For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యాన్ని అసౌకర్యంగా ఫీలవుతున్నారా? అందుకు కారణాలేంటో తెలుసా...

రొమాన్స్ పరంగా ఎందుకని అసౌకర్యంగా అనిపిస్తుందనే ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది ప్రతిరోజూ ఆ కార్యంలో పాల్గొంటున్నారు. ఇంకా కొందరు రొమాన్స్ ఎప్పుడెడప్పుడు చేద్దామా.. తమ భాగస్వామితో కీలుగుర్రంలా ఎగిరిపోదామని.. రతి మన్మథుడిలా రెచ్చిపోదామని ఊహల్లో తేలిపోతుంటారు.

Why Does Romantic Attention Make Me Uncomfortable in Telugu

అయితే కలయికలో పాల్గొంటున్న వారిలో చాలా మంది ఆ కార్యాన్ని ఆస్వాదించడం లేదట. కేవలం కొందరు మాత్రం కలయికలోని మజాను, అనుభూతిని పొందుతున్నారట. మరికొందరైతే నెమ్మదిగా రొమాన్స్ పేరేత్తితేనే చిరాకు పడుతున్నారట.

Why Does Romantic Attention Make Me Uncomfortable in Telugu

భాగస్వామితో కలయికలో పాల్గొనేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదట. లైంగిక కార్యం అంటేనే తప్పించుకోవాలనిస్తోందట. అందుకు గల ప్రధాన కారణాలేంటో తెలుసా.. ఇంకెందుకు ఆలస్యం అందుకు గల కారణాలేంటి.. వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెద్ద వయసున్న మగాళ్లను మహిళలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా...పెద్ద వయసున్న మగాళ్లను మహిళలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

Why Does Romantic Attention Make Me Uncomfortable in Telugu

ప్రస్తుత కాలంలో చాలా మంది నిరంతరం స్మార్ట్ ఫోన్లోనే మునిగిపోతున్నారు. ఉదయం నిద్ర లేచి దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనషుల కన్నా.. దాంతోనే ఎక్కువగా గడుపుతున్నారు. మరికొందరైతే నిద్రలో ఉన్నప్పుడు చిన్న మెసెజ్ శబ్దం వచ్చినా.. వాట్సాప్, ఫేస్ బుక్ లేదా ఇతర సోషల్ మీడియా వంటి వాటి నుండి నోటిఫికేషన్ వచ్చినా.. వెంటనే ఫోన్ ను చేతిలోకి తీసుకుని స్వైప్ చేస్తుస్తుంటారు. ఇలా ప్రతి స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవ్వడం వల్ల ఆ కార్యంపై ఆటోమేటిక్ గా ఆసక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

టైం లేకపోవడం..

టైం లేకపోవడం..

మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపడంతో భాగస్వామితో కలిసి ఆ కార్యంలో పాల్గొనేందుకు అస్సలు టైం కుదరడం లేదు. ఇంకా కొందరైతే ఫోన్లలోని సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం అదే పనిగా కొత్త కొత్త పోస్టులు, రీల్స్ వంటివి రెగ్యులర్ గా పోస్ట్ చేసేస్తున్నారు. దీంతో భాగస్వామితో గడిపేందుకు టైం కేటాయించట్లేదు. కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్ తో సమయాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గిస్తే.. మీరు ఆ కార్యంపై మళ్లీ ఆసక్తి పెంచుకోవచ్చు.

ఎక్కువ గ్యాప్ ఇవ్వొద్దు..

ఎక్కువ గ్యాప్ ఇవ్వొద్దు..

ఈరోజుల్లో చాలా మంది అనేక రకాలైన ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, జాబ్ టెన్షన్, జాబ్ సెర్చింగ్, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి. కేవలం ఒత్తిడి కారణంగా కలయికలో పాల్గొనకుండా ఉండొద్దని.. నిపుణులు చెబుతున్నారు. మీ లైఫ్ బ్యాలెన్స్ గా ఉండాలంటే కొంత సమయం పడుతుంది.. కానీ కాస్త ఫోకస్ పెడితే అది చాలా సులభమే. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఎక్కువ కాలం ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

వివాహ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తే.. విడిపోవడానికి సిద్ధమైనట్టే...!వివాహ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తే.. విడిపోవడానికి సిద్ధమైనట్టే...!

చురుగ్గా ఉండేందుకు..

చురుగ్గా ఉండేందుకు..

కొందరైతే చాలా విషయాల్లో చాలా లేజీగా ఉంటారు. దీంతో మీరు చురుగ్గా ఉండలేరు. ఈ కారణంగా కనీసం తేలికపాటి వ్యాయామం కూడా చేయలేరు. ఇలాంటి కారణాల వల్ల కూడా మీరు లైంగిక కార్యంపై పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి మీరు బద్ధకాన్ని పక్కనబెట్టి.. ఆ కార్యంలో పాల్గొనాలి. ఇక తేలికపాటి వ్యాయామం కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీలో మంచి హార్మోన్లు విడుదల అవుతాయి.

ఎక్కువగా ఊహించుకోవడం..

ఎక్కువగా ఊహించుకోవడం..

మనలో చాలా మందికి నీలి చిత్రాలు, స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చూసే అలవాటు కారణంగా కూడా ఆ కార్యాన్ని ఎక్కువగా ఆస్వాదించలేకపోవచ్చు. ఎందుకంటే అందులో వీక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల యాంగిల్స్.. కొత్త కొత్త పద్ధతులను ప్రయత్నిస్తూ ఉంటారు. తమ జీవితంలో కూడా కొందరు అలా ప్రయత్నించి ఫెయిల్ అవుతుంటారు. అయితే వాస్తవాలను గుర్తిస్తే, మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే వీడియోల్లో చూపించేది అంతా వాస్తవం కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీరు నిజంగా కలయికను ఆస్వాదించాలంటే ముందుగా ఫోర్ ప్లే, రొమాన్స్ తో మొదలెట్టాలి.

హెల్ప్ తీసుకోండి..

హెల్ప్ తీసుకోండి..

ఆ కార్యం గురించి మీలో ఏమైనా ఫీలింగ్స్, ఆలోచనలు, భయాలు ఉంటే కూడా మీరు కలయికను ఆస్వాదించలేరు. కాబట్టి మీరు ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. మీ భాగస్వామిని కూడా అందుకు ప్రిపేర్ చేయాలి. ఇందుకోసం వారితో కమ్యూనికేట్ చేయండి. ఇవన్నీ చేసినా ఫలితం లేకపోతే, మీరు మంచి సెక్స్ కౌన్సిలర్ ను సంప్రదించి వారి సహాయం తీసుకోండి.

English summary

Why Does Romantic Attention Make Me Uncomfortable in Telugu

Here we are talking about the why does romantic attention make me uncomfortable in Telugu. Have a look
Story first published:Monday, February 21, 2022, 16:50 [IST]
Desktop Bottom Promotion