Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లవ్ మ్యారేజ్ VS అరేంజ్డ్ మ్యారేజ్..ఏది బెటర్?..సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏమంటున్నారంటే...
మనదేశంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరి వ్యక్తులకు సంబంధించిది మాత్రమే కాదు..రెండు కుటుంబాల కలయిక. హిందూ సంప్రదాయంలో పెళ్లిని ఏడు జన్మల బంధంగా, పవిత్రమైన బాధ్యతగా భావిస్తారు.
బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకులు అనేవి ఇంకా చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో వాటి సంఖ్య పెరుగుతుందనేది కాదనలేని సత్యం. దాంపత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుండటంతో పెళ్లికి ముందే సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.

అయితే యువతలో ఎప్పుడూ మెదిలే ప్రశ్న ఒక్కటే..లవ్ మ్యారేజ్ మంచిదా? లేక పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదా? మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం బెటర్ అని కొందరు భావిస్తే..తల్లిదండ్రుల అనుభవంతో ఎంచుకున్న సంబంధమే సురక్షితమని మరికొందరు నమ్ముతారు. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తనదైన శైలిలో ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వివాహ బంధం స్థిరత్వం గురించి సద్గురు మాట్లాడుతూ .. స్పెయిన్ లో విడాకుల రేటు 65 శాతం, రష్యాలో 51 శాతం, అమెరికాలో 43 శాతం ఉండగా, భారతదేశంలో ఇది కేవలం 1.5 శాతం మాత్రమే ఉంది అని సద్గురు అన్నారు. ఈ లెక్కన ఏ పద్ధతిలో వివాహ బంధం విజయవంతమవుతుందో, ఎక్కడ కుటుంబ వ్యవస్థ బలంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చని ఆయన సూచించారు.
తల్లిదండ్రుల నిర్ణయం ఎందుకు ముఖ్యం?
పెద్దలు కుదిర్చిన వివాహాల గురించి సద్గురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యువత కొన్నిసార్లు తాత్కాలిక ఆకర్షణ లేదా భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు.. మీరు ఒక వ్యక్తి వేసుకున్న దుస్తులనో, వారి హావభావాలనో చూసి పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు.
కానీ పెళ్లయ్యాక ఆ ఆకర్షణ మాత్రమే సరిపోదని మీకు అర్థమవుతుంది. అదే తల్లిదండ్రులైతే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, దూరదృష్టితో ఆలోచిస్తారు అని ఆయన అన్నారు.
తల్లిదండ్రుల ఎంపికలో 100 శాతం సరైన జడ్జ్ మెంట్ ఉండకపోవచ్చు.. కానీ వారి ఉద్దేశం మాత్రం ఎప్పుడూ మీ మంచినే కోరుకుంటుంది. వారు మీ శ్రేయస్సును కాంక్షించి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మెరుగ్గా ఉంటాయని సద్గురు అభిప్రాయపడ్డారు. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ పరిణతి చెంది ఉంటే..మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు.
చివరిగా గమనించాల్సింది ఇదే..
పెళ్లి అనేది ప్రేమదా లేక పెద్దలు కుదిర్చినదా అన్నది పక్కన పెడితే.. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను కచ్చితంగా గమనించాలి.
వారు ఇతరులతో, ముఖ్యంగా పెద్దలతో ఎలా ప్రవర్తిస్తున్నారు?..మీ కుటుంబం పట్ల వారి అభిప్రాయాలు ఏమిటి?..వారి కుటుంబ నేపథ్యం, సంస్కారం ఎలాంటిది?..జీవితాంతం కలిసి ప్రయాణించడానికి వారు మానసికంగా సిద్ధంగా ఉన్నారా?
సాధారణంగా పెద్దలు సంబంధం చూసేటప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా ఆకర్షణను దాటి ఈ వాస్తవాలను పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.



Click it and Unblock the Notifications