For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతిక్రీడలో మహిళలు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...

|

శృంగారం అంటే వయసులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ కార్యంలో తొలిసారి పాల్గొనే అమ్మాయిలకు అనేక సందేహాలు వస్తుంటాయి. మొదటిసారి ఎదురైనా సమస్యల నుండి ఎలాగోలా బయటపడినా...మరోసారి అలాంటి సమస్య ఎదురైతే.. ఏం చేయాలి.. తమ భాగస్వామికి తన సమస్య గురించి ఎలా చెప్పాలి? ఒకవేళ ఆ విషయం గురించి చెబితే తను ఏమనుకుంటాడో.. తను పాజిటివ్ గా ఫీలవుతాడా? లేదా తను అసహ్యించుకుంటాడా అనే అనుమానాలు మహిళల మదిలో మెదులుతూ ఉంటాయి.

అయితే ఇలాంటి అపొహలన్నింటినీ మీరు కట్టిపెట్టేసి రతిక్రీడలో ప్రశాంతంగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తే.. ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు రతిక్రీడలో పాల్గొనే సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట. అలా చేస్తే మీరు భావోద్వేగ అనుభూతిని పొందరని.. మీ భాగస్వామికి సైతం చిరాకు తెప్పిస్తారు. కాబట్టి మీరు శృంగారంలో పాల్గొనే ముందు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో చూసెయ్యండి. వీటిని తప్పించుకుంటే చాలు మీరు కోరుకున్న వారితో.. ఏకాంతంగా ఆ కార్యంలో ఎంజాయ్ చేయొచ్చు.

ఏవేవో ఆలోచనలు..

ఏవేవో ఆలోచనలు..

మనలో చాలా మంది మహిళలకు శృంగారం గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పొచ్చు. శృంగారానికి సంబంధించి వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల వారికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ముఖ్యంగా తమ భాగస్వామిని ఎలా ఆకర్షించాలోనని చాలా తీవ్రంగా ఆలోచిస్తారట. తొలిసారి పాల్గొంటే నొప్పిగా ఉంటుంది.. కాస్త అసౌకర్యంగా అనిపిస్తుందని అపొహలో ఉంటారట. అయితే అందరికీ ఇలా జరగదు. కేవలం కొందరికి మాత్రమే ఇలా జరగొచ్చు. కాబట్టి మీరు రతిక్రీడలో పాల్గొనేటప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా పడకగదిలోకి ప్రవేశించండి. ఆ కార్యాన్ని బాగా ఆస్వాదించేయండి. కేవలం ఆ మధురానుభూతులను మాత్రమే ఆనందించడి.

కబుర్లు తగ్గించాలి..

కబుర్లు తగ్గించాలి..

కొందరు మహిళలు తమ భాగస్వామితో అనునిత్యం ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటారు. అయితే ముచ్చట్లు పెట్టడానికి శృంగార సమయం మీకు సరిపోదు. ఈ సమయంలో మీ పెదాల నుండి మాటలు కాదు.. కిస్ చేయడం.. వంటి పనులు చేయాలి. మరో విషయం ఏంటంటే.. ఆ కార్యం తర్వాత కూడా ఏదైనా మాట్లాడాలని, ముఖ్యంగా భాగస్వామి మీ గురించి మాట్లాడాలని ఆశించడం కూడా అంత కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.

అలా చేస్తే..

అలా చేస్తే..

మీరు పడకగదిలో మీ పార్ట్నర్ తో ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఎట్టి పరిస్థితిలో ఆధిపత్యం కోసం ప్రయత్నించొద్దు. ఇలాంటి పనులు మగాళ్లకు ఏ మాత్రం నచ్చదు. మీరు తనను కంట్రోల్ చేయాలనుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మంది మహిళల్లో ఇలాంటి అలవాట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ బాధపడతారు. దీంతో వారు ఆ కార్యం అంటేనే హడలెత్తిపోతారు.

గొడవలు పెట్టుకోవద్దు..

గొడవలు పెట్టుకోవద్దు..

భార్యభర్తలు లేదా ప్రేమికులు అన్నాక ఏదో ఒక విషయంలో గొడవలు సాధారణంగానే వస్తుంటాయి. కాబట్టి మీ పార్ట్నర్ తో పదే పదే గొడవ పెట్టుకోవద్దు. కొన్నిసార్లు మీ పార్ట్నర్ చేస్తున్న పనులు మీకు నచ్చకపోతే.. సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే వారు చేసే ప్రతి పనీ మీకు నచ్చాలని రూలేం లేదు. అలాగని మీకు నచ్చని పని ఏదైనా మీ పార్ట్నర్ చేస్తే కాసేపు కామ్ గా ఉండండి. తన మూడ్ మంచిగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడండి. అంతేకానీ గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. తన ఈగో హర్ట్ కాకుండా నెమ్మదిగా చెప్పండి.

హైజీన్ మెయింటెన్ చేయండి..

హైజీన్ మెయింటెన్ చేయండి..

శృంగార కార్యంలో పాల్గొనడానికి ముందు మీరు మీ రహస్య ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. అయితే కేవలం ప్రైవేట్ పార్టుల్లో ఒక్కటే కాదు.. మీ బాడీ మొత్తం క్లీన్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం హైజీన్ మెయింటేన్ చేయండి.

మొండి పట్టుదల వద్దు..

మొండి పట్టుదల వద్దు..

రతి క్రీడలో ఎప్పటికీ నాటకాలు ఆడటం వంటివి చేయొద్దు. ముఖ్యంగా పడకగదిలో మీ పార్ట్నర్ తో నాకు అది కావాలి.. ఇది కావాలి.. అని మొండి పట్టు పట్టొద్దు. ఇది మీ భాగస్వామికి చాలా చిరాకు తెప్పిస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు సర్దుకుపోవాలి. అప్పుడే మీరిద్దరూ ఆ కార్యాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక భావోద్వేగం విషయంలో వారితో అబద్ధం చెబితే.. వారికి అది నచ్చదు. కాబట్టి మీరు సుఖం పొందుతున్నారా లేదా అనే విషయాలను డైరెక్టుగా చెప్పేయండి. మీకెలా చేస్తే సుఖంగా ఉంటుందో వారిని అలా చేసేందుకు ప్రోత్సహించండి.

English summary

Women Avoid These Mistakes in Your Relationship in Telugu

Check out the details women avoid these mistakes in your relationship in Telugu. Take a look
Story first published: Tuesday, October 5, 2021, 15:28 [IST]