Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
డేటింగ్ రూల్స్ మారాయి గురూ..2025లో యువత ఫాలో అయిన 5 కొత్త లవ్ ట్రెండ్స్
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ప్రతి ఏడాదీ లాగే ఈ సంవత్సరం కూడా మనకు ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే లవ్, రిలేషన్ షిప్స్ విషయంలో మాత్రం 2025 చాలా ప్రత్యేకం. ప్రేమంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదని, అందులో భద్రత, నిజాయితీ కూడా ముఖ్యమని ఈ తరం నిరూపించింది.
ఫ్లడ్ లైటింగ్ నుండి భవిష్యత్తు ప్రూఫింగ్ వరకు అనేక కొత్త పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రేమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఆ టాప్ 5 ట్రెండ్స్ ఏంటో ఇక్కడ చూడండి.

ఫ్లడ్ లైటింగ్ డేటింగ్
ఇదొక విచిత్రమైన, కాస్త ప్రమాదకరమైన ట్రెండ్. సాధారణంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ఫ్లడ్ లైటింగ్ పద్ధతిలో మొదటి ఒకటి లేదా రెండు డేటింగ్స్ లోనే ఒక వ్యక్తి తన వ్యక్తిగత కష్టాలు, గతం తాలూకు గాయాలు, ఎమోషనల్ స్ట్రగుల్స్ మొత్తం అవతలి వారిపై కుమ్మరిస్తారు.
ఫ్లడ్ లైట్ వేస్తే కళ్లు ఎలా బైర్లు కమ్ముతాయో, ఈ ఓవర్ షేరింగ్ వల్ల అవతలి వ్యక్తి అలాగే ఇబ్బంది పడతారు. ఇది రిలేషన్ షిప్ లో అసమతుల్యతను తెస్తుంది. ఇక్కడ ప్రేమ కంటే సానుభూతి డామినేట్ చేస్తుంది కాబట్టి నిపుణులు దీనిని ఒక రెడ్ ఫ్లాగ్ గా హెచ్చరిస్తున్నారు.
మైక్రో రొమాన్స్
ప్రేమను వ్యక్తపరచడానికి ఖరీదైన బహుమతులే అక్కర్లేదు..చిన్న చిన్న విషయాలు చాలు అని చెప్పేదే మైక్రో రొమాన్స్. రోజువారీ జీవితంలో చిన్న చిన్న హ్యాపీనెస్ ను షేర్ చేసుకోడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ ట్రెండ్ ఉద్దేశం.
ఉదాహరణకు తమ పార్టనర్ మూడ్ కి తగ్గట్టుగా మంచి మీమ్స్ షేర్ చేయడం, ఇష్టమైన పాటల ప్లే లిస్ట్ పంపుకోవడం లేదా చిన్న ప్రశంసతో కూడిన మెసేజ్ చేయడం. ఈ చిన్న చర్యలు బంధాన్ని ఎంతో బలపరుస్తాయి.
డేట్ విత్ మీ(DWM)
DWM అనేది పూర్తి నిజాయితీతో కూడిన బంధానికి ప్రతీక. సోషల్ మీడియాలో చూపించే ఆదర్శవంతమైన ప్రేమలా కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండేదే ఈ ట్రెండ్. ఇందులో జంటలు కేవలం ఆనందాలే కాదు..జీవితంలోని కష్టసుఖాలను, ఒడిదుడుకులను కూడా పారదర్శకంగా చర్చించుకుంటారు. నీ కష్టంలోనూ నేను తోడుంటాను అని ఒకరికొకరు మద్దతుగా నిలవడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత.

ఫ్యూచర్ ప్రూఫింగ్
ఈ రోజుల్లో షార్ట్ టర్మ్ డేటింగ్ లేదా టైమ్ పాస్ సంబంధాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. 2025లో చాలా మంది ఫ్యూచర్ ప్రూఫింగ్ వైపు మొగ్గు చూపారు. అంటే కేవలం ఇప్పటి ఆకర్షణ కోసమే కాకుండా, భవిష్యత్తులోనూ తోడుగా నిలిచే దీర్ఘకాలిక భాగస్వామి కోసం వెతకడం. ముఖ్యంగా మహిళలు తమకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ, భవిష్యత్తులో స్థిరత్వాన్ని, భద్రతను ఇచ్చే వారినే ఎంచుకుంటున్నారు.
సాఫ్ట్ లాంచింగ్
ఇది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ట్రెండ్. తమ రిలేషన్ షిప్ గురించి ప్రపంచానికి ఒకేసారి చెప్పకుండా మెల్లగా హింట్స్ ఇవ్వడమే సాఫ్ట్ లాంచింగ్.
ఉదాహరణకు, ముఖం కనిపించకుండా చేతులు పట్టుకున్న ఫోటోలు పెట్టడం లేదా వెనుక నుండి తీసిన ఇద్దరి ఫోటోలు పోస్ట్ చేయడం వంటివి. దీనివల్ల తమ జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారని చెప్పకనే చెబుతారు, అదే సమయంలో తమ పార్టనర్ వివరాలను గోప్యంగా ఉంచుతారు.
మొత్తానికి 2025లో ప్రేమ సరళి మారింది. ఆకర్షణ కంటే నమ్మకం, ఆవేశం కంటే భవిష్యత్తు ముఖ్యమని ఈ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications