Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మగాళ్లకు ‘ఆ’కార్యంపై ఆసక్తి తగ్గుతోందట... కారణాలేంటో తెలుసా...
కొందరు మగాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఆ కార్యాన్ని ఎందుకని ఆపాలనుకుంటారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన సమాజంలో వయసులో ఉన్న ప్రతి మగాడు ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని తహతహలాడుతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత ఆ ఘట్టాన్ని ప్రారంభించేందుకు, తమ కోరికలను తీర్చుకునేందుకు కొన్నిసార్లు తమ భాగస్వామిపై బలవంతం కూడా చేస్తుంటారు.

అయితే తమ పార్ట్ నర్ కూడా తమతో సమానంగా ఆనందం పొందుతుందా లేదా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు రొమాన్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు.

పెళ్లిళ్లు.. ఇతర బంధాల్లో ఉన్నప్పటికీ లైంగిక కోరికలు మాత్రం క్రమంగా తగ్గిపోతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందుకు ప్రధాన కారణం మారుతున్న లైఫ్ స్టైల్. ఆ మార్పులు చాలా మందికి చిన్నవే అనిపించినా.. అవి మగాళ్ల శ్రుంగార జీవితాన్ని ప్రభావితం చేయడంలో మాత్రం ముందుంటాయనే విషయాన్ని చాలా మంది మరిచిపోతున్నారు. ఈ సందర్భంగా మగవారిలో సెక్స్, రొమాన్స్ పట్ల ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తగినంత నిద్ర..
ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది మగవారు సమయానికి తిండి తినడం లేదు. అలాగే సరైన సమయానికి తగినంత నిద్ర పోవడం లేదు. చాలా మంది పురుషులు తమ పనులు, ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని వాపోతు్నారు. దీని కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడటమే కాదు.. వారి శ్రుంగార జీవితంపైనా ఇది ప్రభావం చూపుతోంది. ఎందుకంటే నిద్రలేమి కారణంగా పురుషులలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా ఆ కార్యంపై కోరికలు తగ్గపోతాయి. అందుకే మీరు ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ లైంగిక జీవితం ఆరోగ్యంగా, సాఫీగా ముందుకు సాగుతుంది.

ఇతర వ్యవహారాలు..
మీరు రాత్రి వేళ పడకగదిలో బెడ్ రూమ్ లో అడుగుపెట్టాక ఇతర వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నా లేదా డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడినా మీలో రతి క్రీడ పట్ల ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దీని నుండి బయటపడేందుకు మీరు మీ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనాలి. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ మీ శక్తిస్థాయిలను పెంచుకుని.. ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా మీ మైండ్ లో వస్తున్న ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మీకు బాగా ఇష్టమైన పని, అభిరుచుకి తగ్గ పని చేయడం నేర్చుకోండి.

ట్యాబ్లెట్లు వాడటం..
కొందరు పురుషులు తాము ఆ కార్యంలో ఎక్కువ సమయం పాల్గొనాలనే ఆరాటంతో ఏవేవో ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అయితే దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ మందులు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వాడితేనే మంచిది. లేదంటే మీరు తర్వాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒకే మాదిరిగా..
పెళ్లైన కొత్తలో చాలా మంది భార్యభర్తలు ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండటానికి అంతగా ఇష్టపడరు. అయితే కాలం మారే కొద్దీ మీరు ఒకే మాదిరిగా ఆ కార్యంలో పాల్గొంటే ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. అందుకే మీ వైవాహిక జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ ఉండాలి. ఒకసారి సెక్స్ రోటీన్ గా మారిందంటే.. దాన్ని ఆస్వాదించడం కష్టమే. కాబట్టి ఒకేలా కాకుండా ఒకసారి కిచెన్లో, మరోసారి బాత్ రూమ్ లో షవర్ కింద అలా భిన్నమైన ప్లేసుల్లో ఆ కార్యాన్ని చేసేందుకు ప్రయత్నించాలి.

ఒత్తిడి వల్ల..
ప్రస్తుత కరోనా కాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్కువ మంది మగాళ్లు తమ వ్యక్తిగత జీవితంలోనే కాదు.. ఉద్యోగ జీవితంలో కూడా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం వల్ల మీరు రొమాన్స్ లో వెనుకబడిపోతారు. వాస్తవానికి సెక్స్ అనేది మన బాడీకి సంబంధించినది అయితే అందుకు మానసికంగా సిద్ధంగా లేకపోయినా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి భార్యభర్తలిద్దరూ కొత్త ప్రదేశాలకు, టూర్లకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి.

గ్యాడ్జెట్లకు అతుక్కోవడం..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ గ్యాడ్జెట్లకు తమకు తెలియకుండానే అతుక్కుపోతున్నారు. ఈరోజుల్లో చిన్నపిల్లాడి నుండి ముసలివారి దగ్గరి వరకు సెల్ ఫోన్ ఉండటం అనేది కామన్ అయిపోయింది. చివరికి కపుల్స్ కూడా ఫోన్ పట్టుకుని పడకగదిలో బెడ్ పై లేదా సోఫా పై కూర్చుని గంటలకొద్దీ గడిపేస్తున్నారు. ఇద్దరూ అలా చేస్తే.. ఆటోమేటిక్ గా ఆ కార్యంపై ఆసక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు పడకగదిలో సెల్ ఫోన్ వాడకుండా జాగ్రత్తపడండి. మీరు బెడ్ రూమ్ లో వెళ్లే సమయంలో ఫోన్ ను సైలెంట్ లేదా స్విచ్ఛాఫ్ చేసేయడం మరీ మంచిది.

చెడు అలవాట్లు..
మద్యపానం, ధూమపానం ఇతర చెడు అలవాట్లు ఉన్నవారు హద్దుల్లో ఉంటే మంచింది. ఏ మాత్రం మీరు హద్దు దాటినా అది మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అదీ కాకుండా ఇటు ఆరోగ్య పరంగా కూడా సమస్యలను తీసుకొస్తాయి. ముఖ్యంగా పంటి సమస్యలకు స్వాగతం పలుకుతాయి.

ఇతరులపై మోజు..
పెళ్లికి ముందు మనసులో ఒకరిని గుర్తుంచుకుని.. ఇంకొకరితో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ కార్యంపై ఆసక్తి అనేది రాదు. ఎందుకంటే మనసులో ఒకర్ని పెట్టుకుని.. ఇంకొకరితో హ్యాపీగా జీవించడం అన్నదానిలో అస్సలు అర్థం ఉండదు. ముఖ్యంగా సెక్స్ చేసే సమయంలో ఈ తేడా గురించి మీకే క్లియర్ గా తెలుస్తుంది.



Click it and Unblock the Notifications











