Latest Updates
-
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..
ఈ రాశుల వారు ఆ విషయాల్లో నిగ్రహంగా ఉండలేరట...! ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారట...
ఈ రాశిచక్రాల వారు సులభంగా ఆందోళన చెందుతారట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్రాల వారు పలు సందర్భాలలో అర్థం లేని విషయాల పట్ల ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు.

వీరు చిన్న చిన్న విషయాలకే ఏదో పెద్ద నష్టం జరిగినట్టు, ఈ లోకంలో కేవలం తమకు ఒక్కరికే సమస్య ఎదురైనట్టు అసౌకర్యానికి గురవుతారు.

చాలా విషయాల్లో ఓపికగా వ్యవహరించకుండా.. చిరాకు పడుతూ ఉంటారు. తక్కువ సహనం కలిగి ఉంటారు. అంతేకాదు సులభంగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. దీని వల్ల వారి చుట్టూ వాతావరణం అంతా ప్రతికూలంగా మారుతూ ఉంటుంది.

ఇంతకీ అలా చాలా వేగంగా ఆందోళన చెందే రాశిచక్రాలేవి.. వారు ఎందుకని అలా ప్రవర్తిస్తారు.. వారికి ఎందుకని ఎక్కువగా కోపం, ఆందోళన, చిరాకు వంటివి వస్తుంటాయి. వారు ఎందుకని కలత చెందుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభరాశి..
ఈ రాశి వారు చూడటానికి చాలా ప్రశాంతంగా మరియు ఎంతో సహనంతో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం నిగ్రహం కోల్పోతారు. ప్రత్యేకించి వీరిని ఏదైనా విషయంలో కొంచెం రెచ్చగోడితే చాలు.. వీరు పూర్తిగా అదుపుతప్పి ప్రవర్తిస్తారట. వీరిని కంట్రోల్ చేయడం కొంత కష్టంగా మారుతుందట.

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో నిగ్రహాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి వీరు అసౌకర్యంగా, ఏదో కోల్పోయినట్టు ఫీలవుతుంటారు. వీరిని ఎవరైనా ఇబ్బందిపెడితే మాత్రం అరిచి గోల గోల చేస్తారు. వీరు చాలా విషయాల్లో ఆందోళన పడుతూ చిరాకుగా ఉంటారు. వీరికి బాధ నుండి ఎలా బయటకు రావాలో అనే విషయం గురించి పెద్దగా అవగాహన ఉండదు.

కన్యరాశి..
ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా బలంగా ఉంటారు. ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనుకుంటారు. అలాగే కొన్ని పనులను అప్పటికప్పుడు చేసేస్తుంటారు. అయితే వారు అనుకున్న విషయాలు సమయానికి అవ్వకపోతే, వీరికి కోపం బాగా వస్తుంది. అయితే అలాంటి సందర్భాల్లో వీరు బాగా పని చేస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చాలా సందర్భాలలో దూకుడుగా ఉంటారు. అయితే వీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వంటివి చేయరు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగరు. అయితే ఏదైనా సందర్భంలో కచ్చితంగా అవసరమని అనిపిస్తే మాత్రం వాదనకు దిగుతారు. కానీ ఆందోళన వంటి సందర్భంలో దాని నుండి తప్పించుకునేందుకు చిన్నగా ప్రయత్నిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. దీని కారణంగా చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడతారు. అయితే వీరు, గొడవలను నివారించడాన్ని మాత్రం బాగా ఇష్టపడతారు. ఏదైనా విషయంలో అవసరం అనుకుంటే తమను తాము నియంత్రించుకోగలుగుతారు. కానీ త్వరగా కోపం తెచ్చుకుంటారు. అదే సమయంలో వేగంగానే ప్రశాంతంగా మారిపోతారు.



Click it and Unblock the Notifications
