For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనొచ్చా.. ఆ ఘట్టంపై యువత ఆలోచన ఎలా ఉందంటే...!

|

మనలో చాలా మంది యవ్వనంలో ఉండే వారు రొమాన్స్ అంటే తెగ ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడెప్పుడూ ఆ కార్యంలో పాల్గొందామా.. అని తహ తహలాడుతుంటారు.

అయితే ప్రస్తుత సమాజంలో కొంతమంది యువత పెళ్లికి ముందే ఆ కార్యాన్ని చేయాలని భావిస్తున్నారట. అయితే మన దేశంలో వివాహం అంటే ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఉంటారు.

అందుకే వివాహం తర్వాత శోభనం అనే ఘట్టాన్ని పెట్టారు. కానీ ఈ విషయం గురించి యువత పెద్దగా పట్టించుకోవట్లేదట. పెళ్లికి ముందే ఆ కార్యం కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నారట.

ఈ సందర్భంగా వివాహానికి ముందే ఆ ఘట్టంలో పాల్గొనడం కరెక్టా కాదా.. అసలు ఇది మంచిదేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కారులో 'ఆ కార్యం' చేయాలనుకుంటున్నారా... అయితే ఈ చిట్కాలు పాటించండి...!

ఆ ఘట్టం గురించి..

ఆ ఘట్టం గురించి..

మన దేశంలో వివాహానికి ముందు ఆ ఘట్టం గురించి యువత వైఖరి ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. అయితే యుగోవ్ అనే సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం పెళ్లికి ముందే తమ పార్ట్ నర్ తో ఆ కార్యంలో అనుభవం కలిగి ఉంటే తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారట.

దక్షిణ భారతంలో..

దక్షిణ భారతంలో..

కానీ మన దక్షిణ భారతదేశంలో పెళ్లికి ముందే ఆ కార్యమంటే కేవలం 16 శాతం మందే ఓకే చెప్పారంట. కాలం మారే కొద్దీ పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బంధాలు, అనుబంధాల గురించి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు నేటి యువత.

భవిష్యత్తులో..

భవిష్యత్తులో..

వివాహానికి ముందు ఆ కార్యంలో పాల్గొనడంపై ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట. దీంతో తమ భాగస్వామితో భవిష్యత్తులో సుఖంగా ఉంటామో లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చని భావిస్తున్నారంట.

పెళ్లైన వారి కంటే.. సింగిల్ గా ఉంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటారట...! ఎందుకో తెలుసా..?

ఒకప్పుడు తప్పు..

ఒకప్పుడు తప్పు..

మన దేశంలో సాధారణంగా పెళ్లికి ముందు ఆ కార్యంలో చాలా తప్పుగా భావించేవారు. ఎందుకంటే మన దేశంలో సంప్రదాయాలు, కట్టుబాట్లకు ఎంతో విలువ ఇస్తారు కాబట్టి. అందుకే అలాంటివి మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు.

టెక్నాలజీ కారణంగా..

టెక్నాలజీ కారణంగా..

అయితే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ వల్ల డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ వంటివి చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. దీంతో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు టీనేజీలోనే ఆ కార్యంపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నాయి.

భయం వల్ల..

భయం వల్ల..

ఒకప్పుడు ఆ ఘట్టం కోసం అనేక దశలను దాటాల్సి వచ్చేది. ముందు ప్రేమ లేదా వివాహం. ఆ తర్వాత కూడా ఆ కార్యంలో పాల్గొనాలంటే కొంత భయపడేవారు. అంతేకాదు పెళ్లికి ముందు ఆ కార్యం మన సమాజంలో నిషేధంగా ఉండేది.

మూడేళ్లుగా ప్రేమ... మూడు ముళ్లు పడేదెప్పుడో... పెళ్లి దగ్గరకొచ్చేసరికి...

రహస్యంగా ఉన్నందుకు..

రహస్యంగా ఉన్నందుకు..

అయితే మన దేశంలో రొమాన్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఒకప్పుడు ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. పురాతన కాలం నుండి ఈ విషయం సీక్రెట్ గా ఉంటేనే మంచిదని భావించేవారు. దీంతో భారత యువతకు ఆ కార్యం అంటే ఒక చెడు కార్యమని భావించేవారు.

కొద్దిమంది మాత్రమే..

కొద్దిమంది మాత్రమే..

మన దేశంలో పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనడానికి చాలా మంది ఇష్టపడకపోయినా.. తమ భాగస్వామిని గట్టిగా హత్తుకోవడం.. వెనుక నుండి పట్టుకోవడం మరియు ఏకాంతంగా ఉండేందుకు బాగా ఇష్టపడతారట. అయితే పెళ్లికి ముందు లైంగిక సంబంధంలో పాల్గొనేందుకు కొందరే ఓకే చెబుతున్నారట.

ఎందుకు నిషేధించారంటే..

ఎందుకు నిషేధించారంటే..

భారతదేశ సంప్రదాయం ప్రకారం, పెళ్లికి ముందు లైంగిక సంబంధం నిషేధించబడింది. ఎందుకంటే ఆ కార్యం ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసేదిగా ఉండాలని భావిస్తారట. అందుకే ఆ కార్యం పెళ్లి తర్వాత మంచిదని మన పెద్దలు చెబుతుంటారు.

పెళ్లికి ముందే..

పెళ్లికి ముందే..

అంతేకాకుండా పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని..దీని వ్యక్తిగత విలువలు తగ్గుతాయని, చెబుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తమను ఒక పరిధిలో ఉంచాయని చెబుతున్నారు.

English summary

Why is romance not allowed before marriage?

Here we are talking about why is romance not allowed before marriage. Read on
Story first published: Saturday, February 20, 2021, 15:17 [IST]