For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగాళ్లను అట్రాక్ట్ చేసేందుకు.. ఇలాంటి చిలిపి పనులు చేస్తున్నారా?

|

ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. మనకు ఏది కావాలన్నా.. కేవలం ఒక్క క్లిక్ తో మన కళ్ల ముందు ఉంటోంది. గుండుసూది నుండి గుమ్మడికాయ వరకూ.. బట్టల నుండి బంగారం వరకూ అన్నీ ఆన్ లైనులోనే అందుబాటులో ఉంటున్నాయి. అయితే మనం అక్కడితో ఆగిపోలేదు.

మన మనసుకు నచ్చే వ్యక్తిని సైతం ఆన్ లైనులోనే అన్వేషించుకునే స్టేజీకి వచ్చేశాం. ఇందుకోసమే ఎన్నో డేటింగ్ యాప్స్ కూడా పుట్టొచ్చాయి. అయితే ఇందులో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ గా ఉంటున్నట్లు పలు సర్వేల్లో తేలింది. కానీ అబ్బాయిలను ఆకర్షించాలనే ఆత్రుతలో కొందరు అమ్మాయిలు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. .

ఈ కారణాల వల్ల తమ మనసుకు నచ్చిన అబ్బాయిలను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మీరు నిజంగా, నిజాయితీగా అబ్బాయిని ఇష్టపడుతుంటే.. మీకు కోరుకున్న వారు దక్కాలంటే.. మగవారు మీ వెంట పడాలంటే.. ఈ పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి...

పెళ్లికి ముందు అప్సరసలా... కానీ పెళ్లి తర్వాతే.. తనపై ఫీలింగ్సే రావట్లేదు...! మొత్తం మేకప్ వల్లేనా...!

లోలోపల మురిసిపోతూ..

లోలోపల మురిసిపోతూ..

సాధారణంగా ఎవరైనా మగవారు వెంటబడితే, మహిళలు బాగా తిట్టుకుంటారు లేదా కొందరు నేరుగా తిట్టేస్తారు. కానీ అదంతా కాసేపే. వాస్తవానికి, చాలా మంది అమ్మాయిలు తమను ఎవరైనా చూస్తున్నారని తెలిసినా.. తమ వెంట పడుతున్నారని తెలిసినా లోలోపల తెగ మురిసిపోతారంట. వారిని తమవైపు తిప్పుకోడానికి.. వారు తమ పట్ల ఆకర్షితులవ్వడానికి మరింత అందంగా తయారవుతారట.

కొన్ని పొరపాట్లు..

కొన్ని పొరపాట్లు..

అయితే చాలా మంది మహిళలు మగవారిని అట్రాక్ట్ చేయాలనే ఆత్రుతలో కొన్ని పొరపాట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కారణాల వల్ల వారు ఆకర్షణకు లోనయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

చూపులకే..

చూపులకే..

అమ్మాయిలు అనుకున్నట్టు.. ఎక్కువగా అందంగా ఉండే వారి పట్ల అబ్బాయిలు అవలీలగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా డేటింగ్ విషయంలో ఇది కచ్చితంగా ఫాలో అయిపోతారు. అయితే ఇక్కడ ఎక్కువగా చూపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అమ్మాయిలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. అందుకే మగవారిని ఆకర్షించేందుకు కేవలం అందం మీదే ఫోకస్ పెడితే ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

‘నా భర్త అస్తమానం పాస్ వర్డ్ మారుస్తున్నాడు.. అలా చేస్తే నాకెందుకో...'

ఇవి గుర్తంచుకోండి..

ఇవి గుర్తంచుకోండి..

మీ అందం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే అందంతోనే అబ్బాయిలను శాశ్వతంగా అట్రాక్ట్ చేయలేరు. అయితే ఈ అందం తొలిచూపులో ఆకర్షించడానికి, ప్రేమలో దిగేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అదే మీరు పవిత్రమైన ప్రేమను నిజాయితీగా అందిస్తే.. మీ అందం తగ్గినా కూడా, మీ ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మీ పార్ట్ నర్ ను ఆకర్షించడంలో ప్రేమ, కేరింగ్ వంటివి అందం కంటే ఎక్కువగా ఉపయోగపడతాయి.

నిజాయితీగా ప్రేమిస్తే..

నిజాయితీగా ప్రేమిస్తే..

చాలా మంది అమ్మాయిలు డబ్బు, మంచి ఉద్యోగం, అందం ఉన్న వారినే ప్రేమించాలి.. పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అయితే ఇవి లేని వాళ్లు నిజాయితీగా ప్రేమిస్తున్నామని చెప్పినా.. ఏ మాత్రం కేర్ చేయరు. అయితే మీరు మగవారిలో నిజాయితీగా ప్రేమించిన వారిని వదులుకుంటే.. మోసపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి.

కష్టపడే వారినే..

కష్టపడే వారినే..

మీరు కేవలం అందం, డబ్బు, ఉద్యోగం చూసి ప్రేమిస్తే.. వారు నిజాయితీగా ఉంటారని చెప్పలేం. కానీ నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వారైతే.. మీకు అందం లేకపోయినా.. మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునే అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే అబ్బాయిల్లో అందం, డబ్బు కాకుండా నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, కష్టపడేతత్వం ఉన్నవారినే ఎంచుకుంటే బెటర్.

‘నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!'

రెచ్చగొట్టడం చేయొద్దు..

రెచ్చగొట్టడం చేయొద్దు..

కొందరు అమ్మాయిలు తమ వెంట చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని.. తమకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలా చెప్పడం వల్ల తాము ఇష్టపడే అబ్బాయి ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుంటారని భావిస్తారు. కానీ, ఇది అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వదు. కొందరు మగవారికి ఈగో ఎక్కువగా ఉంటుంది. అలాంటి కారణాల వల్ల మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి వారి మరో కుర్రాడితో కలిసి రెచ్చగొట్టడం వంటివి చేయొద్దు.

తమ కంట్రోల్ లోనే...

తమ కంట్రోల్ లోనే...

చాలా మంది అమ్మాయిలు.. తాము ప్రేమించిన వారు లేదా పెళ్లాడిన భర్తలంతా తమ కంట్రోల్ లో ఉండాలని భావిస్తారు. అక్కడితో ఆగకుండా కొంత ఆధిపత్యం కూడా చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటివి మగవారికి అస్సలు నచ్చదు. కాబట్టి కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించాలి. ఇలాంటి వారినే మగవారు ఎక్కువగా ఇష్టపడతారు.

అవగాహన ఉండాలి..

అవగాహన ఉండాలి..

కొందరు అమ్మాయిలు తమ ఇష్టాలను బలవంతంగా అబ్బాయిలపై రుద్దుతుంటారు. అయితే ప్రతి విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. ఒకసారి మీకు నచ్చింది చేస్తే.. మరోసారి వారికి నచ్చింది చేయాలి. అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మీ బంధం మరింత బలంగా మారుతుంది.

మీకు ఫిదా అవ్వాలంటే..

మీకు ఫిదా అవ్వాలంటే..

మరి కొందరు అమ్మాయిలు తమ మనసుకు నచ్చిన అబ్బాయిల కోసం తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి పూర్తిగా మారిపోతూ ఉంటారు. అలా మారడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. కాబట్టి మీకు నచ్చినట్టుగానే ఉంటూ.. వారికి నచ్చేలా మార్చుకుంటే... మగవారు మీకు కచ్చితంగా ఫిదా అయిపోతారు.

English summary

Women Think These Behaviours Attract Men but They Don't in Telugu

Here we are talking about the Women think these behaviours attract men but they don't in Telugu. Have a look,