For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి వారు క్షమాపణ చెప్పడంలో ముందుంటారు... మీ రాశి ఉందేమో చూడండి...!

|

''నోరు మంచిది అయితే ఊరు మంచిది'' అవుతుంది అనే సామెతను ఆయా సందర్భాల్లో మీరు వినే ఉంటారు. మనం ఎవరితో అయినా సంబంధంలో అయినా లేదా ఇంకా ఏ విషయంలో అయినా నిజాయితీగా ఉంటే, ఎదుటి వ్యక్తి కూడా మనతో అలాగే ఉంటారు.

అందరూ అలా ఉండకపోయినా కనీసం కొందరైనా అలా ఉంటారు. అలా ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ బలాలు, బలహీనతలు కచ్చితంగా ఉంటాయి. అయితే కొందరికి పుట్టుకతోనే కొన్ని బలహీనతలు వచ్చి ఉంటాయి. ఎవరైతే వారి బలహీనతల గురించి తెలుసుకుని..

వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే వారి జీవితంలో కొన్ని మార్పులు అనేవి రావచ్చు. అయితే ఎవరైతే తమ బలహీనతలను మార్చుకోరో వారి జీవితాలు జీవితాంతం అలాగే ఉండిపోతాయి. ఈ సంగతిని పక్కనబెడితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్రాల వారు క్షమాపణ చెప్పడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు.

ఎందుకంటే అలా చెప్పడం వల్ల తమకు ప్రయోజనాలు లభిస్తాయని వారు కచ్చితంగా నమ్ముతారట. అందుకే వారు కొన్ని సందర్భాల్లో వారి తప్పు లేకపోయినా తామే బాధ్యత తీసుకుని మరీ క్షమాపణ చెబుతుంటారు. అయితే కొన్ని రాశుల వారు అందరితో సౌమ్యంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటూ ఉంటారు. ఇంతకీ ఏయే రాశుల వారు ఇలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి....

వృషభ రాశి....

ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు మొండిగా ఉంటే, తప్పును అంగీకరించడం మీకు కష్టమవుతుంది. క్షమాపణ కోసం ఈ రాశి చక్రం వారు తప్పును గుర్తించడమే కాకుండా, వారు దానికి పూర్తి బాధ్యతను కూడా తీసుకుంటారు. సాధారణంగా చాలా మంది క్షమాపణ చెబితే తాము ఏదో కోల్పోయినట్టు ఫీలవుతుంటారు. కానీ ఈ రాశి వారు క్షమాపణ చెప్పడం తమ బలం మరింత పెరుగుతుందని భావిస్తారు. అంతేకాదు క్షమాపణ చెప్పడం ఇతరుల బాధ్యత అని కూడా వీరు భావిస్తారు.

కుంభరాశి..

కుంభరాశి..

ఈ రాశి వారు క్షమాపణ చెప్పడాన్ని గర్వంగా ఫీలవుతారు. వీరు క్షమాపణ చెప్పడం వల్ల ఏదో తప్పు చేశామని తెలుసుకుంటారు. వీరు క్షమాపణ చెప్పడం వల్ల పరిస్థితి సజావుగా సాగేందుకు.. పరిస్థితులు సాధారణంగా మారతాయి. వీరు క్షమాపణ చెప్పకపోతే, ప్రతిదీ సున్నితంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. వీరు క్షమాపణ వంటివి చెప్పడంలో అహం వంటి వాటిని లెక్క చేయరు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. వీరు బహిరంగంగా క్షమాపణ చెప్పడం వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు. అయితే పరిస్థితుల నుండి ప్రభావం బయటపడేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెబుతుంటారు. ఈ రాశి చక్రం వారు వీరు తప్పు లేకపోయినా కూడా కొన్నిసార్లు ఇతరుల తప్పును వారి నెత్తిన వేసుకుంటారు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు క్షమాపణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వీరు ఎవరినీ అంత సులభంగా క్షమించరు లేదా వీరు ఎవరికైనా క్షమాపణ అడగడానికి, ఆ వ్యక్తి తగిన అర్హుడా కాదా అనేది చూస్తారు. వీరు తమను తాము రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గంగా క్షమాపణను అడుగుతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంటారు. వీరు క్షమాపణ చెప్పడం ద్వారా దూరమైన తమ సంబంధాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వీరు ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ అడగటంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అస్సలు తిరస్కరణకు అనేదే గురవ్వరు. వీరు క్షమాపణ చెప్పడం ద్వారా తగిన అనుభూతి చెందుతారు. అయితే వీరికి ఎవరైనా క్షమాపణ అడిగితే, వీరు కొంత అసౌకర్యంగా ఫీలవుతారు.

English summary

Zodiac signs who are too proud to apologize

According to astrology these zodiac signs are too proud to apologize. Read on.
Story first published: Wednesday, March 25, 2020, 17:11 [IST]