Latest Updates
-
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వారు గాసిప్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంట...!
ఈ రాశి చక్రాల వారు గాసిప్ లను బాగా ఎంజాయ్ చేస్తారని మీకు తెలుసా.
మనలో కొంతమంది వ్యక్తులు ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. మరికొంతమంది ఏ విషయాన్ని అయినా అస్సలు బయటకు చెప్పరు. ఇంకా కొందరు మాత్రం ప్రతి విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా బయటకు చెప్పేస్తుంటారు.

అంతటితో ఆగకుండా ఇతరుల గురించి గాసిప్స్ చెబుతూ ఉంటారు. ఇతరులకు ఇది ప్రతికూలంగా అనిపించినప్పటికీ, అలాంటివేవీ పట్టించుకోకుండా.. దీన్నే అలవాటుగా మార్చుకుని ఆనందిస్తుంటారు.

వీరు వీరికి తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన విషయాలను సైతం బయటకు చెప్పేస్తుంటారు. అందుకే ఇలాంటి స్నేహితులు లేదా వ్యక్తులు ఎవరైనా మీ మధ్య ఉంటే, వారితో రహస్యాలు పంచుకునే ముందు ఓసారి ఆలోచించండి. లేదంటే మీరు ఇబ్బందులు పడతారు.

ఇంతకీ ఇలాంటి వారినెలా గుర్తుపట్టాలా అని ఆలోచిస్తున్నారా? అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సహాయం తీసుకోండి. గాసిప్స్ స్ప్రెడ్ చేసే రాశి చక్రాల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.. ఈ సందర్భంగా ఆ రాశిచక్రాల వ్యక్తులెవరో ఇప్పడు తెలుసుకుందాం.

మిధున రాశి..
ఈ రాశి వారు గాసిప్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ స్నేహితులతో చాలా విషయాలను రహస్యంగా ఉంచుతామని వాగ్దానం చేస్తారు. కానీ సీక్రెట్ గా ఉంచాల్సిన విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. వీరు కొన్ని సందర్భాల్లో రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తుంటారు. అయితే వీరు ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకుండా, మీపై నిజమైన సానుభూతిని చూపించేందుకు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు గాసిప్స్ ను బాగా ఆనందిస్తారు. వీరు ఏ సందర్భంలో అయినా.. ఎలాంటి విషయంలో అయినా ఏ మాత్రం భయం లేకుండా, చాలా ఓపెన్ గా విషయాలను చెప్పేస్తూ ఉంటారు. అయితే వీరు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య విషయాలను వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు. న్యాయం ఎటువైపు ఉంటే, దానికే కట్టుబడి ఉంటారు. అయితే వీరు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు. సీక్రెట్ మ్యాటర్స్ విషయంలో ఈ రాశి వారిని పూర్తిగా విశ్వసించవచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఏదైనా గాసిప్స్ లేదా నటించడాన్ని బాగా ఇష్టపడతారు. అయితే వీరు ఎవ్వరికీ అర్థం కాని విధంగా చిన్నగా నాటకంలో భాగం కాగలరు. అయితే వీరికి ఉండే గాసిప్పుల అలవాటు వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని కలగదు. అయితే వీరు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే గాసిప్స్ చేస్తుంటారు. అదేవిధంగా ఏదైనా రహస్యాలను కూడా ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. కాబట్టి వీరిని సీక్రెట్స్ వంటి విషయాల పట్ల విశ్వసించవచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారు స్నేహితుల విషయాలలో గాసిప్ లను బాగా ఇష్టపడతారు. అయితే వీరు అందరికీ న్యాయమైన తీర్పు ఇవ్వడంలో న్యాయంగా ఉంటారు. అయితే వీరి గురించి ఎవరైనా గాసిప్ చేస్తే వాటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ తమ పనిపైనే ఎక్కువ శ్రద్ధ వహించడంలో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి వీరిని సీక్రెట్స్ విషయాల్లో విశ్వసించవచ్చు.



Click it and Unblock the Notifications
