Latest Updates
-
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!
ఈ రాశి స్త్రీలు రిలేషన్ షిప్ లో పైచేయి సాధిస్తారట... మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?
ఈ రాశి స్త్రీలు రిలేషన్ షిప్ లో రూలింగ్ చేస్తూ ఉంటారని మీకు తెలుసా...
పురాణాల కాలం నాటి నుండి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో మహిళలంటే చాలా మందికి చిన్నచూపు ఉంది. శారీరకంగా, మానసికంగా వారు చాలా వీక్ గా ఉంటారనే చెడు అభిప్రాయం చాలా మందిలో బలంగా నాటుకుపోయింది.

మీకు కూడా ఇలాంటి అభిప్రాయం ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీరు ఊహించిన విషయాల కంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు.

ఒక్కసారి ఎవరైనా అమ్మాయి తలచుకుంటే వారి ముందు పురుషుల శక్తి ఏ మాత్రం సరిపోదు. ఎందుకంటే వారిలో అంత శక్తి దాగి ఉంది. మహిళలు శత్రువులుగా ఉండే రాజులాంటి వారికి కూడా చుక్కలు చూపించగలరు.

మహిళలు పాలిచ్చి పిల్లల్ని పెంచడమే కాదు.. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కూడా వారికి బాగా తెలుసు. అయితే ఇందుకోసం చరిత్రను మొత్తం తోడేసి చూడాల్సిన అవసరం ఏ మాత్రం అవసరం లేదు. నిత్యం మన చుట్టూ ఉండే మహిళలను చూస్తే చాలు. ఓ చేత్తో ఇంటి సంసారాన్ని.. మరో చేత్తో ఆఫీసు భారాన్ని.. ఇంకోవైపు పిల్లల బాధ్యతను చకచకా చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తారు కాబట్టే కొందరు మహిళలు రిలేషన్ షిప్ లోనూ అవలీలగా పైచేయి సాధిస్తారు. తాము చెప్పిందే శాసనం కావాలని కొందరు మహిళలు అంటూ ఉంటారు. ఇంతకీ అలాంటి స్త్రీలను ఎలా గుర్తుపట్టాలనుకుంటున్నారా? అలాంటి వారిని గుర్తించేందుకు జ్యోతిష్యశాస్త్రం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం ఈ ఏయే రాశి చక్ర స్త్రీలు ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి స్త్రీలు అకస్మాత్తుగా కోపం పెంచుకుంటారు. వీరు తీవ్రమైన వ్యక్తిత్వంతో కూడుకుని ఉంటారు. వీరు ప్రేమ విషయంలో సానుకూలంగా ఉండి.. సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొందరు మహిళలు సొంత అభద్రతలకు వ్యతిరేకంగా కొన్నిసార్లు పోరాటం చేస్తారు. ఇది వారి సంబంధం యొక్క ఆధిపత్యం చేపట్టేందుకు దారి తీస్తుంది. అందువల్ల వారు రిలేషన్ షిప్ ను గమనించకుండానే శాసించేస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి మహిళలు చాలా మంచివారు. వీరు కారణం లేకుండా ఎవరితోనూ వాదనకు దిగరు. అయితే వీరు ఏదైనా వాదనలో పాల్గొన్నప్పుడు మాత్రం చాలా ప్రమాదకరంగా మారతారు. చాలా విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. వీరి ఎదుట ఎవ్వరు ఉన్నప్పటికీ అస్సలు వెనక్కి తగ్గరు. దీంతో ఈ ప్రవర్తనే వారిని అత్యంత నియంత్రించే వ్యక్తిత్వంగా మారుస్తుంది.

సింహ రాశి..
ఈ రాశి స్త్రీలు కలయిక విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు. వీరు తమ సంబంధాల విషయంలో ఆధిపత్యం చెలాయించేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి మహిళలు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచలేరు. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి చక్రం మహిళలు చాలా విషయాల్లో భాగస్వామి గురించి మక్కువ పెంచుకుంటారు. వీరు తమ భాగస్వాములతో చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. వీరు నియంత్రణ మరియు ఆధిపత్యం ఉన్నట్లు అనిపించినప్పటికీ, వారు తమ భాగస్వాములను చాలా ప్రేమించడమే దీనికి కారణం. అయితే ఇలాంటి వాటి వల్లే వీరు తమ సంబంధాల్లో చాలా సార్లు అనుమానస్పదంగా వ్యవహరిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి స్త్రీలు, వారి వ్యక్తిగత స్వేచ్ఛ మరియు వారు కోరుకున్నది సాధించేంత వరకు అస్సలు కాంప్రమైజ్ కారు. వీరు ఇతరుల గురించి ఎక్కువగా పట్టించుకోరు. వారి పనేంటో వారు చూసుకుంటారు. రిలేషన్ విషయంలో కూడా తమ వైఖరి ‘నేను పట్టించుకోను' అనే విధంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు వీరు భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారు.

మకర రాశి..
ఈ రాశి స్త్రీలు రిలేషన్ షిప్ విషయానికొస్తే చాలా సహేతుకంగా వ్యవహరిస్తారు. వీరు ఆచరణాత్మక విషయాల గురించే పట్టించుకుంటారు. అందువల్ల వీరు అనవసరమైన నాటకం మరియు ప్రకోపాలకు దూరంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. దీని వల్ల వీరు కొన్నిసార్లు వారి భాగస్వామి యొక్క భావోద్వేగాలకు రహస్యంగా ఉదాసీనంగా అనిపించేలా చేస్తుంది. అలాగే రిలేషన్ షిప్ లో వీరే పైచేయి సాధించేలా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
