిరోజులకే నా బర్త్ డే వచ్చింది. కానీ నేను ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు. అప్పుడు నాకు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. నేను చేసిన ప్రాజెక్టులో తప్పులు లేకున్నా.. లోపాలున్నాయని, ఆఫీసు పాలిటిక్స్ కారణంగా నాకు ప్రమోషన్ రాకుండా, హైక్ ఇవ్వకుండా చేశారు. దీంతో నేను చాలా బాధపడుతుండేవాడిని. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉండిపోవాలనుకున్నా.

బయటికెళ్లకుండా..
ఆరోజు డిన్నర్ చేయడానికైనా బయటకు రమ్మని నా స్నేహితులంతా అడిగారు. వాళ్లకు కూడా రాలేనని ఏదో ఒక కారణం చెప్పేశాను. నా గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రాజెక్టు వర్క్ మీద ఊరెళ్లింది. దీంతో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానేమో అనిపించింది. దీంతో లంచ్ ఆన్ లైనులో ఆర్డర్ పెట్టి డే మొత్తం ల్యాప్ టాప్ లో వెబ్ సీరిస్ లు చూస్తూ కూర్చున్నా.. అలా చూస్తూ సాయంకాలం ఆరు గంటలకు ఫ్రెషప్ అవ్వడానికి లేచాను.

కాలింగ్ బెల్ మోగింది..
నేను బాత్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి వచ్చానో లేదో కాలింగ్ బెల్ మోగింది. ఈ టైమ్ లో ఎవరొచ్చారా అని తిట్టుకుంటూ డోర్ తీశాను. ఎదురుగా నా గర్ల్ ఫ్రెండ్ ప్రత్యక్షమైంది. నాకు పట్టరానంత సంతోషం కలిగింది. బర్త్ డే రోజు సర్ ప్రైజ్ ఇస్తే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

నమ్మలేకపోయాను..
తను మంచి సారీ కట్టుకుని వచ్చిందని ఆశ్చర్యపోయాను. అదేంటని అడుగుతుండగానే తను నన్ను గట్టిగా హత్తుకుంది. అక్కడితో ఆగకుండా కిస్ కూడా చేసింది. దాన్ని నేను అస్సలు నమ్మలేకపోయాను. అలా సర్ ప్రైజ్ హ్యాపీ బర్త్ డే అంటూ గట్టిగా అరిచి నన్ను హత్తుకుని.. నాకు నచ్చినట్లు రెడీ అయ్యిందన్న ఆనందంలో తన మీద పడిపోయాను.

కొంటె చేష్టలు..
తన శారీని నెమ్మదిగా తీస్తూ.. ప్రేమగా కిస్ చేస్తూ.. సుకుమారంగా కొంటె చేష్టలు చేస్తూ కొన్ని చోట్ల కొరికేశాను. తను కూడా తన సుకుమారమైన చేతులతో నన్ను ఎక్కడెక్కడో తాకింది. ఆ సమయంలో ఇలాంటి ప్రియురాలు నాకు భార్య అయితే చాలు అనిపించింది. జిమ్ బాడీతో పనేముందని ఫీలయ్యాను. ఇంకేమి అవసరం లేదు అనిపించింది. ఆరోజు అలా గడిచిపోయింది. ఆ తర్వాత కొద్ది నెలలకే మా ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగిపోయింది' అని సాఫ్ట్ వేర్ కుర్రాడు తన అనుభవాలను చెప్పుకున్నాడు.



Click it and Unblock the Notifications