Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ట్రావెలింగ్ టైంలో ప్రేమ ఎందుకు పుడుతుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
ప్రయాణం లేదా ట్రావెలింగ్..ఉరుకుల పరుగుల జీవితంలో ఓ చిన్న విరామంలాంటిది. కిటికీ పక్కన కూర్చుని పచ్చని పొలాలను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ సాగే ఆ ప్రయాణం మనసుకు ఎంత హాయినిస్తుందో మాటల్లో వర్ణించలేం. అయితే ట్రావెలింగ్ అనేది కేవలం కొత్త ప్రదేశాలనే కాకుండా కొన్నిసార్లు కొత్త బంధాలను కూడా పరిచయం చేస్తుంది. ముఖ్యంగా ప్రేమను.
కొన్నిసార్లు బస్సు ప్రయాణంలోనో, రైలు ప్రయాణంలోనో, విమానాశ్రయంలో వేచి ఉన్నప్పుడో.. అప్పటివరకు అపరిచితంగా అనిపించిన ఓ ముఖం క్షణాల్లో మన సొంతంలా అనిపిస్తుంది. కళ్ళు కళ్ళతో మాట్లాడతాయి, మనసులు మాటల్లేకుండానే కలిసిపోతాయి. అయితే అసలు ఎందుకిలా జరుగుతుంది? ప్రయాణంలో ప్రేమ ఎందుకంత త్వరగా పుడుతుంది? దీని వెనుక ఉన్న రహస్యమేంటో ఇక్కడ చూడండి.

హార్మోన్ల మాయాజాలం
దీనికి ప్రధాన కారణం ప్రయాణంలో మనం పొందే ఉత్సాహం. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త అనుభవాలు మనలో అంతులేని ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ సమయంలో మన నాడీ వ్యవస్థ చురుగ్గా మారి అడ్రినలిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మనల్ని ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. సరిగ్గా ప్రేమలో పడినప్పుడు కూడా ఇదే హార్మోన్ మనలో పనిచేస్తుందని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతుంటారు. ఉదాహరణకు మీరు ఓ చల్లని కొండ ప్రాంతంలో ఉన్నారనుకోండి. మంచులాంటి గాలి మీ ముఖాన్ని తాకుతుంటే సరిగ్గా అప్పుడే మీలాగే సాహసాలను ఇష్టపడే వ్యక్తి తారసపడితే? గుండె వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ హై ఫీలింగ్ వల్ల భావోద్వేగాలు వేగంగా పుట్టుకొస్తాయని చెబుతున్నారు.
ఒత్తిడి లేని స్వేచ్ఛా ప్రపంచం
ట్రావెలింగ్ సమయంలో ప్రేమ పుట్టడానికి మరో ముఖ్యమైన కారణం.. రోజువారీ జీవితం నుండి లభించే విరామం. ఆఫీస్ టెన్షన్లు, ఇంటి బాధ్యతలు, రోజూ చూసే అవే ముఖాలు వీటన్నింటికీ దూరంగా, ప్రయాణంలో మన మనస్సు స్వేచ్ఛా విహంగంలా మారుతుంది. ఎలాంటి ఒత్తిడి, బాధ్యతలు లేకపోవడంతో మనసు తేలికపడుతుంది. ఇలాంటి ప్రశాంతమైన స్థితిలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి, కలవడానికి మనం ఏమాత్రం సంకోచించం.
రైల్లో ఎదురుగా ఉన్న బెర్తులో కూర్చున్న వారితో మొదలైన ఓ చిన్న మాటల ప్రయాణం, గమ్యం చేరేలోపు ఓ అందమైన ప్రేమకథగా మారడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే చాలా సర్వేల్లో సెలవుల్లో ఉన్నప్పుడు ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల ప్రేమ త్వరగా చిగురిస్తుందని 70 శాతానికి పైగా ప్రజలు నమ్ముతున్నారని తేలింది.
ఒక్క చూపు చాలు
కంటిచూపుతోనే ప్రేమ పుడుతుంది అనే మాట పాతదే అయినా ప్రయాణంలో ఇది అక్షరాలా నిజమవుతుంది. చుట్టూ అపరిచితులు ఉన్నప్పుడు ఓ చిరునవ్వు, ఓ చూపు చాలు బంధం మొదలవడానికి. ప్రయాణంలో మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇంట్లో సిగ్గుపడే వ్యక్తులు కూడా బయట కొత్త ప్రదేశాలలో ఎంతో ధైర్యంగా, అందరితో కలిసిపోతారు. ఈ పెరిగిన ఆత్మవిశ్వాసం ఎదుటివారిని ఆకర్షించడానికి దోహదపడుతుంది. అందుకే ప్రయాణంలో మొదలైన బంధాలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి.



Click it and Unblock the Notifications