For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ కంటే శృంగారాన్నే ఎక్కువగా ఇష్టపడే రాశిచక్రాలేవో తెలుసా...

|

సంబంధాల విషయానికొస్తే మన సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒక్కో భిన్నమైన అభిప్రాయం మరియు భిన్నమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహం మరియు కుటుంబం అనే ఆలోచనలంటే బాగా ఇష్టపడతారు.

ఇంకొందరు ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా ఉండటమే కాదు.. తాము పెద్దలు కుదర్చిన పెళ్లినే చేసుకుంటామని.. అలా చేస్తే తమ కాపురం కలకాలం పాటు హాయిగా సాగుతుందని భావిస్తారు.

అయితే ప్రస్తుతం 2020 కాలంలో చాలా మంది పాశ్చాత్య కల్చర్ కు అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగానే డేటింగ్ మరియు హుక్ ఆప్ వంటి ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇదిలా ఉండగా.. మరీ ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ వాళ్లు ఎలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారో మనందరం కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇందుకోసం మీకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. దీని ప్రకారం కొన్ని రాశి చక్రాల వారు ప్రేమ కన్నా శృంగారానికే ఎక్కువ ఆసక్తి చూపుతారంట... ఎందుకని వారు ఇలా చేస్తారో.. ఇందుకు గల కారణాలేంటి.. ఇంతకీ ఆ రాశిచక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మగవారు 'ఆ' విషయంలో ఈ తప్పులను ఎప్పటికీ చేయకండి.. జర భద్రంగా ఉండండి...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే వీరు ప్రేమ అనేదాన్ని కేవలం ఒక భాగం అని భావిస్తారు. వీరు ప్రేమ కన్నా ఎక్కువగా తమ భాగస్వామితో సరసాలాడేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకాదు వీరు ఎవరినైనా ఇష్టపడితే.. వెంటనే వారితో పడకగదిలో కలిసి కోరికలను తీర్చుకోవాలని ఆరాటపడతారంట. మరో విశేషమేమిటంటే.. ఎవరిపై అయినా వీరు మనసు పడితే వారికి ఇష్టం లేకున్నా.. వారితో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారంట.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ పట్ల మంచి ఆకలితో ఉంటారు. వీరు తమ భాగస్వామితో శారీరక సాన్నిహిత్యంలో పాల్గొన్నత ర్వాత, అలాంటి ప్రతి ఆలోచనను సాధారణంగానే పక్కన బెట్టడానికి ఇష్టపడతారు. అలాంటి కార్యం కోసం మంచి సమయం దొరికితేనే శ్రద్ధ చూపుతారు. అయితే అదే సమయంలో వారి భాగస్వామికి ఆ విషయంలో ప్రేమ ఉందా లేదా అనే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. వీరికి ప్రేమ కంటే శృంగారంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు సాహసోపేత స్వభావానికి బాగా ప్రాచుర్యం పొంది ఉంటారు. వీరి లైంగిక జీవితం భిన్నంగా ఏమీ ఉండదు. అయితే వీరు సంబంధంలో ఉన్న వారికి కట్టుబడి ఉండటానికి మంచి సమయం తీసుకుంటారు. వీరు వన్ నైట్ స్టాండ్స్ మరియు సాధారణ డేటింగుతో చాలా సౌకర్యంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఏదైనా ప్రయత్నించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఇది వీరి లైంగిక జీవితానికి కూడా వర్తిస్తుంది. వీరు మొదట్లో శృంగారం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు ఎప్పుడైతే దానికి ఆకర్షితులవుతారో వాటి అనుభూతుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.

మగాళ్లతో డేటింగుకు వెళ్లే ముందు.. ఈ విషయాలను అస్సలు మరువకండి... లేదంటే మీరే చింతిస్తారు...!

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శృంగారం అంటే అద్భుతమైన ఆసక్తి ఉంటుంది. వీరు 24 గంటలలో ఎప్పుడైనా సరే ఆ కార్యం కోసం సిద్ధంగా ఉంటారు. అయితే పడకగదిలో వీరి భాగస్వామి మాత్రం అలాంటి వాటికి సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ వీరి భాగస్వామి వీరిని రమ్మని పిలుస్తున్నట్లు ఆశిస్తూ.. ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ ఆ కార్యంలో పాల్గొనకపోయినా.. కనీసం కలయికలో పైపై రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడతారు. వీరికి శృంగారం విషయంలో మంచి, చెడు అనే నిబంధనలేవీ పట్టవు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు శృంగారం విషయంలో ఎక్కువ అనుభూతిని, ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. వీరు చాలా విషయాల్లో బాధ్యత వహించడాన్ని బాగా ఇష్టపడతారు. అందుకే వీరు శృంగారం చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. వీరు ఒక్క భాగస్వామితోనే కాకుండా.. ఎవరితో అయినా తమ శారీరక సాన్నిహిత్యాన్ని కొనసాగించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వాటిని చాలా ఆహ్లదకరంగా భావిస్తారు.

English summary

Zodiac signs who prefer Romance over love

Here we talking about the zodiac signs who prefer romance over love. Read on,