Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు బెస్ట్ కపుల్ గా నిలుస్తారట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో ఏ రాశుల వారికి సరైన జోడి కుదురుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
పెళ్లి అనే ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. కళ్యాణం అనే కమనీయ వేడుకతో మన జీవితంలో ఓ కొత్త వ్యక్తి చేరిపోతారు. ప్రతి ఒక్కరు అలాంటి క్షణాల కోసం ఎంతో ఆశతో ఎదరుచూస్తుంటారు.

కరోనా కారణంగా ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు ఆగిపోయాయి..కొందరు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తక్కువ మంది అతిథులతో వివాహ కార్యక్రమాన్ని ముగించేశారు. ఈ నేపథ్యంలోనే మనమంతా ఆంగ్ల నూతన సంవత్సరం 2022లోకి అడుగు పెట్టేశాం.

కొత్త ఏడాదిలో కొత్త కొత్త రిజల్యూషన్స్.. కొత్త ఆశలు.. ఆశయాలన్నీ నెరవేరాలని కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమికులు ఈ ఏడాదిలో తమ ప్రేమ ప్రయాణం పరిణయం దాకా వెళ్లాలని ఆశిస్తున్నారు.

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి 2022 సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.. ఎవరికి ప్రేమ విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి.. ఏ రాశి వారు ఉత్తమ జోడిగా మారే అవకాశం ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృశ్చికం-వృషభం..
ఈ రెండు రాశుల వారు 2022 సంవత్సరంలో ఉత్తమ జోడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. వీరిద్దరూ కలవడం చాలా లక్కీగా భావిస్తూ ఉంటారు. ఈ రెండు రాశుల వారి ఐడియాలు, అభిరుచులు, ఆశయాలు, అలవాట్లు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. దీంతో వీరిద్దరూ చాలా త్వరగా ప్రేమలో పడిపోతారు. అంతే వేగంగా పరిణయం దాకా సాగిపోతారు. అయితే ఈ రాశుల వారు అసత్యాలను అస్సలు ఇష్టపడరు. అంతేకాదండోయ్ వీరిద్దరూ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటారు.

మిధునం-కుంభం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో మిధున రాశి.. కుంభ రాశిల జోడి అత్యుత్తమంగా ఉంటుంది. ఈ రెండు రాశుల వారు పూర్తి నిజాయితీ.. నిబద్ధత గల ప్రేమను పొందుతారు. ఈ రాశుల వారు చాలా తెలివిగా ఉంటారు. వీరిద్దరి మధ్య ముచ్చట్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఈ కాలంలో వీరిద్దరూ పనికొచ్చే విషయాలను మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. వీరు ప్రతి విషయంలో.. ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. అందుకే వీరిద్దరు ఈ ఏడాదిలో ఉత్తమ జోడిగా మారొచ్చు.

సింహం-ధనస్సు..
ఈ రెండు రాశులలో సింహ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అయితే తమ జీవిత భాగస్వామి పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. ధనస్సు రాశి వారు కూడా చాలా ఫన్నీగా ఉంటారు. అందుకే వీరిద్దరి జోడి ఉత్తమమైనదిగా నిలిచిపోవచ్చు. ఈ రెండు రాశుల జోడి చూడ ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు వీరిద్దరూ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేస్తారు.

కర్కాటకం-మీనం..
ఈ రెండు రాశుల వారిలో చాలా వరకు ఒకటే లక్షణాలు ఉంటాయి. వీరు తమ ఆలోచనలను, అభిరుచులను, అలవాట్లను తమ భాగస్వామిలో ఉండాలని కోరుకుంటారు. అందుకే ఈ రాశి వారికి ప్రతి ఒక్కటి సరిగ్గా సూటవుతుంది. వీరిద్దరూ తాము ఏదైతే కోరుకుంటారో.. అది చాలా సులభంగా లభిస్తుంది. అంతేకాదు వీరిద్దరూ ఇతరులకు సహాయం చేయడంలోనూ ముందుంటారు. వీరి తమ జీవితానికి సంబంధించి ఏం కావాలి.. ఏది వద్దనే విషయాల్లో చాలా స్పష్టత ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఉత్తమ జోడిగా మారొచ్చు.

మకరం-కన్య..
ఈ రెండు రాశుల వారిని కూడా ఉత్తమ జోడిగా చెప్పొచ్చు. వీరద్దరికీ త్యాగం చేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకున్నా.. లేదా పెళ్లి చేసుకున్నా తమ జీవితాలను ఒకరికొకరు అన్నట్లు మార్చుకుంటారు. వీరు తమ భాగస్వామినే మొత్తం ప్రపంచం అని ఫీలవుతూ ఉంటారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిల్చుకుంటారు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో ముందుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో ఉత్తమ జోడిగా మారే రాశిచక్రాలు ఇలా ఉన్నాయి. మీనరాశి-కర్కాటకరాశి, సింహరాశి-ధనస్సు రాశి, కన్య రాశి-మకర రాశి, మిధున రాశి-కుంభ రాశి,వృశ్చిక రాశి-వృషభ రాశి వారు ఉత్తమ జోడిగా మారే అవకాశం ఎక్కుగా ఉంది.



Click it and Unblock the Notifications
