Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
60 ఏళ్లు దాటిన తర్వాత కూడా..ఈ చిట్కాలు పాటిస్తే శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు!
లవ్, ఎమోషన్, రొమాన్స్.. ఈ పదాలు వినగానే మనకు యవ్వనమే గుర్తుకొస్తుంది. వయసు మళ్లిన జంట చేయి చేయి పట్టుకుని నడుస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. కానీ వారి మధ్య సాన్నిహిత్యం గురించి ఊహించుకోవడానికే మన సమాజం సిగ్గుపడుతుంది. ఈ వయసులో మనవళ్లు,మనవరాళ్లతో ఆడుకోవాలి కానీ ఇవన్నీ అవసరమా? అని అనిపిస్తుంటది. కానీ నిజం ఏమిటంటే జీవిత చరమాంకంలో, 60-70 ఏళ్ల వయసులో కూడా శారీరక సాన్నిహిత్యం అందించే ఆనందం వర్ణనాతీతం. అది ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వయసులో అనుభవించే శారీరక సంభోగం మరింత ఉత్తేజకరంగా, గాఢంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మధురానుభూతిని పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
నెమ్మదిగా.. నిండుగా
వయసు పెరిగేకొద్దీ మన శరీరం స్పందించే తీరు మారుతుంది. ఇది సహజం. శారీరక సాన్నిహిత్యానికి ఉత్తేజం కలగడానికి కాస్త సమయం పట్టవచ్చు.. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే తొందరపాటు వద్దు. నెమ్మదిగా మొదలుపెట్టండి. ఒకరికొకరు సమయం ఇచ్చుకోండి. ఇది ఉత్సాహాన్ని సరైన స్థాయిలో పెంచి, అనుభూతిని రెట్టింపు చేస్తుంది. కొందరిలో ఆరోగ్య సమస్యలు రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో ఏకాంతాన్ని ఆస్వాదించడం మేలు.

సౌకర్యమే తొలి మెట్టు
మీ ఏకాంత సమయం ఆనందంగా, సౌకర్యవంతంగా ఉండాలి. దీనికి మీ బెడ్ రూమ్ ని సిద్ధం చేసుకోండి. మెత్తని దిండ్లు, మీకు నచ్చిన వాతావరణం ప్రతిదీ మీ సౌకర్యాన్ని పెంచేలా ఉండాలి. శారీరకంగా సౌకర్యవంతమైన స్థితిలో పొందే సంతృప్తి రెట్టింపు అవుతుంది.
ఆన్ లైన్ తో అడ్డంకులు దూరం
వయసు పైబడిన మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య యోని పొడిబారడం. దీనికి లూబ్రికెంట్లు చక్కటి పరిష్కారం. అయితే వీటిని స్థానిక దుకాణాల్లో కొనడానికి చాలామంది సిగ్గుపడతారు లేదా సామాజికంగా ఇబ్బందిపడతారు. ఈ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ ఒక వరం. మీకు కావాల్సిన వాటిని ఎవరికీ తెలియకుండా సౌకర్యంగా ఇంటికే తెప్పించుకోవచ్చు.
కొత్త స్పర్శతో సరికొత్త బంధం
శృంగారం అంటే కేవలం సంభోగం మాత్రమే కాదు. ఒకరినొకరు కొత్తగా తాకడం, సాన్నిహిత్యం కోసం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పర్శ భాషను సృష్టించుకోవడం మీ పాత బంధానికి కొత్త జీవం పోస్తుంది. ఈ వయసులో పురుషాంగం గట్టిపడటం లేదా భాగస్వామి స్పర్శకు శరీరం వెంటనే స్పందించకపోవడం సహజం. దాని గురించి చింతించవద్దు. ఈ కొత్త స్పర్శ భాషతో ప్రేమను పెంచుకోండి.
ఆత్మవిశ్వాసమే అసలైన మంత్రం
ఏ వయసులోనైనా లైంగిక జీవితం ఆనందంగా ఉండటానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో ఇది మరింత అవసరం. నేను చేయగలను, మేము ఆనందంగా ఉండగలం అనే నమ్మకం మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వయసు అనే అడ్డుగోడను పగలగొట్టి మీ అనుబంధంలో కొత్త ఆనందాన్ని నింపుకోవడం ఖాయం.



Click it and Unblock the Notifications