Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మీ రాశిని బట్టి రొమాన్స్ తర్వాత ఎలా ప్రవర్తిస్తారో తెలుసా...
మీ రాశిని బట్టి ఆ కార్యం తర్వాత ఏమి చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి అయిన ప్రతి ఒక్కరూ ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అప్పటివరకూ ఒంటరిగా గడిపిన తాము తమ భాగస్వామితో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయాలనే ఉత్సాహంలో కొందరు తమ పార్ట్ నర్ వెనుక నుండి గట్టిగా హత్తుకుంటారు.

మరికొందరు ఆ కార్యంలోపాల్గొన్నంతసేపు హుషారుగా ఉండి, ఆ వెంటనే నీరసపడిపోతారు. మరికొందరు రొమాన్స్ తర్వాత పోస్ట్ ప్లే చేస్తుంటారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తనలకు రాశిచక్రాలకు రిలేషన్ ఉందంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. గ్రహాల ఆధారంగా మీ రాశిచక్రం ప్రకారం మీరు రొమాన్స్ తర్వాత ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడే తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారు ఆ కార్యంపై చాలా విశ్వాసంతో ఉంటారు. అందుకే వీరు బెడ్ రూమ్ లో భాగస్వామితో బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు వీరు రొమాన్స్ లో ప్రయోగాలను బాగా ఇష్టపడతారు. ఏదైనా విషయం పీక్స్ కు చేరుకుంటే.. అక్కడితో ఆగకుండా కనీసం నాలుగైదు సార్లైనా అది కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు ఆ కార్యంలో పాల్గొన్న కూడా తొలిసారి మాదిరిగా చాలా బలంగా ఉంటారు. అందుకే వీరి పార్ట్ నర్ కోఆపరేట్ చేస్తే చాలు వీరు రొమాన్స్ లో స్వర్గాన్ని చూసేస్తారు.

వృషభరాశి..
ఈ రాశి వారు ఆ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరు ఎప్పుడైతే రొమాన్స్ లో పాల్గొంటారో ఆ తర్వాత తమ పార్ట్ నర్ హగ్ లో అలా ఉండిపోవాలని కోరుకుంటారు. అలా తమ పార్ట్ నర్ కౌగిలించుకుని ఉదయం వరకు నిద్రపోతారు. అలాగే వీరు తమ పార్ట్ నర్ తో మసాజ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతారు.

మిధున రాశి..
ఈ రాశి వారు రొమాన్స్ పాల్గొన్న తర్వాత తమ పార్ట్ నర్ గురించి రహస్యాలను తెలుసుకునేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. వీరు రొమాన్స్ తో పాటు లైఫ్ లోని ఇతర విషయాలపైనా ఆసక్తి చూపుతారు. తమ భాగస్వామి మిగిలిన విషయాలను తెలుసుకోవాలని భావిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు వాస్తవానికి రొమాన్స్ ఒక్కటే కాదు.. ఆ తరువాతి సమయాన్ని అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. బెడ్ రూమ్ లో భాగస్వామికి కావాల్సినంత ఆనందాన్ని పంచుతారు. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రతి చిన్న విషయాన్ని మధురమైన క్షణంగా మార్చుకోవాలని భావిస్తారు. వీరి సెన్సిటివ్ ప్రవర్తనతో పార్ట్ నర్ ను మరింత ఆనందంగా ఉంచుతారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ నటనను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా బెడ్ రూమ్ లో అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరు ఎవరు రొమాన్స్ లో పాల్గొంటున్నారనే విషయం కాకుండా, ఇతరులతో కూడా చాటింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. అంతేకాదు తమ పార్ట్ నర్ ఫీలింగ్స్ ను ఎక్కువగా పట్టించుకోరు. వీరు బెడ్ రూమ్ లో కేవలం కిక్ ను మాత్రమే కోరుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు కేవలం వాస్తవాలకే ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఊహాలోకానికి చాలా దూరంగా ఉంటారు. అందుకే వీరు బెడ్ రూమ్ లో రొమాన్స్ విషయంలో చాలా పరిణితి కలిగి ఉంటారు. వీరు తమ పార్ట్ నర్ ను బట్టి తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ రొమాన్స్ తర్వాత మరో అవకాశం వచ్చినా అస్సలు వదలరు.

తుల రాశి..
ఈ రాశి వారు రొమాన్స్ తర్వాత ఎక్కువగా ముచ్చట్లు చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎదుటి వారిని నమ్మాలంటే.. వారి విలువలు, నమ్మకాలు, ఆలోచించే విధానాలు మిమ్మల్ని వారిని ఇష్టపడేలా చేస్తాయి. అందుకే వీరు రొమాన్స్ తర్వాత ముచ్చట్లు కలిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు రొమాన్స్ చేసే సమయంలో బెడ్ రూమ్ లో.. దాని తర్వాత మరో వ్యక్తితో ఇంకో గదిలో రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వీరు ఎక్కువగా బెడ్ రూమ్ లోనే ఆ కార్యం చేసేందుకు ఇష్టపడతారు. అందుకే వీరు రొమాన్స్ తర్వాత మళ్లీ మళ్లీ అలాంటి ఆనందం కావాలని కోరుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు చాలా వినూత్నంగా, హాస్యపూరితంగా ఉంటారు. వీరిని రొమాన్స్ లో పాల్గొనేలా చేసేందుకు చాలా సులభంగా ప్రయత్నించొచ్చు. అయితే వీరు రొమాన్స్ తర్వాత కబుర్లు చెప్పడం కంటే కునుకు తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఆ మరుసటి రోజు నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొమాన్స్ లో పాల్గొంటారు.

మకర రాశి..
ఈ రాశి వారు రొమాన్స్ విషయంలో చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఒకవేళ ఏదైనా అనుకోని సందర్భంలో పెద్దగా తెలియని వ్యక్తులతో ఆ కార్యంలో పాల్గొనాల్సి వస్తే.. ఆ తర్వాత వెంటనే అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు. అంతేకాని రొమాన్స్ గురించి ఎక్కడ ఇబ్బంది పడేలా వ్యవహరించరు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వీరు రొమాన్స్ తర్వాత తమ భాగస్వామిని హత్తుకుని నిద్రపోవాలని భావిస్తారు. దీని వల్ల మళ్లీ ఆ కార్యానికి సిద్ధం కావొచ్చని అనుకుంటూ ఉంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు భాగస్వామిపై ఎక్కువ ప్రేమ చూపుతూ ఉంటారు. అందుకే వీరు రొమాన్స్ గురించి ఎక్కువగా చర్చించడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా తమ పార్ట్ నర్ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఇలాంటి వారు రొమాన్స్ తర్వాత మాట్లాడటం అనేది చాలా ముఖ్యం. ఈ అలవాట్లు కారణంగా వీరు మరింత భావోద్వేగంగా, రసవత్తరంగా మారుతూ ఉంటారు.



Click it and Unblock the Notifications











