Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
లవర్ తో గడపాలనుకున్నోళ్ల కోసం ప్రత్యేక హోటల్స్..అద్దాల పైకప్పులు, రహస్య ప్రవేశాలు
జపాన్ పేరు వినగానే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, క్రమశిక్షణ, టెక్నాలజీ, సున్నితమైన చెర్రీ పువ్వులు, సువాసనలు వెదజల్లే మాచా టీ వంటివి మనసులో మొదటగా మెదిలేవి. అన్నీ పద్ధతిగా, చక్కగా అమర్చినట్లు ఉంటాయి. కానీ ఈ వ్యవస్థీకృత ప్రపంచం వెనుక మరో రహస్య ప్రపంచం ఉంది. అది స్వేచ్ఛ, ప్రేమ, ఉత్సాహంతో నిండిన ప్రపంచం. ఆ ప్రపంచానికి తలుపులు తెరిచేవే జపాన్ ప్రసిద్ధ ప్రేమ హోటళ్లు.
ఈ ప్రేమ హోటళ్ల సంస్కృతికి శతాబ్దాల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో బహిరంగ ప్రేమను సమాజం అంగీకరించని రోజుల్లో ప్రేమికులు రహస్యంగా కలుసుకోవడానికి టీ హౌస్ లను ఆశ్రయించేవారు. కాలక్రమేణా ఆ రహస్య నిలయాలే ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. 1968లో ఒసాకాలో ప్రారంభమైన హోటల్ లవ్ ఈ తరహా హోటళ్లకు నాంది పలికింది. అప్పటి నుండి ముఖ్యంగా టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో ఇవి ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగాయి.

పగలు సాధారణ హోటళ్లలా కనిపించినా చీకటి పడగానే ఈ హోటళ్లు నియాన్ దీపాలతో కొత్త రంగులను అద్దుకుంటాయి. షిబుయా వీధుల్లోకి అడుగుపెడితే ప్రతి హోటల్ ఒక కొత్త కథ చెబుతుంది. ఇక్కడి గదులు కేవలం నాలుగు గోడల నిర్మాణాలు కావు..అవి ఊహకు అందని అద్భుత ప్రపంచాలు. కొన్ని గదులు రాజుల కోటల్లా ఉంటే మరికొన్ని అంతరిక్ష నౌకల్లా ఉంటాయి. జైలు గదులు, హాస్పిటల్స్, హలో కిట్టి థీమ్ లు, సముద్ర గర్భంలా కనిపించే గదులు.. ఇలా జంటల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విభిన్నమైన థీమ్ లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఈ హోటళ్ల రూపకల్పనలో గోప్యతకు పెద్దపీట వేస్తారు. కస్టమర్లు ఒకరినొకరు చూసుకోకుండా ప్రత్యేక ప్రవేశాలు, సిబ్బందితో సంబంధం లేకుండా వెండింగ్ మెషీన్ల ద్వారా గదుల ఎంపిక, కారు పార్కింగ్ నుండి నేరుగా గదికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం వంటివి ఉంటాయి. గదుల లోపల అద్దాల పైకప్పులు, శబ్దం చొరబడని గోడలు, ప్రత్యేకమైన బొమ్మలు, విలాసవంతమైన బాత్రూమ్ లు వంటి అనేక ఆకర్షణలుంటాయి.
కేవలం ప్రేమికులే కాదు..ఒంటరిగా ప్రశాంతత కోరుకునేవారు, అలసిపోయిన ప్రయాణికుల, లేదా ఈ వింత గదులను చూడాలనుకునే పర్యాటకులు కూడా గంటల చొప్పున అద్దెకు తీసుకుని ఇక్కడ సేదతీరుతారు. నేడు జపాన్‌లో 37,000కు పైగా లవ్ హోటళ్లు ఉన్నాయి. ఒక్క టోక్యో, ఒసాకా నగరాల్లోనే ఇవి ఏటా రూ. 3.5 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాయంటే జపాన్ సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలో వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications