Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కుర్రాళ్లు తమకంటే పెద్ద వయసు స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారో తెలుసా?
ప్రేమ గుడ్డిది అనే మాట తరచుగా మనం వింటుంటాం. ప్రేమకు కళ్లు లేవంటారు.. ఆకర్షణకు వయసుతో పనిలేదంటారు. కానీ నిజ జీవితంలో చూస్తే చాలా సందర్భాల్లో యువకులు తమకంటే వయసులో పెద్దవారైన స్త్రీల పట్ల ఆకర్షితులవ్వడం, వారిలో తమ జీవిత భాగస్వామిని వెతుక్కోవడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఇది కేవలం శారీరక ఆకర్షణో లేదా ఆవేశమో కాదు. దీని వెనుక లోతైన మానసిక కారణాలు, నెరవేరని భావోద్వేగ అవసరాలు బలంగా ఉన్నాయి. సైకాలజీ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారో ఇక్కడ చూడండి.

భావోద్వేగ స్థిరత్వం
యువకులు తరచుగా జీవితంలో గందరగోళాన్ని, ఒత్తిడిని అనుభవిస్తుంటారు. అదే వయసులో పెద్దవారైన స్త్రీలు జీవితాన్ని దగ్గరగా చూసి ఉంటారు. కష్టసుఖాలను రుచి చూసి ఉంటారు కాబట్టి వారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందరు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వారికి బాగా తెలుసు.
ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ యువకులకు ఒక భరోసానిస్తుంది. తమ పక్కన ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి ఉన్నారన్న భావన వారికి రక్షణగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. డ్రామా లేని జీవితాన్ని కోరుకునే పురుషులు సహజంగానే ఈ స్థిరత్వానికి ఆకర్షితులవుతారు.
వెచ్చని ఆదరణ, సంరక్షణ
చిన్నతనంలో తమ తల్లులతో బలమైన అనుబంధం ఉన్న పురుషులు లేదా చిన్నప్పుడు తల్లి ప్రేమకు దూరమైన వారు.. తమ భాగస్వామిలో ఆ ఆప్యాయతను, సంరక్షణను కోరుకుంటారు.
వయసులో పెద్దవారైన స్త్రీలలో సహజంగా ఉండే సంరక్షించే గుణం(కేరింగ్ నేచర్), ఓదార్పునిచ్చే స్వభావం పురుషులకు మానసిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. కేవలం ప్రేయసిగానే కాకుండా, కష్టాల్లో ఓదార్చే ఒక ఆత్మీయురాలిగా వారిని చూస్తారు.
స్పష్టత, ఆత్మవిశ్వాసం
సాధారణంగా యువతుల్లో ఉండే సందిగ్ధత, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి పెద్ద వయసు స్త్రీలలో తక్కువగా కనిపిస్తాయి. వారికి తాము ఏమి కోరుకుంటున్నామో, జీవితం నుండి ఏమి ఆశిస్తున్నారో స్పష్టమైన అవగాహన ఉంటుంది.
వారిలోని ఈ ఆత్మవిశ్వాసం పురుషులకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తమ కాళ్ల మీద తాము నిలబడే తత్వం, స్వతంత్ర భావాలు పురుషులను వారి వైపు తిప్పుకునేలా చేస్తాయి.
జీవితానికి మార్గదర్శకత్వం
కొంతమంది పురుషులకు తమ జీవితాన్ని, కెరీర్‌ను సరైన దారిలో పెట్టే ఒక గైడ్ లేదా మెంటర్ అవసరం ఉంటుంది. అనుభవజ్ఞులైన మహిళలు ఇచ్చే సలహాలు, వారికున్న లోకజ్ఞానం యువకులకు ఎంతో ఉపయోగపడతాయి. వారి సాంగత్యం స్నేహంగా మొదలై, ఆరాధనగా మారి, చివరకు ప్రగాఢమైన ప్రేమగా మారుతుంది.
సామాజిక తిరుగుబాటు
సమాజం గీసిన గీతలను దాటడంలో కొందరికి ఒక తెలియని కిక్ ఉంటుంది. సాధారణ ఆచారాలకు భిన్నంగా, వయసులో పెద్దవారైన స్త్రీతో సంబంధం పెట్టుకోవడం అనేది ఒక సాహసంగా భావించే వారు కూడా ఉంటారు. అయితే ఇది అందరికీ వర్తించదు.



Click it and Unblock the Notifications