For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ కు మించి సన్నిహితంగా ఉండేందుకు గల మార్గాలేంటో చూడండి...

|

ఆలుమగలు లేదా ప్రేమికులిద్దరి మధ్య సంబంధం సన్నిహితంగా ఉండాలంటే అందుకు కేవలం శృంగారమే మార్గం అని అందరూ అనుకుంటారు.

ప్రతి ఒక్కరి మనసులోనూ రతి క్రీడ గురించే ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అయితే మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని కేవలం శృంగారం మాత్రమే పెంచుతుంది అనుకుంటే అది పొరపాటే.

శృంగారం అనేది కేవలం శారీరకంగా మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. అయితే ప్రతిసారీ ఇదే చేస్తుంటే కచ్చితంగా బోర్ కొడుతుంది.

ఇలాంటి సందర్భాలలో మీ ఇద్దరి సంబంధంలో మరింత సాన్నిహిత్యం పొందాలంటే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

ఈ చిట్కాలను పాటిస్తే స్త్రీలు ఉత్తమ ఉద్వేగం పొందడం ఖాయమంటున్న నిపుణులు...!

లైవ్ మ్యూజిక్...

లైవ్ మ్యూజిక్...

మిమ్మల్ని మీరు సజీవంగా ఉంచుకోవడానికి గొప్ప ఆయుధం సంగీతం. ఇది మిమ్మల్ని రతి క్రీడ మూడ్ లోకి తీసుకెళ్లడమే కాదు.. మీలో కొత్త శక్తిని కూడా నింపుతుంది. ఎందుకంటే సంగీతం ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతుంది.

మూన్ లైట్ వాక్...

మూన్ లైట్ వాక్...

మీ ఇద్దరు కలిసి మూన్ లైన్ వాక్ చేయండి. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అయితే మీరు నడుస్తున్న ప్రదేశం సరైనదే అని గుర్తుంచుకోండి. అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీపై ఎక్కువ శ్రద్ధ వహించండి. అలా మీరిద్దరూ చేతుల్లో చేయి వేసుకుంటూ కలిసి నడిస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది.

సల్సా డ్యాన్సు...

సల్సా డ్యాన్సు...

కామసూత్రాలలో ఉన్న ఈ రహస్యాలను స్త్రీలు తప్పక తెలుసుకోవాలి...!సంగీతం తర్వాత మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెంచేది సల్సా డ్యాన్సు. ఇది మీ ఇద్దరిని కచ్చితంగా దగ్గర చేస్తుంది. మీరిద్దరూ కలిసి ఇంకా ఏదో ఒకటి కొత్తదాన్ని నేర్చుకుంటారు. ఇది శరీర భాషగా కూడా ఉపయోగపడుతుంది.

కామసూత్రాలలో ఉన్న ఈ రహస్యాలను స్త్రీలు తప్పక తెలుసుకోవాలి...!

లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం..

లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం..

ఇప్పుడిప్పుడే కరోనా లాక్ డౌన్ నుండి విముక్తి లభించి, అందరూ రోడ్లపైకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరూ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరిద్దరూ లాంగ్ డ్రైవ్ కు వెళ్లండి. అప్పుడు మీఇద్దరికీ చాలా సరదాగా ఉంటుంది. అది ఎంత రొమాంటిక్ గా ఉందో ప్రత్యక్షంగా చూడండి.

లవ్ లెటర్ రాయండి..

లవ్ లెటర్ రాయండి..

మీరు చదువుకునే రోజుల్లో ఎవరినో ఒకరి చూసి ప్రేమలో పడటం అనేది కచ్చితంగా జరిగే ఉంటుంది. అప్పుడు మీరు లవ్ లెటర్ వంటివి రాసే ఉంటారు. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించిన విషయం. సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించిన ఈరోజుల్లో మీ కోరికలను మీరు కాగితంపై ఉంచడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

మూవీ నైట్..

మూవీ నైట్..

మూవీ నైట్ అంటే సినిమా థియేటర్లకు వెళ్లడం.. సెకండ్ షోలకు వెళ్లడమే కాదు.. ఇంట్లో కూర్చొని కూడా మూవీ నైట్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వంటివి కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి మీ ఇంట్లోనే మంచం మీద మీరిద్దరూ కూర్చొని, పాప్ కార్న్ తింటూ మీ ఇద్దరికిష్టమైన సినిమాలను కలిసి చూడండి. అయితే కామెడీ మూవీని చూసేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మీరిద్దరూ కలిసి చాలా ఎక్కువగా నవ్వుకోవచ్చు. మీ ఇద్దరికి ఇది రొమాంటిక్ గా కూడా ఉంటుంది.

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

క్యాండిల్ డిన్నర్..

క్యాండిల్ డిన్నర్..

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలా వరకు రెస్టారెంట్లు, హోటళ్లు తెరచుకోవడం లేదు. కాబట్టి మీరు మీ భాగస్వామితో కలిసి మీ ఇంటి బాల్కనీలో లేదా ఏదైనా మంచి ప్రదేశంలో క్యాండిల్ డిన్నర్ చేస్తే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

మసాజ్...

మసాజ్...

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లు చాలా వరకు మూతపడ్డాయి. కాబట్టి మీరిద్దరూ ఒకరికొకరు ఇంట్లోనే ఉంటూ మసాజ్ చేసుకోండి. ఇది మీ ఇద్దరికి రొమాంటిక్ గా ఉండటమే కాదు.. మీకు ఎంతో రిలీఫ్ కూడా ఇస్తుంది. మీరు చాలా రిఫ్రెష్ కూడా అవుతారు. దీని వల్ల మీరు కచ్చితంగా సన్నిహితంగా ఉంటారు.

జస్ట్ స్లీప్..

జస్ట్ స్లీప్..

వినడానికి వింతగా ఉందా? అయితే ఇది వింత ఏమీ కాదు. కలసి పడుకోవడం కూడా పగటిపూట మీ ఇద్దర్ని మరింత దగ్గర చేస్తుంది. ఈ ప్రపంచమంతా పనిలో బిజీగా ఉన్నప్పుడు.. మీరిద్దరూ ఒకరినొకరు హాయిగా కౌగిలించుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటే.. మీ బంధం మరింత బలోపేతమవుతుంది.

English summary

You can do these things other than sex with your guy in telugu

Here we talking about you can do these things other than sex with your guy in telugu. Read on.
Story first published: Monday, June 29, 2020, 19:11 [IST]